Breaking News

కారు కడిగేటప్పుడు చాలామంది చేసే తప్పులు

Published on Sun, 03/15/2026 - 14:05

కారు అందంగా.. మిలమిల మెరిసిపోతుంటే ఎవరికి మాత్రం ఇష్టం ఉండదు చెప్పండి. కారు మెరిసిపోవాలంటే.. దాన్ని ఎప్పటికప్పుడు తుడుచుకుంటూ ఉండాలి, అప్పుడప్పుడు కడుగుతూ ఉండాలి. కానీ కొంతమంది కారు కడిగేటప్పుడు కూడా కొన్ని తప్పులు చేస్తుంటారు. అలాంటి తప్పుల గురించి ఇక్కడ వివరంగా తెలుసుకుందాం.

తప్పుడు సాధనాల వినియోగం
మనం చేతిలో పట్టుకునే స్పాంజ్ లేదా గుడ్డే.. కారు పెయింట్‌కు నష్టం కలిగిస్తుంది. చాలా మంది ఏ స్పాంజ్ అయినా సరిపోతుందని అనుకుంటారు. కానీ తప్పు రకం స్పాంజ్ లేదా టవల్ వాడితే కారు పెయింట్‌పై ఉన్న క్లియర్ కోట్‌పై చిన్న చిన్న గీతలు పడే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇంట్లో ఉపయోగించే పాత గుడ్డలు లేదా క్లీనింగ్ క్లాత్‌లు వాడకపోవడం మంచిది. బకెట్ల వినియోగం కూడా ముఖ్యమే. ఒకటి సబ్బు నీటికి, మరొకటి మిట్‌ను కడగడానికి ఉపయోగించాలి. ఇలా రెండు బకెట్లు వాడటం వల్ల మురికి నీరు తిరిగి కారు మీద పడకుండా ఉంటుంది.

డిష్ సోప్ ఉపయోగించకూడదు
కారును కడుక్కోవడానికి షాంపూ లేదా కిచెన్‌లో ఉన్న డిష్ సోప్ వంటివి వినియోగించుకోవచ్చు అనుకోవచ్చు. కానీ ఇది మంచి నిర్ణయం కాదు. డిష్ సోప్ తరచుగా వాడితే కారు మీద ఉన్న వాక్స్, రక్షణ పొర తొలగిపోతాయి. దాంతో కారు పెయింట్ సూర్యరశ్మి, ఆక్సిడేషన్ వల్ల త్వరగా పోతుంది. కాబట్టి కారు కోసం ప్రత్యేకంగా తయారు చేసిన ఆటోమోటివ్ షాంపూ మురికిని మెల్లగా తొలగిస్తూ, పెయింట్‌పై ఉన్న రక్షణ పొరను కాపాడుతుంది. అందువల్ల కారు రంగు ఎక్కువకాలం నిలుస్తుంది.

ఎక్కువ ప్రెషర్ కూడా ప్రమాదమే
కొంతమంది హై-ప్రెషర్ హోస్ లేదా ఆటోమేటిక్ కార్ వాష్ వాడటం వేగంగా పూర్తవుతుందని అనుకుంటారు. కానీ అవి కొన్నిసార్లు నష్టాన్ని కలిగించవచ్చు. అలాగే ఎక్కువ ప్రెషర్‌తో నీరు చిమ్మితే కారు ట్రిమ్ లేదా పెయింట్‌కు నష్టం కలగవచ్చు. అందువల్ల చేతితో కడిగేటప్పుడు మోస్తరు నీటి ఒత్తిడితో, కొంచెం దూరం ఉంచి కడగడం మంచిది.

ఆరబెట్టే సమయంలో జాగ్రత్త
కారు బాగా కడిగిన తర్వాత దాన్ని ఆరిపోవడానికి వదిలేస్తే సరిపోతుంది అనుకుంటే పొరపాటే. ఆలా చేస్తే నీటి మరకలు పడతాయి. అప్పుడు నీటిలో ఉన్న ఖనిజాలు పెయింట్‌పై నిలిచిపడి గట్టిగా అతుక్కొని శాశ్వత మచ్చలుగా మారవచ్చు. అందుకే ఎప్పుడూ శుభ్రమైన మైక్రోఫైబర్ టవల్‌తో కారు తుడవాలి.

Videos

పెద్ద తలకాయలు ఎంట్రీ.. పుట్టా మహేష్ కు నోటీసులు ఇచ్చి వదిలేసిన పోలీసులు

రైతుకు CI బెదిరింపులు.. ఎక్కడా భయపడని రైతన్న.. ఆడియో కాల్ లీక్

డ్రాగన్ పై దురంధర్ ఎఫెక్ట్..!

ఇంత నోరేసుకొని అరవడం కాదు.. అనితను ఏకిపారేసిన రాచమల్లు

పుట్టా మహేష్ డ్రగ్స్ కేసు.. తండ్రి కొడుకులకి ఇచ్చిపడేసిన కన్నబాబు

నువ్వు ఎంపీనా? డ్రగ్స్ డీలరా? టీడీపీ ఎంపీ పుట్ట మహేష్ పై విజయ్ రాజు ఫైర్

ఇజ్రాయెల్ పై మరోసారి దాడి.. నేలకూలిన భారీ భవనాలు

నెల్లూరు జిల్లాలో హైటెన్షన్.. కొట్టుకున్న జనసేన నేతలు

మద్ది శ్రీనివాస్ రాసలీలలు.. భార్య సంచలన నిజాలు

డ్రగ్స్ కేసు నుండి తప్పించేందుకు రంగంలోకి పెద్ద తలకాయలు

Photos

+5

ఘనంగా కుల్దీప్ యాదవ్ పెళ్లి (ఫోటోలు)

+5

Best Photos Of The Week : ఈ వారం ఉత్తమ చిత్రాలు (మార్చి 15- 22)

+5

కుల్దీప్‌ యాదవ్‌ పెళ్లి వేడుక సందడి (ఫోటోలు)

+5

వైట్‌ డ్రెస్‌లో టాలీవుడ్ యాంకర్ రష్మీ గౌతమ్ అందాలు (ఫోటోలు)

+5

భారత టెన్నిస్‌ దిగ్గజం సానియా మీర్జా లేటెస్ట్‌ పోస్ట్‌ (ఫొటోలు)

+5

అల్లు సినిమాస్‌ ప్రత్యేకతలివే.. (ఫోటోలు)

+5

కూకట్‌పల్లిలో సినీ నటి మీనాక్షి చౌదరి సందడి (ఫొటోలు)

+5

ఖమ్మంలో సందడి చేసిన హీరోయిన్ శ్రీలీల (ఫొటోలు)

+5

‘అల్లు సినిమాస్’ ప్రారంభోత్సవంలో సీఎం రేవంత్‌, బన్నీ (ఫోటోలు)

+5

అర్జున్‌ టెండుల్కర్‌- సానియా సంగీత్‌.. బుట్టబొమ్మలా సారా (ఫొటోలు)