భార్య వేధింపులకు మరో భర్త బలి
Breaking News
వార్ ఎఫెక్ట్: లేటెస్ట్ గ్యాస్ సిలిండర్ ధరలు ఇలా..
Published on Thu, 03/12/2026 - 19:21
భారతదేశంలో వంట గ్యాస్ (LPG) ధరలు మళ్లీ పెరిగాయి. దీని ప్రభావం సాధారణ వినియోగదారులతో పాటు, హోటళ్లు & రెస్టారెంట్లు వ్యాపారుల మీద కూడా పడింది. ధరల పెరుగుదలకు ప్రధాన కారణం.. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ఇంధన మార్కెట్లో ఏర్పడిన అస్థిర పరిస్థితుల అని తెలుస్తోంది.
ప్రస్తుతం పశ్చిమ ఆసియా ప్రాంతంలో జరుగుతున్న భౌగోళిక, రాజకీయ ఉద్రిక్తతలు ప్రపంచ ఇంధన సరఫరా వ్యవస్థపై ప్రభావం చూపుతున్నాయి. ముఖ్యంగా హర్మూజ్ జలసంధి.. ప్రపంచంలో ఇంధన రవాణాకు అత్యంత కీలకమైనది. ఈ ప్రాంతంలో ఏర్పడిన సమస్యల వల్ల నౌకాశ్రయ మార్గాలు ప్రభావితమై, ఇంధన సరఫరా ఆలస్యం అవుతోంది.
నిజానికి ఇండియా ఎక్కువ మొత్తంలో ఎల్పీజీని.. గల్ఫ్ దేశాల నుంచి దిగుమతి చేసుకుంటుంది. అందువల్ల పశ్చిమ ఆసియాలో జరిగే రాజకీయ లేదా యుద్ధ పరిస్థితులు భారత్లో ఎల్పీజీ ధరలపై నేరుగా ప్రభావం చూపుతోంది. అంతర్జాతీయ మార్కెట్లో ఇంధన ధరలు పెరగడంతో, దేశంలోని ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు కూడా ఎల్పీజీ సిలిండర్ ధరలను పెంచాల్సిన పరిస్థితి వచ్చింది.
14.2 కిలోల డొమెస్టిక్ సిలిండర్ (గృహ వినియోగం) ధర దేశవ్యాప్తంగా రూ.60 వరకు పెరిగింది. 19 కిలోల కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధర కూడా గణనీయంగా పెరిగింది.
కొత్త ధరలు
ఢిల్లీ
డొమెస్టిక్ గ్యాస్ సిలిండర్: రూ. 913
కమర్షియల్ గ్యాస్ సిలిండర్: రూ. 1884.50
ముంబై
డొమెస్టిక్ గ్యాస్ సిలిండర్: రూ. 912.50
కమర్షియల్ గ్యాస్ సిలిండర్: రూ. 1,836
కోల్కతా
డొమెస్టిక్ గ్యాస్ సిలిండర్: రూ. 939.00
కమర్షియల్ గ్యాస్ సిలిండర్: రూ. 1,988.50
చెన్నై
డొమెస్టిక్ గ్యాస్ సిలిండర్: రూ. 928.50
కమర్షియల్ గ్యాస్ సిలిండర్: రూ. 2,043.50
హైదరాబాద్
డొమెస్టిక్ గ్యాస్ సిలిండర్: రూ. 965.00
కమర్షియల్ గ్యాస్ సిలిండర్: రూ. 2,105.50
వినియోగదారులు ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే.. గ్యాస్ సిలిండర్ ధరలు రాష్ట్రాల వారీగా ఉండే స్థానిక పన్నులు, రవాణా ఖర్చుల కారణంగా కొంత మారే అవకాశం ఉంది. అయితే పెరుగుతున్న ధరలు వినియోదాగదారుల్లో ఆందోళన కలిగిస్తోంది. ధరలు ఇలా పెరిగితే ఎలా.. రానున్న రోజుల్లో మరింత పెరుగుతుందా? అని భయపడుతున్నారు0
Tags : 1