10 నిమిషాల్లో 12 లక్షల కోట్లు ఆవిరి.... ఈ స్టాక్స్ మీ దగ్గర ఉంటే కొంప కొల్లేరే
Breaking News
30వేల ఉద్యోగుల తొలగింపు?: స్పందించిన కంపెనీ
Published on Mon, 03/09/2026 - 12:58
2026లో ప్రముఖ కంపెనీలెన్నో తమ ఉద్యోగులను తొలగించాయి. ఇలాంటి సమయంలో టెక్ మహీంద్రా కంపెనీ కూడా ఒకేసారి 30వేల మంది ఉద్యోగులను తొలగించనున్నట్లు కొన్ని వార్తలు తెరపైకి వచ్చాయి. దీనిపై సదరు కంపెనీ స్పందించింది.
ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వార్తల్లో ఎలాంటి నిజం లేదని, కంపెనీ స్టాక్ ఎక్స్చేంజ్కు ఇచ్చిన అధికారిక ప్రకటనలో స్పష్టం చేసింది. సోషల్ మీడియాలో వచ్చిన పోస్టులు.. కేవలం తప్పుదారి పట్టించే వదంతులేనని పేర్కొంది. మార్కెట్లో అనవసర గందరగోళం రాకుండా.. ఉండేందుకు ఈ విషయంపై క్లారిటీ ఇచ్చినట్లు తెలిపింది.
టెక్ మహీంద్రా కంపెనీ ఏజెంటిక్ ఏఐ ప్లాట్‌ఫామ్‌ను తీసుకొచ్చేందుకు మైక్రోసాఫ్ట్‌తో కలిసి పనిచేసేందుకు భాగస్వామ్యం కుదుర్చుకుంది. ఆ తరువాత లేఆఫ్స్ ప్రచారం తెరమీదకు వచ్చింది. అయితే ప్రస్తుతం ఈ విషయంపై కంపెనీ క్లారిటీ ఇచ్చేసింది. కాగా.. టెక్ మహీంద్రా త్రైమాసిక గణాంకాల ప్రకారం కంపెనీలో ప్రపంచవ్యాప్తంగా సుమారు 1.5 లక్షల మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు.
ఇదీ చదవండి: పసిడి ప్రియులకు శుభవార్త.. మరింత తగ్గిన బంగారం, వెండి!
ఏఐ కారణంగానే ఉద్యోగులను తొలగించనున్నట్లు సోషల్ మీడియాలో పేర్కొంటున్నారు. దీనికి ప్రధాన కారణం ప్రపంచవ్యాప్తంగా టెక్నాలజీ కంపెనీలు AI ఉపయోగాన్ని పెంచుతున్న నేపథ్యంలో ఉద్యోగాలపై ప్రభావం పడవచ్చనే భావన అని తెలుస్తోంది. అయితే టెక్ మహీంద్రా భారీ స్థాయి ఉద్యోగాల కోత గురించి ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని వెల్లడించింది.
Tags : 1