Breaking News

యాపిల్‌ ఎయిర్‌పాడ్స్‌ మ్యాక్స్‌2 లాంచ్: ధర ఎంతంటే?

Published on Sat, 03/21/2026 - 17:17

డిసెంబర్ 2020లో యాపిల్ కంపెనీ ఒరిజినల్ ఎయిర్‌పాడ్స్ మ్యాక్స్‌ విడుదల చేసిన తరువాత.. ఇప్పుడు ఎయిర్‌పాడ్స్ మ్యాక్స్ 2ను పరిచయం చేసింది. ఈ కొత్త ప్రీమియం ఓవర్-ఇయర్ హెడ్‌ఫోన్‌ల ధర భారతదేశంలో రూ. 67,900గా ఉంది. ఈ కొత్త హెడ్‌ఫోన్‌లు యాపిల్‌ హెచ్‌2 చిప్‌తో పనిచేస్తాయి. ‘మునపటి తరంతో పోల్చితే 1.5 రెట్లు ఎక్కువ ప్రభావంతమైన యాక్టివ్‌ నాయిస్‌ క్యాన్సిలేషన్‌ (ఏఎన్‌సి)ను అందిస్తుంది’ అని కంపెనీ ప్రకటించింది. విమానం, రైలు శబ్దాల వంటి బాహ్య శబ్దాలను ఈ అప్‌గ్రేడ్‌ సమర్థవంతంగా నిరోధిస్తుంది.

ఈ హెడ్‌ఫోన్‌ల కోసం ప్రీ-ఆర్డర్లు మార్చి 25న ప్రారంభమవుతాయి, కాగా డెలివరీలు ఏప్రిల్ ఆరంభంలో మొదలయ్యే అవకాశం ఉంది. కంపెనీ ఈ హెడ్‌ఫోన్‌లో అప్‌గ్రేడ్ మైక్రోఫోన్‌లు, డిజిటల్ సిగ్నల్ ప్రాసెసింగ్ వంటి వాటిని అప్డేట్ చేసింది. కాబట్టి ఇది వినియోగదారులకు మంచి అనుభూతిని అందిస్తుంది.

యాపిల్ ఉత్పత్తులకు డిమాండ్
భారతదేశంలో యాపిల్ ఉత్పత్తులకు డిమాండ్ గణనీయంగా పెరుగుతూనే ఉంది. ముఖ్యంగా యువత, ప్రీమియం వినియోగదారుల మధ్య iPhone, MacBook, iPad వంటి పరికరాలు ప్రతిష్టాత్మక గుర్తుగా మారాయి. మెరుగైన కెమెరా నాణ్యత, సేఫ్టీ ఫీచర్స్, ఎకోసిస్టమ్ సమగ్రత వల్ల వినియోగదారులు వీటిని ఎక్కువగా ఇష్టపడుతున్నారు. అంతే కాకుండా.. EMI ఆఫర్లు, ఆన్‌లైన్ విక్రయాలు.. భారతదేశంలో స్థానిక తయారీ పెరగడం వంటి అంశాలు కూడా యాపిల్ ఉత్పత్తుల చేరువను పెంచాయి.

Videos

పెద్ది విడుదల మళ్ళీ వాయిదా? వార్తల్లో నిజమెంత?

యువతకు ముష్టి వేస్తున్నారా? జాబ్ క్యాలెండర్ పై జడ శ్రవణ్ రియాక్షన్

హాట్ టాపిక్ కు అడ్డాగా అమెరికా డొనాల్డ్ ట్రంప్ Vs పోప్

ఏపీలో ఈదురుగాలులతో భారీ వర్షాలు ఈ జిల్లాలకు ఎల్లో అలర్ట్

వలస కూలీలకు గుడ్ న్యూస్ కమర్షియల్ గ్యాస్ పై కేంద్రం కీలక నిర్ణయం

ఆ పేరు ఎత్తలంటేనే సిగ్గుగా ఉంది BR నాయుడుపై శ్యామల ఫైర్

పేర్ని కిట్టు ప్లెక్సీలపై కూటమి నేతల కడుపు మంట

మా భారతమ్మ పై పడి ఏడుస్తారు కదా ఉగాది వేడుకల్లో మరి మీ భార్యలు ఎక్కడ..?

పెట్రోల్, డీజిల్ కొరత వాహనదారుల అవస్థలు

దాడులను ఖండిస్తూ ఇరాన్ ప్రధానికి మోదీ ఫోన్

Photos

+5

బుజ్జి అభిమానితో భోజనం చేసిన 'విరోష్‌' జోడీ (ఫోటోలు)

+5

డైరెక్టర్‌గా ‘జబర్దస్త్’ కమెడియన్‌..‘కామాఖ్య’ టీజర్‌ రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

వేలాది భక్తుల మధ్య కైరుప్పల పిడకల సంబరం (ఫొటోలు)

+5

వాళ్లు అప్పుడు నాకు సూపర్‌స్టార్స్‌.. ఇప్పుడు నేను (ఫొటోలు)

+5

గద్దర్ అవార్డ్ వేడుక కోసం అక్కినేని కోడలు ఇలా (ఫొటోలు)

+5

మంచు విష్ణు కూతుళ్లని చూశారా? ఎంత పెద్దోళ్లయిపోయారో! (ఫొటోలు)

+5

గద్దర్‌ అవార్డ్స్‌- 2025లో మెరిసిన హీరోయిన్లు (ఫోటోలు)

+5

శ్రీశైలంలో రమణీయంగా రథోత్సవం పులకించిన భక్తులు (ఫొటోలు)

+5

గద్దర్‌ అవార్డ్స్ అందుకున్న విజేతలు (ఫొటోలు)

+5

అట్టహాసంగా గద్దర్ అవార్డుల వేడుక.. టాలీవుడ్ స్టార్స్ సందడి (ఫొటోలు)