భారీ అగ్నిప్రమాదం.. పక్కనే పెట్రోల్ బంకు..
Breaking News
నాడు కాలేజ్ డ్రాపౌట్..ఇవాళ ఏకంగా ఫోర్బ్స్ బిలియనీర్ల జాబితాలో చోటు..!
Published on Sun, 03/29/2026 - 12:58
కొందరికి ఈ చదువులు తనకేం ఉపయోగపడవని, ఇంకేదో రంగంలో ఎదగగలం అని ముందుగానే గుర్తిస్తారు, బలంగా నమ్ముతారు కూడా. అంతేగాదు చాలా ధైర్యంగా చదువుకి మధ్యలోనే స్వస్తి పలికి అందరూ ఆశ్చర్యపోయేలా ఆ రంగంలో దూసుకుపోవడమే కాదు మంచి గుర్తింపు, పేరు తెచ్చుకుంటారు కూడా. అలాంటి కోవకు చెందినవాడే ఈ పిజిక్స్ వాలా. ఆయన ఒకప్పడూ కాలేజీ డ్రాపౌట్..ఇవాళ ఎవ్వరూ ఊహించనంత స్థాయి చేరుకోవడమే కాదు..ఏకంగా ఫోర్బ్స్ బిలియనీర్ల జాబితా చోటు దక్కించుకున్నాడు.
అతడే ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌కు చెందిన అలఖ్ పాండే. ఆయన ఇంజనీరింగ్ కళాశాలలో మూడో సంవత్సరంలోనే చదువు మానేశారు. ఆ తర్వాత చాలాకాలం ప్రైవేట్ ట్యూటరింగ్గా తక్కువ జీతానికి పనిచేసేవారు. అలా సాగుతున్న టైంలో 2016లో పిజిక్స్ వాలాగా ఉచితంగా సులభంగా పాఠాలు బోధిస్తూ వేలాది మంది విద్యారులను సంపాదించుకోవడంతో అతడి జీవితం కీలక మలుపు తిరిగింది.
ఆ తర్వాత అలఖ్ పాండే, ప్రతీక్ బూబ్ అనే వ్యక్తితో కలిసి 2020లో 'ఫిజిక్స్‌వాలా' అనే ఎడ్టెక్ సంస్థను స్థాపించారు. కొద్దికాలంలోనే ఆ కంపెనీ ఓ ప్రభంజనంలా దూసుకుపోయింది. నిజానికి అధిక ఫీజలు చెల్లించకుండా అత్యంత కఠినమైన ప్రవేశ పరీక్షల్లో నెగ్గుకురావడం అంత ఈజీ కాదు. దాంతో అలాంటి విద్యార్థులను ఉద్దేశించి సులభంగా అర్థం చేసుకునే బోధనా శైలిని రూపొందించారు. ఎడ్టెక్ అనే స్థార్టప్ సాయంతో దూసుకుపోయారు. మొదట్లో ఆ కంపెనీ ఉద్యోగ కోతలు, నష్టాలు, పెట్టుబడుదారుల సందేహాలతో సతమతమవుతున్న తరుణంలో పాండే తన కంపెనీని వృద్ధికి అందుబాటు ధరలో విద్యును అందించడమే కేంద్రబిందువుగా చేసుకున్నారు.
అలా 2024లో ఫిజిక్స్‌వాలా సిరీస్ బి రౌండ్లో దాదాపు రూ. 1750 కోట్లు సమీకరించింది. ఆ తర్వాత మార్చి 2026 నాటికి అలఖ్ పాండే నికర ఆస్తి విలువ సుమారు రూ. 9 వేల కోట్లుకు చేరుకుందని అంచనా. దాంతో ఆయన ఫోర్బ్స్ 2026 బిలియనీర్ల జాబితాలో 3332వ స్థానంలో ప్రవేశించారు. ఒకప్పుడు పాఠం పాఠంగా చెబుతూ అభిమానులను సపాదించుకున్న ఆ ఉపాధ్యాయుడు కొద్దిమంది వ్యవస్థాపకులు మాత్రం చోటు దక్కించుకునే సంపాదన స్థాయికి చేరుకోవడం విశేషం.
ఈ స్థాయికి ఎలా చేరుకున్నారంటే..
పాండే తన స్టార్టప్ విధానానికి విరుద్ధంగా విస్తరణపైనే దృష్టిసారించి లాభాలను ఆర్జించడమే లక్ష్యంగా పెట్టుకున్నారు. ఆయన తక్కువ ఖర్చుతో బోధించడంతో విశేష ఆదరణ సంపాదించకున్నారు. పాండే కథ డిజిటల్ విప్లవం విద్యా అవకాశాల స్వరూపాన్ని ఎలా మార్చేసిందే చెబుతోంది.
ఒక చిన్న పట్టణంలోని విద్యార్థి విద్య నేర్చుకోవడాని అతని కోసం మెట్రో నగరానికి వెళ్లాల్సిన పనిలేదు. పైగా అధికమొత్తంలో డబ్బు చెల్లించాల్సిన పనిలేదు. ఒక్క ఫోన్ స్క్రీన్ చాలు. అందువల్ల అతడు బిలియనీర్ల జాబితాలో సులభంగా చోటు దక్కించుకోగలిగాడు. అందుబాటు ధరలో మార్కెట్‌ను సొంతం చేసుకునే వ్యాపార సూత్రం కూడా.
(చదవండి: డెవర్లే... రైతులుగా...)
Tags : 1