Breaking News

బధిరులకు ఆమె మెంటార్‌

Published on Thu, 03/26/2026 - 06:04

కమ్యూనికేషన్‌ సమస్యల వల్ల ఒకప్పుడు ఉద్యోగ ఇంటర్వ్యూల్లో తిరస్కరణకు గురైన ఒక మహిళ, నేడు దేశవ్యాప్తంగా వెయ్యి మందికి పైగా బధిర (చెవుడు, మూగ) మహిళలకు మార్గదర్శిగా నిలుస్తున్నారు. ఆమే నాగ్‌పూర్‌కు చెందిన కృతిక ధుండే. పుట్టుకతోనే మూగ, చెవిటి అయిన కృతిక బాల్యం అంతా సవాళ్లతోనే సాగింది. బడిలో ఉపాధ్యాయులు, తోటి విద్యార్థులకు సైన్‌ లాంగ్వేజ్‌  తెలియక΄ోవడంతో ఆమె ఒంటరితనాన్ని అనుభవించారు. కానీ, ఆ అడ్డంకులే ఆమెలో పట్టుదలను పెంచాయి. తన తల్లిదండ్రుల అండతో చదువు పూర్తి చేసిన కృతిక, పెళ్లయి ఇద్దరు పిల్లల తల్లయ్యాక తన కాళ్ల మీద తాను నిలబడాలని నిర్ణయించుకున్నారు.

 2023లో ఉద్యోగం కోసం ప్రయత్నించినప్పుడు ఆమెకు చేదు అనుభవాలు ఎదురయ్యాయి. కమ్యూనికేషన్‌ సమస్య వల్ల ఇంటర్వ్యూలు మధ్యలోనే ఆపివేసేవారు. అయితే, ఆమె పట్టువదలకుండా ప్రత్యామ్నాయ మార్గాల కోసం వెతికారు. దీపికా భాటియా నేతృత్వంలోని మహిళా పారిశ్రామికవేత్తల నెట్‌వర్క్‌ గురించి తెలుసుకున్న కృతిక అందులో చేరారు. మొదట్లో లైవ్‌ క్యాప్ష¯Œ ్స సాయంతో విషయాలు అర్థం చేసుకునేవారు. క్రమంగా ఆ బృంద సభ్యులు కూడా సైన్‌ లాంగ్వేజ్‌ నేర్చుకుని ఆమెకు సహకరించడంతో కమ్యూనికేషన్‌ సులభంగా మారింది. 

అనంతరం కృతిక తనలాంటి సమస్యలు ఎదుర్కొంటున్న ఇతర బధిర మహిళలను ప్రోత్సహించడం మొదలుపెట్టారు. నేడు ఆమె 1,000 మందికి పైగా బధిర మహిళలకు మెంటార్‌గా వ్యవహరిస్తున్నారు. ఈ నెట్‌వర్క్‌ ద్వారా వారు నెలకు రూ. 70,000 వరకు సంపాదిస్తున్నారు. ‘ఆర్థిక స్వాతంత్య్రం నా జీవితాన్ని మాత్రమే కాదు, నన్ను చూసే సమాజపు చూపును కూడా మార్చింది. వికలాంగులలో అపారమైన ప్రతిభ ఉంటుంది, వారికి కావాల్సిందల్లా కేవలం అవకాశం మాత్రమే’ అని కృతిక  సందేశమిస్తున్నారు. అంతేకాకుండా ఆమె ఇ¯Œ స్ట్రాగామ్‌లో సంజ్ఞా భాషలో వీడియోలు చేస్తూ లక్షలాది మందికి అవగాహన కల్పిస్తున్నారు.  సంజ్ఞా భాష అనేది కేవలం సైగలు మాత్రమే కాదు, అది ఒక గొప్ప భావ వ్యక్తీకరణ అని నిరూపిస్తూ కృతిక సాగిస్తున్న ఈ ప్రయాణం ఎందరికో స్ఫూర్తిదాయకం.

Videos

బ్లడీ బాస్టర్డ్.. సామాన్యుడిపై TDP ఎమ్మెల్యే బూతు పురాణం

అడ్డంగా నరికేస్తా.. యూజ్ లెస్ ఫెలో ఆదిరెడ్డికి ధమ్కీ ఇచ్చిన వ్యాపారి

మార్కాపురం ఘోర రోడ్డు ప్రమాదం ఎలా జరిగిందంటే?

శవాన్ని తీసుకెళ్తుంటే 100 మంది దాడి చేశారు.. డిప్యూటీ సీఎంకి ఒకటే ప్రశ్న.

ఇన్వెస్టర్లకు జాక్పాట్ 1100% డివిడెండ్ ఇచ్చిన మైనింగ్ కంపెనీ

ఇన్వెస్టర్లకు పండగే లక్ష పెడితే 12 లక్షలు...ఒకటి కొంటే ఒకటి ఫ్రీ

YS జగన్ శ్రీరామనవమి శుభాకాంక్షలు

అమరావతిలో బాబు అవినీతి యజ్ఞం

4 గంటల్లోనే బంగారం ధరలు భారీగా పెరిగాయి..

దొరకాలి నా కొడుకు.. పెట్రోల్ పోసి తగలబెడతా

Photos

+5

కూతురితో టాలీవుడ్ నటి మంచు లక్ష్మీ (ఫోటోలు)

+5

తిరుమల శ్రీవారి సేవలో బైకర్ మూవీ టీమ్ (ఫోటోలు)

+5

జూ.ఎన్టీఆర్‌ సతీమణి ప్ర‌ణ‌తి బర్త్‌డే సెలబ్రేషన్స్‌ (ఫోటోలు)

+5

హైదరాబాద్ : ఒక చేయి.. ఆపన్నహస్తాలెన్నో! ఈ ఫోటోలు చూడండి

+5

నువ్వు దేవుడిచ్చిన వరం.. కూతురిని చూసి మంచు లక్ష్మీ ఎమోషనల్ (ఫోటోలు)

+5

డిఫరెంట్ లుక్స్‌తో షాకిచ్చిన శోభిత (ఫొటోలు)

+5

వావ్ అనేలా మహేశ్-రాజమౌళి 'వారణాసి' సెట్స్ ఫొటోలు

+5

IPL 2026: కెప్టెన్లంతా ఒకే చోట..! (ఫొటోలు)

+5

హనీమూన్ కాదు బడ్డీమూన్.. రష్మిక-విజయ్ ఇలా (ఫొటోలు)

+5

ఇదేం బిల్డప్‌ చంద్రబాబూ.. క్రెడిట్ చోరీ ఆగదా?: వైఎస్‌ జగన్‌ (ఫోటోలు)