Breaking News

చెకింగ్ చూసి షాక్… వెంటనే బ్లింకిట్‌లో హెల్మెట్ ఆర్డర్!

Published on Thu, 03/26/2026 - 08:36

నిత్యం జరిగే ట్రాఫిక్‌ చెకింగ్‌ కాస్తా, ఒక బైకర్‌ సమయస్ఫూర్తితో ఇంటర్నెట్‌లో వైరల్‌గా మారింది. బిజీగా ఉన్న ఒక రోడ్డుపై ట్రాఫిక్‌ పోలీసులు హెల్మెట్‌ లేని వాహనదారులను ఆపుతున్నారు. ఒక బైకర్‌ హెల్మెట్‌ లేకుండా దొరికిపోయాడు. సాధారణంగా ఇలాంటి సమయాల్లో జరిమానా కట్టడమో, వాదించడమో జరుగుతుంది. కానీ, ఈ యువకుడు మాత్రం కొత్తగా ఆలోచించాడు. వెంటనే తన ఫోన్‌ తీసి బ్లింకిట్‌ యాప్‌ ద్వారా ఒక హెల్మెట్‌ని ఆర్డర్‌ పెట్టాడు. కేవలం కొద్ది నిమిషాల్లోనే డెలివరీ ఎగ్జిక్యూటివ్, పోలీసులు తనిఖీ చేస్తున్న అదేప్రాతానికి వచ్చి హెల్మెట్‌ బాక్స్‌ని అందించాడు.

అందరూ చూస్తుండగానే హెల్మెట్‌ని ధరించి పోలీసుల ముందు నిలబడ్డాడు. ఈ వీడియో వైరల్‌ కావడంతో నెటిజన్ల నుంచి మిశ్రమ స్పందనలు వస్తున్నాయి. భారతీయుల తెలివితేటలకు, సమయస్ఫూర్తికి ఇది నిదర్శనమని కొందరు మెచ్చుకోగా, జరిమానా నుంచి తప్పించుకోవడానికి చేసే ప్రయత్నం తప్ప, భద్రత పట్ల బాధ్యత లేదని కొందరు విమర్శిస్తున్నారు. ప్రయాణం మొదట్లోనే హెల్మెట్‌ పెట్టుకోవాలి కానీ, దొరికిపోయినప్పుడు కొనుక్కోవడం వల్ల ప్రయోజనం లేదని ఇంకొందరు హెచ్చరిస్తున్నారు. ట్రాఫిక్‌ నిబంధనలు అనేవి కేవలం జరిమానాల కోసం కాదు,   ప్రాణ రక్షణ కోసం అని గుర్తుంచుకోవాలని సూచిస్తున్నారు. మరోవైపు నిమిషాల్లో డెలివరీ చేసిన కంపెనీ సేవలను చూసి నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు. 

 

 

Videos

బ్లడీ బాస్టర్డ్.. సామాన్యుడిపై TDP ఎమ్మెల్యే బూతు పురాణం

అడ్డంగా నరికేస్తా.. యూజ్ లెస్ ఫెలో ఆదిరెడ్డికి ధమ్కీ ఇచ్చిన వ్యాపారి

మార్కాపురం ఘోర రోడ్డు ప్రమాదం ఎలా జరిగిందంటే?

శవాన్ని తీసుకెళ్తుంటే 100 మంది దాడి చేశారు.. డిప్యూటీ సీఎంకి ఒకటే ప్రశ్న.

ఇన్వెస్టర్లకు జాక్పాట్ 1100% డివిడెండ్ ఇచ్చిన మైనింగ్ కంపెనీ

ఇన్వెస్టర్లకు పండగే లక్ష పెడితే 12 లక్షలు...ఒకటి కొంటే ఒకటి ఫ్రీ

YS జగన్ శ్రీరామనవమి శుభాకాంక్షలు

అమరావతిలో బాబు అవినీతి యజ్ఞం

4 గంటల్లోనే బంగారం ధరలు భారీగా పెరిగాయి..

దొరకాలి నా కొడుకు.. పెట్రోల్ పోసి తగలబెడతా

Photos

+5

కూతురితో టాలీవుడ్ నటి మంచు లక్ష్మీ (ఫోటోలు)

+5

తిరుమల శ్రీవారి సేవలో బైకర్ మూవీ టీమ్ (ఫోటోలు)

+5

జూ.ఎన్టీఆర్‌ సతీమణి ప్ర‌ణ‌తి బర్త్‌డే సెలబ్రేషన్స్‌ (ఫోటోలు)

+5

హైదరాబాద్ : ఒక చేయి.. ఆపన్నహస్తాలెన్నో! ఈ ఫోటోలు చూడండి

+5

నువ్వు దేవుడిచ్చిన వరం.. కూతురిని చూసి మంచు లక్ష్మీ ఎమోషనల్ (ఫోటోలు)

+5

డిఫరెంట్ లుక్స్‌తో షాకిచ్చిన శోభిత (ఫొటోలు)

+5

వావ్ అనేలా మహేశ్-రాజమౌళి 'వారణాసి' సెట్స్ ఫొటోలు

+5

IPL 2026: కెప్టెన్లంతా ఒకే చోట..! (ఫొటోలు)

+5

హనీమూన్ కాదు బడ్డీమూన్.. రష్మిక-విజయ్ ఇలా (ఫొటోలు)

+5

ఇదేం బిల్డప్‌ చంద్రబాబూ.. క్రెడిట్ చోరీ ఆగదా?: వైఎస్‌ జగన్‌ (ఫోటోలు)