Breaking News

ఇదేమైనా సీరియస్‌ సమస్యా?

Published on Sun, 03/29/2026 - 05:42

నాకు ఇరవై ఐదు సంవత్సరాలు. తరచు బ్రెస్ట్‌లో నొప్పి అనిపిస్తోంది. ఇది ఎందుకు వస్తుంది? ఇది ఏమైనా సీరియస్‌ సమస్యా? – లత, గుంటూరు
బ్రెస్ట్‌ నొప్పి అనేది చాలా కామన్ గా కనిపించే సమస్య. ఎక్కువగా ఇది ఎలాంటి ప్రమాదకర వ్యాధి లక్షణం కాదు. ముఖ్యంగా హార్మోన్ల మార్పుల వల్లే ఎక్కువగా వస్తుంది. ఈస్ట్రోజెన్ , ప్రొజెస్టెరాన్  వంటి హార్మోన్లు నెలసరి చక్రంలో మార్పులు చూపుతాయి. ఈ మార్పుల కారణంగా కొంతమందికి నెలసరి ముందు లేదా తర్వాత బ్రెస్ట్‌ నొప్పి అనిపిస్తుంది. కొందరికి ఇది ప్రతి నెలా కూడా రావచ్చు. అయితే కొన్ని సందర్భాల్లో ఇతర కారణాల వల్ల కూడా బ్రెస్ట్‌ నొప్పి ఉండొచ్చు. 

ఉదాహరణకు బ్రెస్ట్‌ ఇన్ ఫెక్షన్  (మాస్టిటిస్‌), ఫైబ్రోసిస్టిక్‌ మార్పులు, చిన్న సిస్టులు వంటి సమస్యలు. చాలా అరుదుగా మాత్రమే బ్రెస్ట్‌ క్యాన్సర్‌తో కూడా నొప్పి ఉంటుంది. బ్రెస్ట్‌ నొప్పితో పాటు జ్వరం, చర్మం ఎర్రబడటం, గట్టిపడటం, నిపుల్‌ నుంచి స్రావం రావడం, గడ్డలు ఉన్నట్లు అనిపించడం వంటి లక్షణాలు ఉంటే ఆలస్యం చేయకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. డాక్టర్‌ పరీక్ష చేసి అవసరమైతే బ్రెస్ట్‌ అల్ట్రాసౌండ్, మామోగ్రఫీ వంటి పరీక్షలు సూచిస్తారు. కొన్నిసార్లు బయాప్సీ కూడా అవసరం కావచ్చు. 

సాధారణంగా నొప్పి తేలికగా ఉంటే పారాసిటమాల్, ఐబుప్రొఫెన్  వంటి మందులు ఉపశమనం ఇస్తాయి. వేడి లేదా చల్లని కంప్రెస్‌ కూడా ఉపయోగపడుతుంది. విటమిన్‌–ఈ సప్లిమెంట్స్‌ కొందరికి బాగా పనిచేస్తాయి. జీవనశైలిలో కొన్ని మార్పులు కూడా సహాయపడతాయి. సరైన సైజ్‌ బ్రా ధరించడం, కెఫీన్  తగ్గించడం, ఒత్తిడి తగ్గించుకోవడం, వ్యాయామం చేయడం, తగినంత నీరు తాగడం మంచిది. కుటుంబంలో బ్రెస్ట్‌ లేదా ఒవేరియన్‌ క్యాన్సర్‌ చరిత్ర ఉన్నవారు, అధిక బరువు ఉన్నవారు, ఫిజికల్‌ యాక్టివిటీ తక్కువగా ఉన్నవారు మరింత జాగ్రత్తగా ఉండాలి. సాధారణంగా బ్రెస్ట్‌ నొప్పి పెద్ద సమస్య కాకపోయినా, సందేహం ఉంటే వెంటనే గైనకాలజిస్ట్‌ను సంప్రదించడం ఉత్తమం. 

నాకు యాభై ఐదు సంవత్సరాలు. దాదాపు పదిహేనేళ్ల క్రితం గర్భసంచి తీసే ఆపరేషన్  (హిస్టరెక్టమీ) చేయించుకున్నాను. ఇప్పుడు యోని భాగంలో ఏదో బయటికి వచ్చినట్లుగా అనిపిస్తోంది. దగ్గినా, తుమ్మినా అది బయటికి ఉబ్బినట్లుగా కనిపిస్తోంది. మూత్రం నియంత్రణలో కూడా కొంత ఇబ్బంది ఉంది. ఇది ఏ సమస్య? ఏమి చేయాలి? – రమణమ్మ, అనంతపురం. 
మీరు చెప్పిన లక్షణాలు పోస్ట్‌ హిస్టరెక్టమీ ప్రోలాప్స్‌ అనే సమస్యకు సూచనలు. అంటే గర్భసంచి తీసిన తర్వాత, యోని పైభాగం (వాల్ట్‌), మూత్రాశయం (బ్లాడర్‌), లేదా రెక్టమ్‌ కిందికి జారిపోవడం. హిస్టరెక్టమీ చేసిన తర్వాత పెల్విక్‌ ఫ్లోర్‌ కండరాలు, లిగమెంట్లు బలహీనపడితే ఈ సమస్య వస్తుంది. వయసు పెరగడం, ఈస్ట్రోజెన్  హార్మోన్  తగ్గడం వల్ల టిష్యూలు సడలిపోవడం కూడా దీనికి ఒక కారణం. అలాగే అధిక బరువు, దీర్ఘకాలిక దగ్గు, మలబద్ధకం, బరువైన వస్తువులు ఎత్తడం వంటి కారణాలు సమస్యను మరింత తీవ్రం చేస్తాయి. 

ఈ సమస్యను నిర్లక్ష్యం చేస్తే క్రమంగా తీవ్రత పెరిగి మూత్రం అదుపు లేకపోవడం, మల విసర్జనలో ఇబ్బందులు వంటి సమస్యలు రావచ్చు. కాబట్టి వెంటనే గైనకాలజిస్ట్‌ను సంప్రదించడం అవసరం. డాక్టర్‌ పూర్తి శరీర పరీక్ష చేసి, సమస్య స్థాయిని అంచనా వేస్తారు. అవసరమైతే అల్ట్రాసౌండ్, యూరోడైనమిక్‌ స్టడీస్‌ వంటి పరీక్షలు కూడా సూచించవచ్చు. సమస్య తీవ్రతను బట్టి చికిత్స ఇలా ఉంటుంది. ప్రారంభ దశలో అయితే, పెల్విక్‌ ఫ్లోర్‌ వ్యాయామాలు (కెగెల్‌ ఎక్సర్‌సైజ్‌లు), సపోర్టివ్‌ డివైజ్‌లు (పెస్సరీ) వినియోగం సరిపోతుంది. 

అదే తీవ్రంగా ఉన్నప్పుడు శస్త్రచికిత్స అవసరం. ప్రస్తుతం ల్యాపరోస్కోపిక్, రోబోటిక్‌ సర్జరీలు కూడా అందుబాటులో ఉన్నాయి, ఇవి త్వరగా కోలుకోవడానికి సహాయపడతాయి. అదనంగా, బరువు నియంత్రణ, మలబద్ధకం నివారణ, బరువైన వస్తువులు ఎత్తకుండా ఉండటం, నియమిత వ్యాయామాలు చేయడం వంటి జాగ్రత్తలు తీసుకుంటే సమస్యను నియంత్రించుకోవచ్చు. ముఖ్యంగా, తొందరగా గుర్తించి చికిత్స ప్రారంభిస్తే మంచి ఫలితాలు పొందవచ్చు. 

-డా‘‘ భావన కాసు
గైనకాలజిస్ట్‌ – ఆబ్‌స్టెట్రీషియన్‌ ,హైదరాబాద్‌

Videos

యూనివర్సిటీలపై దాడులు.. యూఎస్,ఇజ్రాయెల్ కు ఇరాన్ వార్నింగ్

తమిళనాడులో విజయ్ దూకుడు

రుక్మిణిని Unfollow చేసిన రిషబ్.. అసలేమైనట్టు..!

బంగారం అమ్మే సరైన సమయం ఇదే.. లాభం డబుల్ చేసే ట్రిక్!

వైరల్ అవుతోన్న రామ్ చరణ్ హోమం

తడబడుతున్న చంద్రబాబు.. థిస్ ఇస్ వెరీ బ్యాడ్

భర్తను చంపి పక్కనే పాతిపెట్టిన భార్య.. ట్విస్ట్ ఏంటంటే..?

సుబ్బారెడ్డి VS అఖిలప్రియ.. ఆళ్లగడ్డలో కేబుల్ వార్

నంద్యాలలో దారుణం.. అత్తను చంపిన అల్లుడు

US స్థావరాలపై ఇరాన్ దాడి? భారీగా ప్రాణనష్టం

Photos

+5

ఫ్రెండ్స్‌ గ్యాంగ్‌తో నమ్రత (ఫోటోలు)

+5

ఫ్యాషన్‌ షోలో నగధగలు..అలరించిన మోడల్స్‌ (ఫోటోలు)

+5

Best Photos Of The Week : ఈ వారం ఉత్తమ చిత్రాలు (మార్చి 29- ఏప్రిల్ 05)

+5

'కొన్ని క్షణాలు హృదయానికి హత్తుకుంటాయి'.. కూతురితో మంచు లక్ష్మీ (ఫోటోలు)

+5

90ల నాటి కలల రాణి.. మేకప్‌ లేకుండా నెరిసిన జుట్టుతో (ఫొటోలు)

+5

వేములవాడ : రాజన్నతో హిజ్రాల పెళ్లిమహోత్సవం...ఏళ్లుగా కొనసాగుతున్న ఆచారం (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : ‘టీచ్‌ ఫర్‌ చేంజ్‌’...అలరించిన సినీ ప్రముఖుల ర్యాంప్‌ వాక్‌ (ఫొటోలు)

+5

వారణాసిలో యాంకర్ రష్మీ గౌతమ్ పూజలు (ఫొటోలు)

+5

శ్రీరామనవమి వేడుకల్లో మంచు మనోజ్ ఫ్యామిలీ (ఫొటోలు)

+5

చిరంజీవి ఆధ్వర్యంలో రామ్ చరణ్ బర్త్ డే సెలబ్రేషన్స్ (ఫొటోలు)