Breaking News

పాజిటివ్‌గా ఆలోచిద్దాం

Published on Thu, 04/02/2026 - 03:17

మానసిక ఎదుగుదల లేని పిల్లలున్న తల్లి మనస్తత్వం.. ఒత్తిడిని అధిగమించడానికి తీసుకోవాల్సిన జాగ్రత్తలు.. నిపుణుల సూచనలు.. సమస్యను ఎదుర్కొనే తల్లులకే కాదు, ఎదుటివారి కష్టాన్ని అర్ధం చేసుకోవాలనుకునేవారికీ అవగాహన అవసరం.. ‘వరల్డ్‌ ఆటిజం అవేర్‌నెస్‌ డే’ సందర్భంగా రేపటిని నిర్మించే తల్లుల కోసం..

కీర్తి పెళ్లయ్యి ఎనిమిదేళ్లయ్యింది. పిల్లలు కలగడం లేదని ఆందోళన చెందుతున్న ఆమెకు మరో ఏడాది లో బిడ్డ పుట్టాడు. ఆ ఇంట్లో ఎంతో ఆనందం. అయితే బాబుకు రెండేళ్ల వయసు వచ్చినా మాటలు రావడం లేదు. పిలిచినా స్పందన లేదు. ఇంట్లోవాళ్లు ‘కొందరు పిల్లలకు ఆలస్యంగా మాటలు వస్తాయి, అదేమంత పెద్ద విషయం కాదు...’ అనేవారు. కానీ, కీర్తి మనసులో ఏదో ఆందోళన. డాక్టర్‌ దగ్గరకు తీసుకెళ్లింది. రకరకాల పరీక్షల తర్వాత డాక్టర్‌ ‘మీ పిల్లవాడికి ఆటిజమ్‌ సమస్య ఉంది’ అని చెప్పగానే ఆమె ప్రపంచం ఒక్కసారిగా కూలిపోయినట్టు అనిపించింది. ఇంట్లో వాళ్లకు ఈ విషయం తెలిసింది. అందరూ మౌనంగా ఉండిపోయారు. ఆరోజు నుంచి కీర్తి ‘నా పిల్లవాడికే ఎందుకు ఇలా జరిగింది...?’ అంటూ ఏడుస్తూనే ఉంది.  

పారిపోతే పరిష్కారం ఉందా?!
మానసికంగా, భావోద్వేగంగా ఆటిజం పిల్లలున్న తల్లులు ప్రతి రోజూ సవాళ్లను ఎదుర్కొంటుంటారు. ∙ఆటిజం పిల్లల్లో శారీరకంగా ఎదుగుదల ఉంటుంది. కానీ, మానసికంగా ఇతరులపైనే ఆధారపడతారు కాబట్టి వారి భవిష్యత్తు గురించి తల్లి ఆందోళన చెందుతుంటుంది. ∙‘ఎప్పుడు ఏ పాపం చేశానో అని..’ తనను తాను నిందించుకుంటుంది. సమస్యకు దూరంగా ‘పారిపోదాం/ వదిలించుకుందాం’ అనుకునే సందర్భాలూ ఉంటాయి. ∙ఉద్వేగపూరిత ఆలోచనలు, పనుల ఒత్తిడి వల్ల తల్లి తన ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేసుకుంటుంది. లేదంటే, తనను తాను అస్సలు పట్టించుకోదు. నలుగురిలో కలవడానికి ఇష్టపడదు. ఇలాంటి సందర్భంలో అనేకమంది నిపుణులను కలిసింది కీర్తి. వారి ఫీడ్‌బ్యాక్‌తో పాజిటివ్‌గా ఆలోచించడం మొదలుపెట్టింది.

తనలో శక్తిని నింపుకుంటూ...
మొదట్లో నెగిటివ్‌గా ఉన్నా... థెరపిస్ట్‌ సూచనలతో ఐ కాంటాక్ట్, సింపుల్‌ పదాలు, రోజువారీ పనులు చేయించడం.. మొదలు పెట్టింది. ప్రతీ చిన్న సాధన ఆమెకు ఒక ప్రోగ్రెస్‌ అయ్యింది. ఇప్పుడు ఆ పిల్లవాడిలో చిన్న చిన్న మార్పులు కనిపిస్తున్నాయి. అవి చూశాక.. తనను తాను ఇంకా బలంగా మార్చుకుంది. తన బిడ్డను స్వతంత్రంగా తయారుచేయడమే లక్ష్యంగా పెట్టుకుంది. ఆటిజం సమస్య ఉన్న తల్లికి ఆ బిడ్డ ఎంత ప్రత్యేకమో అర్థం చేసుకుంటే మనసు తేలికపడుతుంది. అప్పటినుంచి రోజు తర్వాత రోజు మెరుగ్గా మార్చుకోవడం ఎలాగో మార్గాన్ని అన్వేషిస్తుంది. భవిష్యత్తును ఆ తల్లి అందంగా నిర్మిస్తుంది. 
 

ప్లానింగ్‌తోనే ప్రోగ్రెస్‌! 
∙పరిస్థితిని అర్థం చేసుకొని, అంగీకరించడం.. ఇది బలహీనత కాదు బలం అని గుర్తించడంతోపాటు సరైన శిక్షణ, సపోర్ట్‌ సిస్టమ్‌ ఉంటే భయం, ఆందోళన తగ్గుతాయి. ∙తల్లి బలంగా ఉంటేనే పిల్లలకు తగినంత సపోర్ట్‌ ఇవ్వగలదు. బిడ్డల మానసిక స్థితి బాగుండాలంటే నిపుణుల సహాయం తీసుకోవాలి. ∙ఆటిజం పిల్లలు ఎంత చిన్న పని చేసినా పెద్ద విజయంగా భావించి, ప్రోత్సహించాలి.  తమకు తాముగా ధ్యానం, వాకింగ్, చదవడం.. వంటివి రోజువారీ ప్లానింగ్‌లో భాగం చేసుకోవాలి. ఈ అలవాట్లు మానసికంగా రీఛార్జ్‌ చేస్తాయి. ∙లైఫ్‌ స్కిల్స్‌ ట్రైనింగ్, ఫ్యామిలీ సపోర్ట్, ఆర్థిక ప్రణాళికలు .. భవిష్యత్తు గురించిన ఆందోళన తగ్గిస్తాయి.

అంగీకరించాల్సిందే..!
పిల్లల్లో ఆటిజం సమస్య ఉందని తెలిశాక తల్లులపై మానసిక ఒత్తిడి చాలా ఉంటుంది. అయితే భావోద్వేగంతో కాకుండా వాస్తవపరిస్థితిని అంగీకరించి, సమస్యను అర్థం చేసుకోవాలి అని చెబుతుంటాం. పూర్తిగా నయం కావడానికి ఇది జబ్బు కాదు. కొన్ని మార్చలేనివి కూడా ఉంటాయి. ప్రతి చిన్న ప్రయత్నాన్ని సహనంగా చేస్తూ ఉంటే, పిల్లల్లో మెల్ల మెల్లగా మార్పు వస్తుంది. మిగతావారితో పోల్చుకోకుండా, తమ బిడ్డను ప్రత్యేకంగా, ధైర్యాన్ని, మమకారాన్ని అందిస్తూ పెంచాల్సి ఉంటుంది. దీనికి కుటుంబ సభ్యులు మద్దతుగా నిలిస్తే తల్లుల మీద ఒత్తిడి తగ్గుతుంది.
–  పటోళ్ల హారిక, బిహేవియర్‌ అనలిస్ట్‌
 
– నిర్మలారెడ్డి, సాక్షి పీచర్స్‌ ప్రతినిధి

#

Tags : 1

Videos

పేద బాలికలే అతడి టార్గెట్ చదివిస్తానని నమ్మించి..

రికార్డు స్థాయిలో ఏపీలో మద్యం వినియోగం

తిరుమలలో భారీ అగ్ని ప్రమాదం మంటల్లో కాలిపోయిన టాటా సుమో

పసిడి ప్రియులకు గుడ్ న్యూస్.. భారీగా తగ్గిన బంగారం ధరలు..

చమురు, గ్యాస్ కాదు.. ఈసారి కండోమ్ వంతు!

మచిలీపట్నంలో హైటెన్షన్.. జనసేన నేత ఇంటిని కూల్చేసిన టీడీపీ నేతలు

అమరావతి వృద్ధ మహిళా రైతు శేషగిరమ్మకు YS జగన్ భరోసా

నిన్ను వదిలిపెట్టే ప్రసక్తే లేదు..అవసరమైతే KCR కాళ్ళు పట్టుకు నైనా సరే..

అమరావతి పేరుతో చంద్రబాబు ఆంధ్రప్రజలను మోసం చేస్తున్నారు

వైఎస్ జగన్‌ని ఆశీర్వదించిన క్రైస్తవ మత పెద్దలు

Photos

+5

హైదరాబాద్‌లో ఘనంగా హనుమాన్‌ శోభాయాత్ర (ఫోటోలు)

+5

మార్చి జ్ఞాపకాల్లో నిక్కీ గల్రానీ-ఆది పినిశెట్టి జంట (ఫోటోలు)

+5

రూటు మార్చిన శృతి హాసన్‌.. ఈ సారి వయ్యారంగా.. (ఫోటోలు)

+5

సినీ కెరీర్‌.. సంతృప్తిగా లేనంటున్న హీరోయిన్‌ (ఫోటోలు)

+5

తెలంగాణ అమర్‌నాథ్‌ యాత్ర సలేశ్వరం జాతర ప్రారంభం (ఫొటోలు)

+5

దారులన్నీ కొండగట్టుకే.. భారీగా తరలివస్తున్న భక్తులు (ఫొటోలు)

+5

వామ్మో ఎండలు.. (ఫొటోలు)

+5

డిజైన్లకే రూ.401కోట్లు ఖర్చు..ఏంది సామీ ఇదంతా!: వైఎస్‌ జగన్‌ (ఫొటోలు)

+5

తిరుమల శ్రీవారి సేవలో అల్లు అర్జున్ కుటుంబం (ఫొటోలు)

+5

దేవతలా మిస్ ఇండియా నికితా పోర్వాల్‌..! (ఫొటోలు)