కొంచమైనా సిగ్గు ఉందా? ఈనాడు పిచ్చి రాతలపై దాడిశెట్టి రాజా ఆగ్రహం
Breaking News
పొదుపు పథకాలపై వడ్డీ రేట్లు ఇలా..
Published on Tue, 03/31/2026 - 18:36
నేషనల్ సేవింగ్స్ సర్టిఫికెట్, పీపీఎఫ్ సహా చిన్న పొదుపు పథకాలపై వడ్డీ రేట్లను కేంద్రం వరుసగా ఎనిమిదో త్రైమాసికంలోనూ యథాతథంగా కొనసాగించనుంది. 2026–27 ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికానికి సంబంధించి ఏప్రిల్ 1 నుంచి జూన్ 30 వరకు వివిధ స్మాల్ సేవింగ్స్ స్కీములపై వడ్డీ రేట్లలో మార్పులేమీ ఉండవని ఆర్థిక శాఖ సోమవారం ఒక నోటిఫికేషన్ విడుదల చేసింది.
దీని ప్రకారం సుకన్య సమృద్ధి స్కీముపై 8.2 శాతంగా, మూడేళ్ల టర్మ్ డిపాజిట్లపై 7.1 శాతంగా, పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ (పీపీఎఫ్), పోస్టాఫీస్ సేవింగ్స్ డిపాజిట్ స్కీములపై వరుసగా 7.1 శాతం, 4 శాతంగా వడ్డీ రేట్లు ఉంటాయి. కిసాన్ వికాస పత్రాలపై 7.5 శాతం, ఎన్ఎస్సీలపై 7.7 శాతం, మంత్లీ ఇన్కం స్కీముపై 7.4 శాతంగా వడ్డీ రేటు కొనసాగుతుంది. కేంద్రం చివరిసారిగా 2023–24 నాలుగో త్రైమాసికంలో కొన్ని పథకాల రేట్లను మార్చింది.
Tags : 1