నక్కతోక తొక్కినట్లు.. గంటల్లోనే పడిపోయిన బంగారం!

Published on Thu, 03/19/2026 - 18:48

దేశంలో బంగారం ధరలు ఎప్పటికప్పడు మారిపోతున్నాయి. ఉదయం ఉన్న ధరలు సాయంత్రానికి ఉండటం లేదు. గురువారం ఉదయం గణనీయంగా తగ్గిన పసిడి ధరలు (Today Gold Rate) సాయంత్రానికి మరింత భారీగా దిగొచ్చాయి. దీంతో కొనుగోలుదారులకు నక్కతోక తొక్కినట్లు మరింత ఊరట లభించింది.

హైదరాబాద్‌, విశాఖపట్నం సహా తెలుగు రాష్ట్రాల్లో గురువారం ఉదయం రూ.2550 తగ్గి రూ.1,42,750 లుగా ఉన్న 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర సాయంత్రానికి మొత్తంగా రూ.7140 క్షీణించి రూ.1,37,750 లకు దిగివచ్చింది.

అలాగే 24 క్యారెట్ల మేలిమి బంగారం 10 గ్రాముల ధర గురువారం ఉదయం రూ.2780 తగ్గి రూ.1,54,640 లుగా ఉండగా సాయంత్రం తిరిగే సరికి మరింత రూ.6550 కరిగి రూ. 1,50,280 లకు క్షీణించింది.

ఇక వెండి ధరల (Today Silver Rate) విషయానికి వస్తే హైదరాబాద్‌ మార్కెట్‌లో ఈరోజు సిల్వర్‌ కేజీకి రూ.10000 క్షీణించి రూ.2,65,000 వద్దకు దిగివచ్చింది.

(Disclaimer: పైన పేర్కొన్న బంగారం, వెండి ధరలు సూచనపూర్వకమైనవి మాత్రమే. వీటిపై జీఎస్టీ, టీసీఎస్‌, ఇతర పన్నులు, సుంకాలు అదనంగా ఉండవచ్చు. ఖచ్చితమైన ధరల కోసం మీ స్థానిక నగల దుకాణంలో సంప్రదించండి.)




 


 

Videos

తెలంగాణ అసెంబ్లీలో పాము కలకలం

అమెరికా భయానక దాడులు.. ఇరాన్ కు భారీ నష్టం?

ట్రంప్ VS నెతన్యాహు.. యుద్ధంలో విభేదాలా?

అమ్మకంలో కూడా తగ్గని క్రేజ్... RCB టీమ్ కొత్త ఓనర్ ఎవరంటే..?

Film Awards 2025: చిరంజీవి పవర్ ఫుల్ స్పీచ్

మా తమ్ముడు YSRCPనే.. మా నాన్నకు YSR అంటే పిచ్చి..

కూటమి కుట్రలను ఛేదిస్తూ..! పిన్నెల్లి విడుదల

నితిన్ గడ్కరీని కలిసిన రోజా, మిథున్ రెడ్డి

బాక్సాఫిస్ ను బద్దలు కొడుతున్న ధురంధర్ 2

భారీగా తగ్గుతున్న బంగారం ధర

Photos

+5

గద్దర్‌ అవార్డ్స్‌- 2025లో మెరిసిన హీరోయిన్లు (ఫోటోలు)

+5

శ్రీశైలంలో రమణీయంగా రథోత్సవం పులకించిన భక్తులు (ఫొటోలు)

+5

గద్దర్‌ అవార్డ్స్ అందుకున్న విజేతలు (ఫొటోలు)

+5

అట్టహాసంగా గద్దర్ అవార్డుల వేడుక.. టాలీవుడ్ స్టార్స్ సందడి (ఫొటోలు)

+5

పేరేంట్స్‌గా మాకు గర్వకారణం.. కుమారుడి ఈవెంట్‌లో శివబాలాజీ దంపతులు (ఫొటోలు)

+5

టాలీవుడ్ జంట కిరణ్ అబ్బవరం- రహస్య ఉగాది వేడుకలు (ఫొటోలు)

+5

ఉగాది స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ ఇలా (ఫొటోలు)

+5

పరాభవ నామ సంవత్సర ఉగాది వేడుకల్లో వైఎస్‌ జగన్‌ దంపతులు (ఫొటోలు)

+5

విజయవాడ : సెలవులు, పండుగ వచ్చేసింది.. బస్టాండ్‌లో విద్యార్థులు, ప్రయాణికుల రద్దీ (ఫొటోలు)

+5

శ్రీశైలంలో ఉగాది ఉత్సవాలు.. కనుల పండువగా ప్రభోత్సవం (ఫొటోలు)