Breaking News

ఇల్లు కొనాలంటే.. ఈ వసతులు ఉండాల్సిందే!

Published on Sat, 03/14/2026 - 11:20

గతంలో గృహ కొనుగోలులో ధరకు ప్రాధాన్యం ఉండేది. కానీ, ఇప్పుడు వసతులు చూశాకే నిర్ణయం తీసుకుంటున్నారు. ధర ఎంతైనా వసతుల విషయంలో ఏమాత్రం రాజీపడటం లేదు. గృహ కొనుగోలుదారుల అభిరుచుల మేరకు డెవలపర్లు కూడా సరికొత్త సౌకర్యాలను అందిస్తున్నారు. గతంలో కమ్యూనిటీలలో జిమ్, స్విమ్మింగ్‌ పూల్‌ వంటి నాలుగైదు వసతులు ఉంటే సరిపోయేది కానీ, ఇప్పుడు భవిష్యత్తు అవసరాలు, కొనుగోలుదారుల అభిరుచులకు తగ్గట్టు ఉండాల్సిందే. 

ఇంటి నుంచి పని కోసం కో-వర్కింగ్‌ స్పేస్, ఆన్‌లైన్‌ క్లాస్‌ల కోసం డిజిటల్‌ క్లాస్‌ రూమ్‌ నుంచి మొదలుపెడితే.. టెర్రస్, క్లబ్‌హౌస్‌పై సౌర విద్యుత్‌ ఏర్పాట్లు, ఔట్‌డోర్‌ జిమ్, ప్రైవేట్‌ స్విమ్మింగ్‌ పూల్స్, హోమ్‌ థియేటర్, ఎలక్ట్రిక్‌ చార్జింగ్‌ స్టేషన్లు, పెట్‌ పార్క్, గోల్ఫ్‌కోర్స్‌ వరకూ అన్ని ఆధునిక వసతులు కావాలని గృహ కొనుగోలుదారులు భావిస్తున్నారు.

పెట్‌ పార్క్‌..
జంతు ప్రేమికుల కోసం కూడా డెవలపర్లు ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు. నివాస సముదాయాల్లో వసతుల జాబితాలో పెట్‌ పార్కులు కూడా చేరిపోయాయి. గేటెడ్‌ కమ్యూనిటీలలో కొనుగోలుదారులు పెంచుకునే పెంపుడు జంతువుల కోసం పెట్‌ పార్క్, క్లబ్‌హౌస్‌లో పెట్‌ స్పాలను ఏర్పాటు చేస్తున్నారు. 

దీంతో పాటు పెంపుడు జంతువుల ఆహార ఉత్పత్తులు, శిక్షకులు, వ్యాయామ ఉపకరణాలు వంటివి ఆయా ప్రాజెక్ట్‌లలో అందుబాటులో ఉంటాయి. అలాగే పెట్రోల్, డీజిల్‌ వంటి వాహనాలతో పర్యావరణం కలుషితం అవుతున్న నేపథ్యంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఎలక్ట్రిక్‌ వాహనాల(ఈవీ) వాడకాన్ని ప్రోత్సహిస్తున్నాయి. వాహన కొనుగోళ్లపై రాయితీలు అందిస్తుండటంతో పాటు చార్జింగ్‌ స్టేషన్లను కూడా ఏర్పాటు చేస్తున్నాయి.

హోమ్‌ గార్డెనింగ్‌..
సొంతిల్లు కొనుగోలు చేసే క్రమంలో గేటెడ్‌ కమ్యూనిటీలో కామన్‌ ఏరియాలు ఎంత వరకు ఉన్నాయో అడిగి మరీ తెలుసుకుంటున్నారు. గతంలో కామన్‌ ఎలివేటర్, కామన్‌ కారిడార్, గ్యారేజ్, స్టేర్‌కేస్‌ ఉండేవి ఇప్పుడు వాటిని ప్రైవేట్‌గా కావాలని అడుగుతున్నారు. ఇంట్లో సొంత అవసరాల కోసం కమ్యూనిటీ గార్డెన్‌ను ఏర్పాటు చేస్తున్నారు. 

చిన్నపాటి స్థలంలో ఆకుకూరలు, కాయగూరలు పండించుకునేలా వర్టికల్ గార్డెనింగ్, బాల్కనీలలో ఉండేలా చూసుకుంటున్నారు. వారాంతాలలో కమ్యూనిటీ వాసులతో ఆహ్లాదంగా గడిపేందుకు ఔట్‌డోర్‌ కిచెన్, డైనింగ్‌ ఏరియా ఏర్పాటు చేస్తున్నారు. టెర్రస్, క్లబ్‌ హౌస్‌పై సౌర విద్యుత్  ఉండాలని కోరుతున్నారు. వీధి దీపాలు, ఇతరత్రా అవసరాల కోసం ఈ విద్యుత్‌నే వినియోగిస్తున్నారు. దీంతో నివాసిత సంఘానికి కరెంట్‌ బిల్లు భారం తగ్గుతుంది. 

Videos

జాతీయ జెండాతో హార్మోజ్ దాటిన మరో భారత్ గ్యాస్ షిప్..

అమెరికా ఆయిల్ ట్యాంకర్లను పేల్చేసిన ఇరాన్..! షాక్ లో ట్రంప్

వామ్మో... ఏంటి ఈ రేట్లు! 1KG టమాటా రూ.250... 1KG ఉల్లిపాయ రూ.175

పెట్రోలు వెతల సిత్రాలు చూశారా..!

ఇవాళ కూడా బంగారం ధర భారీ పతనం రెండు రోజుల్లో ఎంత తగ్గిందంటే..!

జూలో ఫుడ్ పెట్టిన చిన్నారిపై సింహం దాడి..

పేర్ని నాని ఇంటి వద్ద హైటెన్షన్

బాగ్దాద్ పై బాంబుల వర్షం.. US ఎంబసీపై దాడులు

ఇరాన్ యుద్ధం.. బ్యాంకులో నుంచి మీ డబ్బు డ్రా చేసుకోండి...

అనసూయపై అసభ్యకర పోస్టులు.. ఇద్దరు అరెస్ట్

Photos

+5

అల్లు సినిమాస్‌ ప్రత్యేకతలివే.. (ఫోటోలు)

+5

కూకట్‌పల్లిలో సినీ నటి మీనాక్షి చౌదరి సందడి (ఫొటోలు)

+5

ఖమ్మంలో సందడి చేసిన హీరోయిన్ శ్రీలీల (ఫొటోలు)

+5

‘అల్లు సినిమాస్’ ప్రారంభోత్సవంలో సీఎం రేవంత్‌, బన్నీ (ఫోటోలు)

+5

అర్జున్‌ టెండుల్కర్‌- సానియా సంగీత్‌.. బుట్టబొమ్మలా సారా (ఫొటోలు)

+5

హైదరాబాద్ : పరీక్షలకు టాటా.. ఇక ఇంటి బాట (ఫొటోలు)

+5

హైదరాబాద్ : ఓ షాపింగ్‌ మాల్‌లో సందడి చేసిన సినీనటి సమంత (ఫొటోలు)

+5

హైదరాబాద్‌లో నెట్‌ఫ్లిక్స్‌ కార్యకలాపాలు (ఫోటోలు)

+5

వాళ్లిద్దరి వల్లే ట్రిప్‌ ఎంతో స్పెషల్‌: మెహరీన్‌ (ఫోటోలు)

+5

తాడేపల్లి : వైఎస్సార్‌సీపీ ఆవిర్భావ వేడుకల్లో వైఎస్‌ జగన్‌ (ఫొటోలు)