Breaking News

’రైజింగ్‌ కాన్షియస్‌ డాటర్స్‌’ ..! ప్లీజ్‌ కూతుళ్లను..

Published on Fri, 04/03/2026 - 08:58

‘ఆ అమ్మాయి ఎంత నల్లగా ఉందో..’‘అమ్మో, ఆమె బరువుకు ఆ స్టేజ్‌ విరిగిపోతుందేమో..!’‘ఆ ముక్కు ఎంత వంకరో ...’‘ఎత్తు పళ్లు..’ ‘చీమ కళ్లు..’ఇలా సూదుల్లా మనసును గాయపరిచే మాటలకు ఆత్మన్యూనతతో కుంగిపోతూ... ‘శరీరాన్ని సరిచేసుకోవాలి’ అనే మనస్తత్వాన్ని పెంచుకుంటున్నారు అమ్మాయిలు.  ఈ క్రమంలో కెరియర్‌ వైపు కాకుండా రూపం కోసం తమ సమయాన్ని, డబ్బును ఖర్చు చేస్తున్నారు. ‘శారీరక సౌందర్యం మనల్ని పరిపూర్ణ వ్యక్తులను చేయదు. మన శరీరం ఓ వస్తువు కాదు, సరిచేసుకోవడానికి’ అంటున్నారు మనస్తత్వ నిపుణులు.

‘బాడీ షేమింగ్‌’ అనేది రూపానికి సంబంధించినది మాత్రమే కాదు. తరతరాలుగా మన సమాజంలో పాతుకుపోయిన ఒక లోతైన సమస్య. కొందరు ఎదుటివారి శారీరక లోపాలను ఎగతాళి చేస్తే, మరికొందరు తమ శరీర లోపాలకు తమను తామే తిట్టుకుంటుంటారు. కాలేజీకి వెళ్లాల్సిన స్నేహ రెడీ అవడానికి ఈ మధ్య అద్దం ముందు నిలబడటం లేదు. ఫొటోలకు దూరంగా ఉంటోంది. గ్రూప్‌లో ఉన్నా, తనకి తాను కనిపించనట్టు వెనకే ఉంటోంది. 

ఒక రోజు క్లాస్‌లో సబ్జెక్ట్‌పై ప్రెజెంటేషన్‌ ఉంది. ఆమె దానికి ప్రిపేర్‌ అయ్యి వచ్చింది. కానీ స్టేజ్‌ మీదకు వెళ్లే ముందు, వెనుక నుండి ఎవరో ‘స్టేజ్‌ బ్రేక్‌ అవుతుందేమో?’ అనే జోక్‌కి కొంతమంది నవ్వారు. మరికొంతమంది నవ్వు ఆపుకున్నారు. అంతే, స్టేజీ ఎక్కకుండానే వచ్చి తన సీటులో కూర్చొంది. ఆ రోజు తర్వాత ఆమె మాట్లాడటం తగ్గించింది. స్నేహితులతో కలవడం లేదు. ఇంట్లో కూడా ఓ మూలన ఎప్పుడూ ఏదో ఆలోచిస్తున్నట్టు కూర్చుంటుంది. తల్లిదండ్రులు ఎంత అడిగినా.. ‘ఏమీ లేదని’ దాటేస్తోంది.
∙∙ 
2025లో ఇంటర్నేషనల్‌ జర్నల్‌ ఆఫ్‌ ఇండియన్‌ సైకాలజీ రీసెర్చ్‌ ప్రకారం, బాడీ షేమింగ్‌ అనుభవం జెండర్‌ పరంగా చూస్తే భిన్నంగా ఉంది. మైసూరులో 10–19 ఏళ్ల మధ్య 155 మంది యువతులపై చేసిన అధ్యయనంలో, అమ్మాయిలలో 23.2 శాతం మంది బాడీ షేమింగ్‌ సమస్య అనుభవిస్తున్నారని చెప్పారు. అబ్బాయిలలో ఈ సమస్య 7.1 శాతం మాత్రంగానే ఉంది.

మనసుపై ఒక నిశ్శబ్ద దాడి

బాడీషేమింగ్‌ ఆత్మవిశ్వాసాన్ని తగ్గిస్తుంది. మైండ్‌లో బ్లాక్‌ స్పాట్స్‌ ఏర్పడి, మానసిక వికాసానికి అడ్డంకి అవుతాయి.

ఆందోళన పెరిగి, మనో నిగ్రహంపైన ప్రభావం చూపుతుంది.

డిప్రెషన్‌  లక్షణాలు కనిపిస్తాయి. తాను ‘దేనికీ సరికాదు’ అనే భావన పెరుగుతుంది.

శరీరాన్ని కరెక్ట్‌ చేసుకోవాలనే ఆలోచనతో ‘జిమ్‌కి వెళ్ళాలి, కాస్మటాలజీ చికిత్స చేయించుకోవాలి, మందులు వాడాలి, పోషకాహారం తినాలి...’ ఇలా వీటిమీద ఫోకస్‌ పెరుగుతుంది. దీంతో బ్యూటీ సెంటర్స్‌కు నెలకు రూ.40 వేల నుంచి లక్ష రూపాయల వరకు ఖర్చుపెడుతున్నవారున్నారు. స్లిమ్మింగ్‌ సెంటర్స్‌వైపు మొగ్గుచూపుతున్నారు. మధ్య, దిగువ తరగతికి ఇది పెను భారం అవుతోంది. 

కలర్‌ ట్రీట్‌మెంట్స్‌ ఇటీవల బాగా పెరుగుతున్నాయి. బ్యూటీ మెయింటెనెన్స్‌ విషయంలో అమ్మాయిలు ఇంట్లో వాళ్లమీద ఒత్తిడి పెంచుతున్నారు. బ్యూటీ ప్రొడక్ట్స్‌ మార్కెటింగ్‌ కుటుంబ స్థితిగతులపైనా ప్రభావం చూపుతుంది. కెరియర్‌ పరంగా ఎదగాలనుకునేవారు బాడీషేమింగ్‌ వల్ల శరీరంపై దృష్టిపెట్టి, తమపైన తాము ఒత్తిడిని పెంచుకుంటున్నారు. 

ఏం చేయాలంటే...
డిజిటల్‌ ఫ్లాట్‌ఫారమ్‌లలో శరీరాకృతిని విమర్శించడం సైబర్‌ బుల్లియింగ్‌కు సంబంధించినదే. ఆన్‌లైన్‌–ఆఫ్‌లైన్‌ లో శరీరాకృతిని విమర్శించే వారిని ఎదుర్కోవడానికి, వారు కలిగించే బాధను, వేదనను అధిగమించడానికి, ఆత్మగౌరవాన్ని తిరిగి పొందడానికి మార్గాలు ఉన్నాయి. 

ప్రతిభను అణచివేయడానికి అసూయ వల్ల ఇలా ‘బాడీషేమింగ్‌’కు పాల్పడుతున్నారని గ్రహించాలి. ఆహారాన్ని తగ్గించడం వల్ల పోషకాలు మైండ్‌కు చేరకపోవచ్చు. అందుకని సమతుల్య ఆహారాన్ని తీసుకోవాలి. 

కరుణ, సహనం .. వంటివి అలవర్చుకోవడానికి సాధన చేయాలి. శారీరక సౌందర్యం కంటే, ఆరోగ్యానికే ప్రాధాన్యత ఇవ్వాలి.  ఇతరులు ఎగతాళి చేసే రూపం కంటే తమలో తమకు నచ్చిన విషయాల పట్ల దృష్టి పెట్టాలి. 

ఒక రోజు స్నేహ అద్దం ముందు నిలబడి కన్నీళ్లు పెట్టుకుంటుండగా తల్లి చూసి అడిగింది. బాడీషేమింగ్‌ విషయం చెబుతూ ‘నా త΄ప్పా?!’ అని అడిగింది. ‘అలా అన్నవారి ఆలోచనలే తప్పు’ అని కూతురిని దగ్గరకు తీసుకుంది. విమర్శలను కాదని, తన శరీరాన్ని తాను అంగీకరించడం నేర్చుకుంది.

తప్పక ఛేదించాల్సిందే!
మన కూతుళ్లు తమ శరీరానికి సంబంధించి అన్ని విధాలుగా పరిపూర్ణంగా ఉండాలనే ఒత్తిడికి లోనవుతున్నారు. ఈ గాయాలు ఒక రోజులో అనుకోకుండా అయినవి కావు. మనం ఈ బాధాకరమైన సాంస్కృతిక వారసత్వాన్ని తప్పక ఛేదించాల్సిందే. ఈ కాన్సెప్ట్‌ ఆధారంగానే ’రైజింగ్‌ కాన్షియస్‌ డాటర్స్‌’ వర్క్‌షాప్‌ నిర్వహిస్తున్నాను. 

ఇందులో అమ్మాయిలు తమ బాల్యం నుండి ఎదుర్కోవాల్సిన అవసరం లేనివి, స్వేచ్ఛగా పెరగడానికి అవసరమైన సాధనాలను అందిస్తుంటాను. మనందరం కలిసి మానసిక ఒత్తిడి లేని ఒక కొత్త తరాన్ని పెంచుదాం.  
– డాక్టర్‌ షెఫాలీ సబేరీ,  క్లినికల్‌ సైకాలజిస్ట్‌  

పాజిటివ్‌గా మార్చుకోవాలి
కొందరి ఇండ్లలో తల్లిదండ్రులు, కజిన్స్, బంధువులు.. కూడా శారీరక లోపాలతో పిలిచేవారుంటారు. ఈ పద్ధతిని మార్చుకోవాలి. ఆత్మవిశ్వాసం లేనివారే ఎదుటివారి మనస్తత్వాన్ని దెబ్బతీస్తారనే విషయాన్ని ‘బాడీషేమింగ్‌’ అనుభవించేవాళ్లు అర్థం చేసుకోవాలి. 

మనసులో వచ్చే నెగటివ్‌ ఆలోచనలను గుర్తించి తమను తాము మార్చుకోవడం చాలా ముఖ్యం. మన శరీరం గురించి మనమే మంచి మాటలు చెప్పుకుంటే అది ఒక థెరపీలా పనిచేస్తుంది. పోలికల నుంచి దూరంగా ఉండాలి. వ్యక్తిత్వం, టాలెంట్‌ ముందు మిగతా వన్నీ చిన్నవే అని గ్రహించాలి.
– డాక్టర్‌ సునీతా ప్రసాద్, సైకాలజిస్ట్‌ 

– నిర్మలారెడ్డి, సాక్షి ఫీచర్స్‌ ప్రతినిధి

(చదవండి: ఒంటరితనం తెచ్చిపెడుతున్న ముప్పు..! నివేదికలో షాకింగ్‌ విషయాలు)

Videos

థ్యాంక్స్ జైపాల్.. మీకు నా సెల్యూట్.. పేర్ని నాని సెటైర్లు

కోల్ కతా నైట్ రైడర్స్ పై హైదరాబాద్ విజయం

ఒకేసారి 30 వేల మంది అవుట్.. ఒరాకిల్ మాజీ ఉద్యోగి సంచలన విషయాలు

జగన్ మావిగన్.. టీడీపీ ఉక్కిరిబిక్కిరి

గులాబీ రంగులో చంద్రుడు.. ఏదో జరగబోతోంది!

జనసేన నేత తాతంశెట్టి నాగేంద్ర, అనుచరులపై కేసు నమోదు

వీరులు పుట్టకముందే.. రాముడు ఉన్నాడు.. రామాయణం టీజర్ చూస్తే గూస్ బంప్స్ పక్కా

సాఫ్ట్ వేర్ సామ్రాజ్యం కుప్పకూలుతోందా?

చిక్కుల్లో TVK అధినేత హీరో విజయ్..

దళితుడిపై చేయి చేసుకున్న అయ్యన్నపాత్రుడు

Photos

+5

'ఇడియట్' రక్షిత బర్త్ డే సెలబ్రేషన్ (ఫొటోలు)

+5

క్రీస్తు త్యాగం.. సమస్త మానవాళికీ స్ఫూర్తిదాయకం (ఫొటోలు)

+5

నల్లమల అడవి : తెలంగాణలో జరిగే ఈ సాహస యాత్ర గురించి తెలుసా? (ఫొటోలు)

+5

ఏపీలో బ్రహ్మంగారు కాలజ్ఞానం రాసిన ఈ గుహ గురించి తెలుసా? (ఫొటోలు)

+5

ఒంటిమిట్ట : వైభవంగా శ్రీ కోదండ రామస్వామి వారి రథోత్సవం (ఫొటోలు)

+5

హైదరాబాద్‌లో ఘనంగా హనుమాన్‌ శోభాయాత్ర (ఫోటోలు)

+5

మార్చి జ్ఞాపకాల్లో నిక్కీ గల్రానీ-ఆది పినిశెట్టి జంట (ఫోటోలు)

+5

రూటు మార్చిన శృతి హాసన్‌.. ఈ సారి వయ్యారంగా.. (ఫోటోలు)

+5

సినీ కెరీర్‌.. సంతృప్తిగా లేనంటున్న హీరోయిన్‌ (ఫోటోలు)

+5

తెలంగాణ అమర్‌నాథ్‌ యాత్ర సలేశ్వరం జాతర ప్రారంభం (ఫొటోలు)