Breaking News

సుకన్య సమృద్ధి యోజన వడ్డీ రేటు మారుతుందా?

Published on Thu, 03/26/2026 - 14:06

ఆడపిల్లల ఆర్థిక భవిష్యత్తుకు భరోసానిచ్చే 'సుకన్య సమృద్ధి యోజన' (SSY) గత దశాబ్ద కాలంలో భారతీయ కుటుంబాల నమ్మకమైన పెట్టుబడి సాధనంగా అవతరించింది. 2014లో ప్రారంభమైన ఈ పథకం, నేడు కోట్లాది మంది తల్లుల కలలకు అండగా నిలుస్తోంది. ఇటీవల ఈ పథకం వడ్డీ రేట్లపై వస్తున్న ఊహాగానాలకు కేంద్ర ప్రభుత్వం చెక్ పెట్టింది.

వడ్డీ రేటులో మార్పు లేదు.. స్పష్టం చేసిన కేంద్రం
ప్రస్తుతం అమలులో ఉన్న 8.2 శాతం వడ్డీ రేటును తగ్గించే ఆలోచన లేదని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. మార్చి 23న లోక్‌సభలో అడిగిన ప్రశ్నలకు ఆర్థిక శాఖ సహాయ మంత్రి పంకజ్ చౌదరి సమాధానమిస్తూ.. వడ్డీ రేటును 8.1 శాతానికి తగ్గించే ప్రతిపాదన ఏదీ పరిశీలనలో లేదని పేర్కొన్నారు. ఇతర చిన్న మొత్తాల పొదుపు పథకాలతో పోలిస్తే సుకన్య సమృద్ధి యోజన అత్యంత ఆకర్షణీయమైన రిటర్న్స్‌ను అందిస్తోందని ఆయన ధీమా వ్యక్తం చేశారు.

దశాబ్ద కాలంలో 100 రెట్లు వృద్ధి
గత పదేళ్లలో ఈ పథకం సాధించిన ప్రగతి అసాధారణం. గణాంకాలను పరిశీలిస్తే సామాన్యులకు ఈ పథకంపై ఉన్న నమ్మకం స్పష్టమవుతోంది. 2014-15లో కేవలం 4.2 లక్షలుగా ఉన్న ఖాతాలు, 2024-25 నాటికి 424.57 లక్షలకు చేరాయి. అంటే పదేళ్లలో 100 రెట్లు వృద్ధి నమోదైంది. ప్రారంభంలో రూ. 0.001 లక్షల కోట్లుగా ఉన్న డిపాజిట్లు, ప్రస్తుతం రూ. 2.99 లక్షల కోట్లకు చేరడం విశేషం.

వడ్డీ రేట్లు ఎలా నిర్ణయిస్తారు?
సుకన్య సమృద్ధి యోజన వడ్డీ రేట్లను ప్రభుత్వం ప్రతి త్రైమాసికానికి (Quarterly) సమీక్షిస్తుంది. ప్రధానంగా శ్యామల గోపీనాథ్ కమిటీ సిఫార్సుల మేరకు, ప్రభుత్వ సెక్యూరిటీల (G-Secs)పై వచ్చే దిగుబడిని బట్టి ఈ రేట్లను ఖరారు చేస్తారు. 2014–16 ఆర్థిక సంవత్సరంలో 9% పైచిలుకు ఉన్న వడ్డీ రేటు ఆ తర్వాత క్రమంగా తగ్గుతూ 2020–23 సంవత్సరాల్లో 7.6 శాతానికి (అత్యల్పం)  చేరింది. 2024 నుండి ఈ వడ్డ రేటు  8.2 శాతంగా కొనసాగుతోంది.

Videos

కడప స్టీల్ పై బాబు నాటకం

సుప్రియ ఒంటిపై ఎక్కడపడితే అక్కడ చేతులు వేసి... పేర్ని నాని ఫైర్

ఓటమిని ఒప్పుకోండి.. మాతో మీరు గెలవడం కల్లా..

బ్లడీ బాస్టర్డ్.. సామాన్యుడిపై TDP ఎమ్మెల్యే బూతు పురాణం

అడ్డంగా నరికేస్తా.. యూజ్ లెస్ ఫెలో ఆదిరెడ్డికి ధమ్కీ ఇచ్చిన వ్యాపారి

మార్కాపురం ఘోర రోడ్డు ప్రమాదం ఎలా జరిగిందంటే?

శవాన్ని తీసుకెళ్తుంటే 100 మంది దాడి చేశారు.. డిప్యూటీ సీఎంకి ఒకటే ప్రశ్న.

ఇన్వెస్టర్లకు జాక్పాట్ 1100% డివిడెండ్ ఇచ్చిన మైనింగ్ కంపెనీ

ఇన్వెస్టర్లకు పండగే లక్ష పెడితే 12 లక్షలు...ఒకటి కొంటే ఒకటి ఫ్రీ

YS జగన్ శ్రీరామనవమి శుభాకాంక్షలు

Photos

+5

రష్మిక- విజయ్ పెళ్లికి నెల.. జ్ఞాపకాల్లో విరోష్ జంట.. (ఫోటోలు)

+5

కూతురితో టాలీవుడ్ నటి మంచు లక్ష్మీ (ఫోటోలు)

+5

తిరుమల శ్రీవారి సేవలో బైకర్ మూవీ టీమ్ (ఫోటోలు)

+5

జూ.ఎన్టీఆర్‌ సతీమణి ప్ర‌ణ‌తి బర్త్‌డే సెలబ్రేషన్స్‌ (ఫోటోలు)

+5

హైదరాబాద్ : ఒక చేయి.. ఆపన్నహస్తాలెన్నో! ఈ ఫోటోలు చూడండి

+5

నువ్వు దేవుడిచ్చిన వరం.. కూతురిని చూసి మంచు లక్ష్మీ ఎమోషనల్ (ఫోటోలు)

+5

డిఫరెంట్ లుక్స్‌తో షాకిచ్చిన శోభిత (ఫొటోలు)

+5

వావ్ అనేలా మహేశ్-రాజమౌళి 'వారణాసి' సెట్స్ ఫొటోలు

+5

IPL 2026: కెప్టెన్లంతా ఒకే చోట..! (ఫొటోలు)

+5

హనీమూన్ కాదు బడ్డీమూన్.. రష్మిక-విజయ్ ఇలా (ఫొటోలు)