క్రూర మృగాల్లా వెంట పడుతున్న వీధి కుక్కలు
Breaking News
జగదేక వీరా.. అసహాయ శూరా!
Published on Mon, 03/30/2026 - 04:31
రెండుసార్లు హనుమజ్జయంతి ఏమిటి?
హనుమంతుడు చైత్ర΄పౌర్ణమినాడు జన్మించినట్లు పలుచోట్ల కనిపిస్తుంది. అందుకే ఉత్తర భారతదేశం లోనూ, తెలంగాణ ప్రాంతంలోనూ చైత్రపూర్ణిమ నాడే హనుమజ్జయంతిని జరుపుకుంటారు. అయితే పరాశర సంహిత ప్రకారం హను మంతుడు వైశాఖ బహుళ దశమినాడు జన్మించినట్లు తెలుస్తోంది. పరాశర సంహిత హనుమ గురించి అధికంగా ప్రస్తావించడం వల్ల దానినే ప్రామాణికంగా తీసుకోవడం సముచితంగా ఆంధ్రా ప్రాంతంలో చాలామంది పండితులు భావిస్తూ అదే రోజున అక్కడి ఆలయాలలో జయంతి వేడుకలు నిర్వహిస్తారు.
కలౌ కపి వినాయకౌ: ...
అంటే కలియుగంలో త్వరగా ప్రత్యక్షమయ్యే దేవతా రూపాలు ... వినాయకుడు, హనుమంతుడు. భూత ప్రేత పిశాచాలు సైతం హనుమంతుడి పేరు చెప్తేనే భయపడి పారిపోతాయి. మహా రోగాలు నయం అవుతాయి. శని గ్రహం అనుకూలంగా లేకపోతే వచ్చే బాధలూ తొలగిపోతాయి. మంచి బుద్ధి బలం పెరుగుతుంది. కీర్తి లభిస్తుంది. ధైర్యం వస్తుంది.
యత్ర యత్ర రఘునాధ కీర్తనం
తత్ర తత్ర కృత మస్తకాంజలిం
బాష్ప వారి పరిపూర్ణ లోచనం
మారుతీం ్తనమత రాక్షసాంతకం
అంటే ఎక్కడ రామనామం వినిపిస్తూ వుంటుందో అక్కడ కళ్ళనిండా ఆనందబాష్పాలు నింపుకుని తలవంచి నమస్కరిస్తూ నిలబడి వుంటాడట రాక్షసులను దోమల లాగా నలిపి నశింపజేసే రామభక్తుడైన హనుమంతుడు.
జయ హనుమానుడు
హనుమంతుడు ఎక్కడ ఉంటే అక్కడ జయం సిద్ధిస్తుందని ప్రతీతి. శ్రీరామచంద్రుని పక్షాన చేరి ఆయన విజయానికి మూల కారణమయ్యాడు. మహాభారత యుద్ధంలో పాండవ మధ్యముడైన అర్జునుని పతాకంపై నిలిచి, పాండవుల విజయానికి కారణభూతుడయ్యాడు. అందుకే ఆంజనేయుని ప్రార్థించి చేసే ఏ పని అయినా తప్పక నెరవేరుతుందని నమ్మకం.
ఆదర్శ మూర్తి
యువత హనుమను చూసి నేర్చుకోవలసింది చాలా ఉంది. వాక్చాతుర్యం, సమయస్ఫూర్తి, పట్టుదల, ఎంత కష్టమైనా సరే, చెప్పిన పనిని శ్రద్ధగా చేయడం. నిష్కార ణంగా అవతలివారికి హాని తలపెడితే తమకంతకన్నా ఎక్కువ కీడు జరుగుతుందన్న వాస్తవాన్ని నిరూపించేం దుకు తన తోకకు పెట్టిన నిప్పుతోనే లంకాదహనం చేశాడు. తాను ఆజన్మ బ్రహ్మచారి అయినప్పటికీ, ఆదర్శ దంపతులైన సీతారాములను కలిపి భావితరాలకు ఆదర్శంగా నిలిచాడు. బుద్ధి, బలం, యశస్సు, ధైర్యం, చురుకు దనం, మాటకారితనం, ΄పౌరుషం, పరోపకారం, అచంచలమైన ఆత్మవిశ్వాసం, దీక్ష, కార్యదక్షత, అపారమైన ప్రభుభక్తి, వజ్రంలా ప్రకాశించే ఆరోగ్యకరమైన శరీరం కలవాడు ఆంజనేయుడు.
ఈ రోజున ఏం చేయాలి?
హనుమజ్జయంతి రోజున స్వామిని షోడశోపచారా లతో పూజించడం వల్ల గ్రహదోషాలు నశిస్తాయి. భూత, ప్రేత, పిశాచ పీడలు, మానసిక రుగ్మతలు తొలగిపోతాయి. చక్కటి ఆరోగ్యం చేకూరుతుంది. ఆలయానికి వెళ్లలేని పరిస్థితులలో ఉన్నవారు హనుమజ్జయంతి రోజున ఆయనని షోడశోపచారాలతో పూజించి, హనుమ ప్రతిమకు సింధూరం, నవనీతం సమర్పించి, తమలపాకులతో అలంకరించి, అరటిపండ్లు లేదా పానకం, వడపప్పు, నారికేళ ఫలాన్ని నివేదించిన వారికి ఏ కష్టనష్టాలూ రావని, అపమృత్యుభయం ఉండదని, అన్నింటా జయం ప్రాప్తిస్తుందని శాస్త్రవచనం.
– డి.వి.ఆర్. (ఏప్రిల్ 2, గురువారం హనుమజ్జయంతి)
Tags : 1