ఎవరిది గోల్డ్.. ఎవరిది రోల్ గోల్డ్..?
Breaking News
గంటల్లోనే రెచ్చిపోయిన బంగారం రేట్లు
Published on Wed, 04/01/2026 - 18:55
దేశంలో బంగారం ధరలు ఎప్పటికప్పడు మారిపోతున్నాయి. ఉదయం ఉన్న ధరలు సాయంత్రానికి ఉండటం లేదు. బుధవారం ఉదయం మోస్తరుగా పెరిగిన పసిడి ధరలు (Today Gold Rate) సాయంత్రానికి మరింత రెచ్చిపోయాయి.
హైదరాబాద్, విశాఖపట్నం సహా తెలుగు రాష్ట్రాల్లో బుధవారం ఉదయం రూ.1800 పెరిగి రూ.1,38,850 లుగా ఉన్న 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర సాయంత్రానికి మొత్తంగా రూ.3150 పెరిగి రూ.1,40,200 లకు ఎగిసింది.
అలాగే 24 క్యారెట్ల మేలిమి బంగారం 10 గ్రాముల ధర బుధవారం ఉదయం రూ.1970 పెరిగి రూ.1,51,480 లుగా ఉండగా సాయంత్రం తిరిగే సరికి మొత్తం రూ.3440 పెరిగి రూ. 1,52,950 లకు ఎగబాకింది.
ఇక వెండి ధరల (Today Silver Rate) విషయానికి వస్తే హైదరాబాద్ మార్కెట్‌లో ఈరోజు సిల్వర్ కేజీకి రూ.15000 పెరిగి రూ.2,65,000 వద్దకు ఎగిసింది.
(Disclaimer: పైన పేర్కొన్న బంగారం, వెండి ధరలు సూచనపూర్వకమైనవి మాత్రమే. వీటిపై జీఎస్టీ, టీసీఎస్, ఇతర పన్నులు, సుంకాలు అదనంగా ఉండవచ్చు. ఖచ్చితమైన ధరల కోసం మీ స్థానిక నగల దుకాణంలో సంప్రదించండి.)
Tags : 1