Breaking News

ఇస్మార్ట్ స్లీప్... హాయి హాయిగా

Published on Fri, 03/13/2026 - 06:02

సుఖమెరుగని నిద్రకు సమస్యల కష్టాలు ఎదురవుతున్నాయి. ‘నాకు కంటినిండా నిద్రపడుతుంది’ అనే వాళ్లు అదృష్టవంతులయ్యారు. ఆరోగ్యంతో ముడి పడి ఉన్న నిద్ర ఈ డిజిటల్‌ కాలంలో నిర్లక్ష్యానికి గురవుతోంది. ఉరుకు పరుగుల మీద నిద్ర మన దగ్గరకు రావాలంటే మంత్రదండం ఏదీ అక్కర్లేదు, ఆ శక్తి మన దగ్గరే ఉంది. స్లీప్‌ టెక్‌ అనేది ఈ సంవత్సరం ప్రముఖ అంశాల్లో ఒకటిగా మారింది. స్లీప్‌ యాక్సెసరీలను కొనేవారి సంఖ్య ప్రపంచవ్యాప్తంగా పెరిగింది. యాంటి–స్నోరింగ్‌ టెక్నాలజీకిప్రాధాన్యత పెరుగుతోంది....

హూప్‌ 5. ఓ బ్యాండ్‌
ఇన్‌–డెప్త్‌ స్లీప్‌ ఇన్‌ఫర్‌మేషన్, పర్సనలైజ్‌డ్‌ రికమండేషన్‌లకు సంబందించి ఉపకరించే స్లీప్‌ ట్రాకర్‌...హూప్‌ 5.ఓ బ్యాండ్‌. బటన్‌లు, స్క్రీన్స్‌లాంటివేమీ లేకుండా సరళంగా ఉంటుంది. బ్యాండ్‌లోని ఎల్‌ఈడీ, బాడీ టెంపరేచర్‌ సెన్సర్‌లు, ఫొటో డియోడ్‌లు మన నిద్రకు సంబంధించి విలువైన సమాచారాన్ని అందిస్తాయి. ఆరోగ్యకరమైన అలవాట్లకు శ్రీకారం చుట్టడానికి ఇందులోని ఏఐ హూప్‌ కోచ్‌ ఉపయోగపడుతుంది. నిద్ర తక్కువైతే, స్లీప్‌ స్ట్రెస్‌కు గురవుతుంటే దాని నుంచి బయట పడి సుఖనిద్ర పోవడానికి ఈ ఏఐ కోచ్‌ అందించే వివరాలు ఉపయోగపడతాయి. ఫీచర్‌లు: స్లీప్, స్ట్రెయిన్‌ అండ్‌ రికవరీ, పర్సనలైజ్‌డ్‌ కోచింగ్, హార్ట్‌ రేట్‌ జోన్స్‌

యాంటీ–స్నోరింగ్‌ గ్యాడ్జెట్స్‌
స్లీప్‌ ట్రాకర్స్‌తోపాటు ‘స్మార్ట్‌స్లీప్‌ ఆప్నియా ఎయిడ్‌’లాంటి యాంటీ–స్నోరింగ్‌ టెక్నాలజీ గ్యాడ్జెట్‌లకుప్రాధాన్యత పెరిగింది. ఈ డివైజ్‌ గురకను నివారించడంలో సహాయపడడమే కాకుండా నిద్రనాణ్యతను మెరగుపరుస్తుంది. ‘బ్రీతింగ్‌ కరెక్షన్‌’లాంటి ఫీచర్‌లు ఉన్న ఈ పరికరాన్ని తేలికగా ఉపయోగించవచ్చు.


గార్మిన్‌ ఫోర్‌రన్నర్‌ వితింగ్స్‌ వాచ్‌
‘గార్మిన్‌ ఫోర్‌రన్నర్‌ 165’ స్లీప్‌ట్రాకర్‌లో స్లీప్‌ కోచ్, స్లీప్‌ స్కోర్, న్యాప్‌ డిటెక్షన్‌లాంటి ఫీచర్‌లు ఉన్నాయి. ఇది స్లీప్‌ సైకిల్స్, రెస్ట్‌లెస్‌ మూమెంట్స్‌... మొదలైన వాటిని ట్రాక్‌ చేస్తుంది. ‘వితింగ్స్‌ వాచ్‌ 2’ అనేది హై–క్వాలిటీ స్లీప్‌ ట్రాకర్‌. తేలికగా, సౌకర్యవంతంగా ఉండే ఈ ట్రాకర్‌ సంప్రదాయ వాచ్‌లాగే కనిపిస్తుంది. రాత్రిపూట దృష్టి మరల్చే ఎల్‌ఈడీ స్క్రీన్‌కు దూరంగా ఉండాలనుకునేవారికి ఈ ట్రాకర్‌ సరైన ఎంపిక. దీని స్లీప్‌–ట్రాకింగ్‌ ఫీచర్లు మార్కెట్‌లో ఇతర స్మార్ట్‌ వాచ్‌ల మాదిరిగానే ఉంటాయి.

ఆరా రింగ్‌
సుఖనిద్రకు సంబంధించి ఆకర్షణీయమైన, ఆరోగ్యకరమైన ఎంపిక...ఆరా రింగ్‌. తేలికైన ఈ హైటెక్‌ పరికరం ‘స్లీప్‌ రీడింగ్స్‌’ను అందించడంతో పాటు ఇతర ఆరోగ్య అంశాలపై కూడా దృష్టి పెట్టి అప్రమత్తం చేస్తుంది. ప్రతిరోజూ నిద్ర లేవగానే స్లీప్‌ స్కోర్‌ చూసుకోవచ్చు. యాక్టివిటీని ఆటోమేటిక్‌గా ట్రాక్‌ చేస్తూ యాపిల్‌ హెల్త్, స్ట్రవ, గూగుల్‌ ఫిట్‌లాంటి యాప్‌లతో అనుసంధానం అవుతుంది. నిద్రను ట్రాక్‌ చేయడానికి, గురకను గుర్తించడానికి ఉపకరించి సౌకర్యవంతమైన స్మార్ట్‌ రింగ్‌....శాంసంగ్‌ గెలాక్సీ. నిద్రకు సంబంధించి విశ్లేషణతో పాటు వర్కవుట్‌లు, యాక్టివిటీస్, హార్ట్‌ రేట్, బ్లడ్‌ ఆక్సిజన్, టెంపరేచర్‌లాంటి హెల్త్‌ మెట్రిక్స్‌ను ఆటోమేటిక్‌గా ట్రాక్‌ చేయడానికి శాంసంగ్‌ గెలాక్సీ రింగ్‌ ఉపకరిస్తుంది. స్నోర్‌ డిటెక్షన్, గెశ్చర్‌ కంపాటిబిలిటీలాంటి అదనపు ఫీచర్‌లు ఇందులో ఉన్నాయి.

స్మార్ట్‌ దిండు... స్లీప్‌ మాస్క్‌!
మరో ట్రెండ్‌...స్మార్ట్‌ స్లీప్‌ సపోర్ట్‌ సిస్టమ్‌. ఈ ట్రెండులో భాగంగా  సంప్రదాయ దిండ్లను వాడకుండా, గాఢమైన నిద్ర కోసం మెడలు, వెన్నెముకకు సపోర్ట్‌ చేసే కంటోర్డ్, అడాప్టివ్‌ డిజైన్‌లను వాడుతున్నారు. ఉదాహరణకు... 3డీ ఆర్థోపెడిక్‌ నెక్‌ పిల్లో. ‘మెడనొప్పి, గురక సమస్యకు మా 3డీ ఆర్థోపెడిక్‌ నెక్‌ పిల్లో పరిష్కారం చూపుతుంది. హై–ఎలాస్టిక్, బ్రీతబుల్‌ మెమరీ ఫోమ్‌ నుంచి రూపొందించిన ఈ దిండు మెడకు సౌకర్యంగా ఉంటుంది. ఒత్తిడిని తగ్గిస్తుంది’ అని తెలియజేసింది కంపెనీ. స్లీప్‌ మాస్క్‌ అనేది నిద్ర ప్రేమికుల తప్పనిసరి అవసరం అయింది. పరిసరాల కాంతికి దూరంగా చీకటి వాతావరణంలో త్వరగా నిద్రపోవడానికి, నాణ్యమైన నిద్రకు, నిద్రలేమి చికిత్సకు ఈ మాస్క్‌లు ఉపయోగపడతాయి.

Videos

బెంగళూరులో సిలిండర్ దొంగతనం.. CCTV విజువల్స్ వైరల్

భార్య వేధింపులకు మరో భర్త బలి

ఇన్వెస్టర్లకు డబుల్ ధమాకా.. 100 షేర్లకు 1000 షేర్లు ఫ్రీ..

మెగా పారడైస్ పై బిగ్ అప్ డేట్.. ఎప్పుడు ప్రారంభం?

పాల కోసం ఎగబడ్డ జనం

హైదరాబాద్ లో గ్యాస్ టెన్షన్.. భారీగా పెరిగిన బుకింగ్స్

పచ్చ మీడియా సైలెంట్.. బయటపడ్డ పెంచలయ్య సిఫార్స్ పత్రం

అమెరికాలో కాల్పుల కలకలం

యుద్ధం ముగించాలి.. లేదా..! ట్రంప్ కు రాండ్ పాల్ హెచ్చరిక

జగన్ విలువ ఇప్పుడు తెలుస్తుంది.. YSRCP పేరు వింటేనే బాబుకు గజ గజ

Photos

+5

హైదరాబాద్ : పరీక్షలకు టాటా.. ఇక ఇంటి బాట (ఫొటోలు)

+5

హైదరాబాద్ : ఓ షాపింగ్‌ మాల్‌లో సందడి చేసిన సినీనటి సమంత (ఫొటోలు)

+5

హైదరాబాద్‌లో నెట్‌ఫ్లిక్స్‌ కార్యకలాపాలు (ఫోటోలు)

+5

వాళ్లిద్దరి వల్లే ట్రిప్‌ ఎంతో స్పెషల్‌: మెహరీన్‌ (ఫోటోలు)

+5

తాడేపల్లి : వైఎస్సార్‌సీపీ ఆవిర్భావ వేడుకల్లో వైఎస్‌ జగన్‌ (ఫొటోలు)

+5

నాగచైతన్య ‘వృషకర్మ’ మూవీ HD వర్కింగ్ స్టిల్స్

+5

అడివి శేష్‌ 'డెకాయిట్‌' మూవీ ప్రెస్‌మీట్‌ (ఫొటోలు)

+5

హైదరాబాద్ లో పశ్చిమాసియా యుద్ధ ప్రభావం..మూతపడుతున్న హోటళ్లు (ఫొటోలు)

+5

హైదరాబాద్ : రాత్రిపూట చార్మినార్‌ వద్ద రంజాన్‌ సందడి (ఫొటోలు)

+5

హైదరాబాద్‌లో వేల్స్‌ మహిళల హాకీ జట్టు సందడి (ఫొటోలు)