Breaking News

భారత్‌లో పాగా వేసేందుకు అమెజాన్ దూకుడు!

Published on Tue, 03/17/2026 - 13:39

భారతీయ శాటిలైట్‌ ఇంటర్నెట్ కమ్యునికేషన్‌ (శాట్‌కామ్‌) విభాగంలో ఆధిపత్యం కోసం ప్రపంచ దిగ్గజ కంపెనీల మధ్య పోటీ ముదురుతోంది. ఎలాన్ మస్క్‌కు చెందిన స్టార్‌లింక్ ఇప్పటికే రేసులో ముందంజలో ఉండగా జెఫ్ బెజోస్ నేతృత్వంలోని అమెజాన్ తన ‘ప్రాజెక్ట్ కూపర్‌’ కోసం అనుమతులను వేగవంతం చేయాలని భారత ప్రభుత్వాన్ని కోరుతోంది. ఈ మేరకు అమెజాన్ ప్రతినిధులు భారత టెలికాం శాఖ (డాట్‌)ను సంప్రదించినట్లు తెలుస్తోంది.

అనుమతుల కోసం..

భారత్‌లో శాటిలైట్ కమ్యూనికేషన్ సేవలను ప్రారంభించేందుకు అవసరమైన గ్లోబల్ మొబైల్ పర్సనల్ కమ్యూనికేషన్ బై శాటిలైట్ (జీఎంపీసీఎస్‌) లైసెన్స్ కోసం అమెజాన్ గత కొంతకాలంగా వేచి చూస్తోంది. ఇతర పోటీదారులతో పోలిస్తే అనుమతుల ప్రక్రియలో జాప్యం జరుగుతుండటంతో దీన్ని వేగవంతం చేయాలని కోరుతూ అమెజాన్ వరుస లేఖలు రాసినట్లు సమాచారం.

స్టార్‌లింక్ వర్సెస్ కూపర్‌

ఎలాన్ మస్క్‌కు చెందిన స్టార్‌లింక్ ఇప్పటికే గ్లోబల్ మార్కెట్‌లో పాగా వేయడమే కాకుండా భారత్‌లో కూడా అనుమతుల ప్రక్రియలో తుది దశకు చేరుకుంది. స్టార్‌లింక్‌తో పోలిస్తే అమెజాన్ తన సాటిలైట్ లాంచింగ్ షెడ్యూల్‌లో కొంత వెనుకబడి ఉంది. ఈ గ్యాప్‌ను భర్తీ చేయడానికి, భారతీయ వినియోగదారులకు త్వరగా చేరువ కావడానికి అమెజాన్ వేగంగా చర్యలు చేపడుతోంది.

భారీ కెపాసిటీతో సవాలు

స్టార్‌లింక్ సేవలతో పోలిస్తే తమ శాటిలైట్ నెట్‌వర్క్ భారత్‌లో గణనీయమైన స్థాయిలో డేటా కెపాసిటీని అందించగలదని అమెజాన్ ధీమా వ్యక్తం చేస్తోంది. వేగవంతమైన ఇంటర్నెట్, నిరంతర కనెక్టివిటీ విషయంలో స్టార్‌లింక్‌కు గట్టి పోటీ ఇస్తామని కంపెనీ ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లింది.

టెలికాం రంగంలో కొత్త విప్లవం

కేవలం నగరాలకే పరిమితం కాకుండా మారుమూల గ్రామాలకు, ఇంటర్నెట్ సదుపాయం లేని ప్రాంతాలకు హై-స్పీడ్ ఇంటర్నెట్ అందించడమే లక్ష్యంగా ప్రాజెక్ట్ కూపర్‌ పనిచేస్తోంది. అయితే, స్పెక్ట్రమ్ కేటాయింపులు, ధరల విషయంలో ప్రభుత్వం తీసుకునే నిర్ణయంపైనే ఈ కంపెనీల భవిష్యత్తు ఆధారపడి ఉంటుంది.

భారత ప్రభుత్వం ఇప్పటికే స్పెక్ట్రమ్ కేటాయింపులను వేలం ద్వారా కాకుండా అడ్మినిస్ట్రేటివ్ పద్ధతిలో కేటాయించాలని నిర్ణయించడంతో అంతర్జాతీయ సంస్థలకు సానుకూల వాతావరణం ఏర్పడింది. ఈ క్రమంలో అమెజాన్ ఎంత త్వరగా లైసెన్స్ పొందుతుందనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఒకవేళ అమెజాన్ రంగంలోకి దిగితే ధరల యుద్ధం మొదలై అంతిమంగా భారతీయ వినియోగదారులకే మేలు జరుగుతుందని కొందరు మార్కెట్ విశ్లేషకులు భావిస్తున్నారు.

Videos

103 డాలర్లకు చమురు ధర

దొంగచాటుగా హర్ముజ్ జలసంధిని దాటుతున్న నౌకలు

కూటమి తీరుపై రాష్ట్రవ్యాప్తంగా వైస్సార్సీపీ భారీ నిరసన

సీపీ సతీమణి ఏకే 47 గన్ తో 10 రౌండ్ల కాల్పులు

శత్రుల రాడార్లను ముప్పు తిప్పలు పెట్టె ఇరాన్ మిస్సైల్

Sec-Bad: 800 కిలోల కుళ్లిన చికెన్

ఎమ్మెల్యేల కథ దేవుడెరుగు.. BR నాయుడు రాసలీలలపై జగన్ సెటైర్లు

ఇది కదా తండ్రి ప్రేమంటే కొడుకు పరీక్ష కోసం ఏం చేశాడంటే

లాగి చెంపకేసి ఒక్కటి పీకాల్సింది పోయి... ఎంపీ పుట్టా మహేష్ డ్రగ్స్ కేసుపై జగన్ స్టాంగ్ రియాక్షన్

జగన్ 2.0 ట్రేడ్ మార్క్ మొదటి ప్రాధాన్యత వాళ్లకే

Photos

+5

ప్రతి ఇంట్లో ఇప్పుడు అదే చర్చ : వైఎస్‌ జగన్‌ (ఫోటోలు)

+5

తమ్ముడి పిల్లల బర్త్‌డే వేడుకల్లో మహేశ్‌ బాబు (ఫోటోలు)

+5

ఆస్కార్‌ వేడుకలో మెరిసిన వారణాసి బ్యూటీ ప్రియాంక చోప్రా.. (ఫోటోలు)

+5

రష్మిక-విజయ్ దేవరకొండ హల్దీ వేడుక.. (ఫొటోలు)

+5

‘ఉస్తాద్‌ భగత్‌సింగ్‌’ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)

+5

ఘనంగా నమన్‌ అవార్డుల ప్రదానోత్సవం.. మెరిసిన భారత క్రికెటర్లు (ఫోటోలు)

+5

OSCARS 2026 : ఆస్కార్‌ విజేతల జాబితా (ఫోటోలు)

+5

ఘనంగా కుల్దీప్ యాదవ్ పెళ్లి (ఫోటోలు)

+5

Best Photos Of The Week : ఈ వారం ఉత్తమ చిత్రాలు (మార్చి 15- 22)

+5

కుల్దీప్‌ యాదవ్‌ పెళ్లి వేడుక సందడి (ఫోటోలు)