నా రెండు కాళ్లు విడదీసి.. మిస్టర్ పెమ్మసాని.. గుర్తుపెట్టుకో..
Breaking News
బ్యాంకు సెలవులు.. వారంలో 4 రోజులు క్లోజ్!
Published on Mon, 03/23/2026 - 12:57
మీరు ఈ వారంలో బ్యాంకు పనులు ఏవైనా ప్లాన్ చేసుకున్నారా? అయితే ఈ వార్త మీ కోసమే. ఈ వారంలో బ్యాంకులకు వరుస సెలవులు రానున్నాయి. వివిధ పండుగలు మరియు వారాంతపు సెలవుల కారణంగా మార్చి 26 నుండి మార్చి 29 వరకు వరుసగా నాలుగు రోజుల పాటు బ్యాంకులు మూతపడనున్నాయి. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) అధికారిక క్యాలెండర్ ప్రకారం, వివిధ రాష్ట్రాల్లో శ్రీరామనవమి పండుగ, వారాంతపు సెలవుల కారణంగా వరుసగా నాలుగు రోజుల పాటు బ్యాంకింగ్ కార్యకలాపాలకు అంతరాయం కలగనుంది.
సెలవుల వివరాలు ఇవే...
మార్చి 26 (గురువారం): శ్రీరామనవమి సందర్భంగా గుజరాత్, మహారాష్ట్ర, రాజస్థాన్, ఉత్తరప్రదేశ్, పశ్చిమ బెంగాల్ సహా పలు ఉత్తరాది రాష్ట్రాల్లో బ్యాంకులు మూసిఉంటాయి.
మార్చి 27 (శుక్రవారం): తెలుగు రాష్ట్రాలైన తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ తోపాటు మధ్యప్రదేశ్, ఒడిశా, బీహార్ రాష్ట్రాల్లో శ్రీరామనవమి సెలవు పాటించనున్నారు.
మార్చి 28 (శనివారం): ఇది నెలలో నాలుగో శనివారం కావడంతో దేశవ్యాప్తంగా బ్యాంకులు పనిచేయవు.
మార్చి 29 (ఆదివారం): సాధారణ సెలవు దినం.
నెల ఆఖరిలో మరో సెలవు: మార్చి 31న మహావీర్ జయంతి సందర్భంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ మినహా మెజారిటీ రాష్ట్రాల్లో (మహారాష్ట్ర, కర్ణాటక, ఢిల్లీ వంటివి) బ్యాంకులు మూతపడతాయి.
డిజిటల్ సేవలు యథాతథం
బ్యాంకు శాఖలు భౌతికంగా మూసివేసినప్పటికీ, ఖాతాదారులకు ఇబ్బంది కలగకుండా ఆన్‌లైన్ సేవలు అందుబాటులో ఉంటాయి.
ఏటీఎం (ATM) సేవలు: నగదు ఉపసంహరణ కోసం ఏటీఎంలు యథావిధిగా పనిచేస్తాయి.
డిజిటల్ బ్యాంకింగ్: నెట్ బ్యాంకింగ్, మొబైల్ యాప్స్ ద్వారా UPI, NEFT, RTGS లావాదేవీలు నిర్వహించుకోవచ్చు.
ఇతర సేవలు: ఫిక్స్‌డ్ డిపాజిట్లు తెరవడం, బ్యాలెన్స్ చెక్ చేయడం వంటి పనులను ఆన్‌లైన్‌లో పూర్తి చేసుకోవచ్చు.
మార్చి నెలాఖరు కావడంతో అకౌంట్ క్లోజింగ్ పనులు కూడా ఉంటాయి. కాబట్టి, అత్యవసర బ్యాంకింగ్ పనులు ఏవైనా ఉంటే ముందే పూర్తి చేసుకోవడం ఉత్తమం.
Tags : 1