Breaking News

ప్రమాదంలో యూపీఐ సెక్యూరిటీ!

Published on Sun, 03/15/2026 - 01:35

న్యూఢిల్లీ: ఆన్‌లైన్‌ మోసగాళ్లు కొత్త టెక్నాలజీతో యూపీఐ యూజర్లనూ బురిడీ కొట్టిస్తున్నారు. యూపీఐ భద్రతా ఫీచర్లను ఛేదించుకుని మరీ, ఆర్థిక లావాదేవీలు కానిచ్చేస్తున్నారని, సైబర్‌ ఇంటెలిజెన్స్‌ సంస్థ క్లౌడ్‌సెక్‌ ఆరోపించింది. ఇందుకు సంబంధించి ఒక నివేదిక విడుదల చేసింది. టెలీగ్రామ్‌లో 20 గ్రూప్‌లు చురుగ్గా పనిచేస్తున్నట్టు, ప్రతీ బృందంలో 100కు పైగా సభ్యులున్నుట్టు తెలిపింది. ఈ గ్రూప్‌లు ‘డిజిటల్‌ లూటెరా’ పేరుతో చర్చించుకోవడం, పంపిణీ చేయడం, నిర్వహించడం చేస్తున్నట్టు వెల్లడించింది. ‘‘ఇది కేవలం మరొక యూపీఐ మాల్వేర్‌ రకమే కాదు.

డివైజ్‌పై ఉన్న నమ్మకంపైనే డిజిటల్‌ లూటెరా దాడి చేస్తోంది. ఆపరేటింగ్‌ సిస్టమ్‌నే మార్చివేస్తున్నప్పుడు.. సంప్రదాయ రక్షణలైన సిమ్‌ బైండింగ్‌ యాప్‌ (సిమ్‌కు అనుసంధానమైన) సిగ్నేచర్‌ తనఖీ కూడా పనికిరాకుండా పోతుంది. దీనికి పరిష్కారం కనుగొనకపోతే డిజిటల్‌ చెల్లింపుల వ్యవస్థ అంతటినీ తన చేతుల్లోకి తీసుకునే ప్రమాదం ఉంటుంది’’అని హెచ్చరించింది. ఒక టెలిగ్రామ్‌ గ్రూప్‌ రెండు రోజుల్లోనే రూ.25–30 లక్షల లావాదేవీలను  పూర్తి చేసిందని క్లౌడ్‌సెక్‌ విశ్లేషణలో తేలింది. ఈ మోసపూరిత వ్యవస్థ ఎంత వేగంగా విస్తరించగలదు, ఎంత మంది మోసం చేయగలదన్నదానికి ఇది నిదర్శమని పేర్కొంది.  

మోసం ఇలా... 
మొబైల్‌ ఫోన్‌ యూజర్‌ తనకు తెలియకుండా హానికారక ఏపీకే ఫైల్‌ను ఇన్‌స్టాల్‌ చేసుకున్నప్పుడు.. డిజిటల్‌ లూటెరా కిట్‌ ఇన్‌స్టాల్‌ అయిపోతుంది. వెంటనే సైబర్‌ నేరస్థులకు ఫోన్‌పై నియంత్రణ వెళుతుంది. దీంతో బ్యాంక్‌ ఓటీపీలు అటాకర్ల టెలీగ్రామ్‌ ఛానళ్లకు వెళతాయి.  

భద్రతకు ఢోకాలేదు: ఎన్‌పీసీఐ 
దీనిపై నేషనల్‌ పేమెంట్స్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా(యూపీఐ నిర్వహణ సంస్థ/ఎన్‌పీసీఐ) స్పందించింది. డిజిటల్‌ చెల్లింపుల నిర్వహణకు సంబంధించి బలమైన తనిఖీలున్నట్టు స్పష్టం చేసింది. ‘‘సంబంధిత నివేదికను ఎన్‌పీసీఐ పరిశీలించింది. ఆ విధమైన రిస్క్‌లను పరిష్కరిచేందుకు తగినన్ని రక్షణలు ఉన్నాయి. బహుళ అంచల రక్షణలతో, గుర్తింపు ధ్రువీకరణలతో లావాదేవీలను సురక్షితంగా, భద్రంగా చేసుకునే విధంగా యూపీఐని రూపొందించడమైంది’’అని ఎన్‌పీసీఐ వివరణ ఇచ్చింది.

Videos

పెద్ద తలకాయలు ఎంట్రీ.. పుట్టా మహేష్ కు నోటీసులు ఇచ్చి వదిలేసిన పోలీసులు

రైతుకు CI బెదిరింపులు.. ఎక్కడా భయపడని రైతన్న.. ఆడియో కాల్ లీక్

డ్రాగన్ పై దురంధర్ ఎఫెక్ట్..!

ఇంత నోరేసుకొని అరవడం కాదు.. అనితను ఏకిపారేసిన రాచమల్లు

పుట్టా మహేష్ డ్రగ్స్ కేసు.. తండ్రి కొడుకులకి ఇచ్చిపడేసిన కన్నబాబు

నువ్వు ఎంపీనా? డ్రగ్స్ డీలరా? టీడీపీ ఎంపీ పుట్ట మహేష్ పై విజయ్ రాజు ఫైర్

ఇజ్రాయెల్ పై మరోసారి దాడి.. నేలకూలిన భారీ భవనాలు

నెల్లూరు జిల్లాలో హైటెన్షన్.. కొట్టుకున్న జనసేన నేతలు

మద్ది శ్రీనివాస్ రాసలీలలు.. భార్య సంచలన నిజాలు

డ్రగ్స్ కేసు నుండి తప్పించేందుకు రంగంలోకి పెద్ద తలకాయలు

Photos

+5

ఘనంగా కుల్దీప్ యాదవ్ పెళ్లి (ఫోటోలు)

+5

Best Photos Of The Week : ఈ వారం ఉత్తమ చిత్రాలు (మార్చి 15- 22)

+5

కుల్దీప్‌ యాదవ్‌ పెళ్లి వేడుక సందడి (ఫోటోలు)

+5

వైట్‌ డ్రెస్‌లో టాలీవుడ్ యాంకర్ రష్మీ గౌతమ్ అందాలు (ఫోటోలు)

+5

భారత టెన్నిస్‌ దిగ్గజం సానియా మీర్జా లేటెస్ట్‌ పోస్ట్‌ (ఫొటోలు)

+5

అల్లు సినిమాస్‌ ప్రత్యేకతలివే.. (ఫోటోలు)

+5

కూకట్‌పల్లిలో సినీ నటి మీనాక్షి చౌదరి సందడి (ఫొటోలు)

+5

ఖమ్మంలో సందడి చేసిన హీరోయిన్ శ్రీలీల (ఫొటోలు)

+5

‘అల్లు సినిమాస్’ ప్రారంభోత్సవంలో సీఎం రేవంత్‌, బన్నీ (ఫోటోలు)

+5

అర్జున్‌ టెండుల్కర్‌- సానియా సంగీత్‌.. బుట్టబొమ్మలా సారా (ఫొటోలు)