Breaking News

ఎన్‌పీఎస్‌ నుంచి విత్‌డ్రా ఇలా..

Published on Mon, 03/09/2026 - 07:15

ఆర్థికంగా ఏదైనా అవసరం వస్తే గట్టెక్కేందుకు ఎన్నో మార్గాలు వెతుకుతాం. చివరికి ఏదో ఒక రుణమైనా తీసుకుని బయటపడదామని అనుకుంటాం. కానీ, అధిక వడ్డీ రేట్లపై అప్పులు తెచి్చ, భవిష్యత్తు ఆదాయాన్ని తాకట్టు పెట్టే బదులు.. ఏవైనా పెట్టుబడులుంటే, వాటిని వినియోగించుకోవడం మంచిది. అలాంటి సందర్భాల్లో జాతీయ పింఛను వ్యవస్థ (ఎన్‌పీఎస్‌) నుంచి కూడా పెట్టుబడులను వెనక్కి తీసుకోవచ్చు!. కాకపోతే దీన్ని విచక్షణ మేరకు వినియోగించుకోవాలి. ఎంత అవసరం అయినా... భవిష్యత్తు కోసం ఉద్దేశించినది కనుక వివేకంతో వ్యవహరించాలి.

ఎలా వెనక్కి తీసుకోవచ్చు?

  • ఆన్‌లైన్‌లో అయితే ప్రొటీన్‌ ఈగోవ్‌ పోర్టల్‌కు వెళ్లాలి. పర్మినెంట్‌ అకౌంట్‌ నంబర్‌ (ప్రాన్‌), పాస్‌వర్డ్‌తో లాగిన్‌ అవ్వాలి. పాస్‌వర్డ్‌ మర్చిపోతే ఫర్‌గెట్‌ ఆప్షన్‌తో రీసెట్‌ చేసుకోవచ్చు.

  • లాగిన్‌ అనంతరం ‘విత్‌డ్రాయల్‌’ సెక్షన్‌కు వెళ్లాలి. అందులో ట్రాన్సాక్ట్‌ ఆన్‌లైన్‌ సెక్షన్‌లో విత్‌డ్రాయల్‌ ఆప్షన్‌ ఎంపిక చేసుకోవాలి.

  • విత్‌డ్రాయల్‌ రకాన్ని ఎంపిక చేసుకోవాలి. రిటైర్మెంట్‌ లేదా పాక్షిక ఉపసంహరణ లేదా ముందస్తుగా వైదొలగడంలో ఒకదాన్ని  ఎంచుకోవాలి.

  • ఫారమ్‌లోని వివరాలను పూర్తిచేయాలి. ప్రాన్‌ను ధ్రువీకరించి, అవసరమైన పత్రాలను అప్‌లోడ్‌ చేసి సబ్‌మిట్‌ చేయాలి.

  • ఈ అభ్యర్థన ఆమోదం పొందితే రెండు పనిదినాల్లో సభ్యుడి ఖాతాలో నిబంధనల మేరకు రావాల్సిన మొత్తం జమ అవుతుంది.   
    ఆఫ్‌లైన్‌లో దరఖాస్తు సమర్పణకు వీలుగా సీఆర్‌ఏ వెబ్‌సైట్‌ నుంచి పత్రాన్ని డౌన్‌లోడ్‌ చేసుకోవాలి. లేదంటే పాయింట్‌ ఆఫ్‌ ప్రెజెన్స్‌ (పీవోపీ) నుంచి కూడా తీసుకోవచ్చు.

  • పత్రంలో పాన్‌ వివరాలు, వ్యక్తిగత వివరాలు న మోదు చేసి, కేవైసీ డాక్యుమెంట్లు జత చేయాలి.

  • ఈ పత్రాన్ని తీసుకెళ్లి ఏదేనీ పీవోపీలో సమరి్పంచొచ్చు. ఎన్‌పీఎస్‌ పీవోపీ మీకు సమీపంలో ఎక్క డ ఉన్నదీ గూగుల్‌ సెర్చ్‌ద్వారా తెలుసుకోవచ్చు. స్టాక్‌ హోల్డింగ్‌ కార్పొరేషన్, ఎస్‌బీఐ క్యాప్‌ సెక్యూరిటీస్, ఐసీఐసీఐ సెక్యూరిటీస్, ఐడీఎఫ్‌సీ ఫస్ట్‌బ్యాంక్‌ ఇలా పీవోపీలు చాలానే ఉన్నాయి.

పాక్షిక ఉపసంహరణ

  • ఎన్‌పీఎస్‌లో టైర్‌–1 ఖాతా ప్రారంభించిన మూడేళ్ల అనంతరం, మూసివేయాల్సిన అవసరం లేకుండా పాక్షికంగా ఉపసంహరించుకునేందుకు అర్హత లభిస్తుంది.

  • సొంత చందాల మొత్తం... అంటే తాను చెల్లించిన దాని నుంచి 25 శాతాన్ని వెనక్కి తీసుకోవచ్చు. యాజమాన్యం జమ చేసిన మొత్తాన్ని గానీ, పెట్టుబడులపై వృద్ధి రూపంలో పెరిగిన మొత్తాన్ని గానీ పరిగణనలోకి తీసుకోరు.

  • జీవిత కాలంలో నాలుగు పర్యాయాలు ఇలా పాక్షికంగా ఉపసంహరించుకోవచ్చు. కాకపోతే ఒక సారి ఉపసంహరించుకున్నాక మరో నాలుగేళ్ల తరవాత గానీ మళ్లీ ఉపసంహరించుకోలేరు.

  • పిల్లల ఉన్నత విద్య లేదా వివాహ అవసరాల కోసం పాక్షికంగా వెనక్కి తీసుకోవచ్చు.

  • ఇంటి నిర్మాణం లేదా కొనుగోలుకు సైతం తీసుకోవచ్చు. అప్పటికే సొంతంగా ఇల్లు కలిగి ఉండకూడదు.

  • సభ్యులు లేదా సభ్యుడిపై ఆధారపడిన కుటుంబీకులు తీవ్ర అనారోగ్యానికి గురై... వారి చికిత్స కోసం డబ్బు అవసరమైతే పాక్షికంగా విత్‌డ్రా చేసుకోవచ్చు.

  • ఎన్‌పీఎస్‌ ఖాతాపై రుణం తీసుకుని, దాన్ని తీర్చేయాలనుకున్నా కూడా పాక్షిక ఉపసంహరణకు అనుమతిస్తారు.

ఈ విషయాలను గమనించాలి..

  • 60 ఏళ్ల నాటికి లేదా 15 ఏళ్ల పాటు చందాలు జమ చేసిన తర్వాత మొత్తం నిధి రూ.8లక్షలు మించకుండా ఉంటే అందులో 80 శాతాన్ని ఉపసంహరించుకోవచ్చు. మిగిలిన 20 శాతంతో యాన్యుటీ ప్లాన్‌ తీసుకోవాలి.

  • ఎన్‌పీఎస్‌ సభ్యుడు/సభ్యురాలు మరణించినట్టయితే వారి పేరిట ఉన్న ఫండ్‌ను నామినీకి బదిలీ చేస్తారు.

  • ఎన్‌పీఎస్‌ కింద గరిష్ట వయో పరిమితిని 75 ఏళ్ల నుంచి 85 ఏళ్లకు ఇటీవలే పెంచారు. దీని ప్రకారం సభ్యులు రిటైర్మెంట్‌ అనంతరం తప్పుకోకుండా.. అప్పటి వరకు సమకూరిన నిధిని ఒకే విడత కాకుండా సిస్టమ్యాటిక్‌ యూనిట్‌ రిడెంప్షన్‌ రూపంలో కావాల్సినంత నెలవారీ తీసుకోవచ్చు.

  • 60 ఏళ్లు నిండిన తర్వాత కూడా ఎన్‌పీఎస్‌లో కొనసాగే వారు సైతం పాక్షిక ఉపసంహరణ ఎంపిక చేసుకోవచ్చు. అయితే రెండు ఉపసంహరణల మధ్య కనీసం మూడేళ్ల విరామం ఉండాలి.

తప్పుకోవడం

  • సభ్యులకు 60 ఏళ్లు నిండగానే నిబంధనల ప్రకారం వారు పూర్తిగా ఈ పథకం నుంచి బయటకు వెళ్లిపోవచ్చు.

  • ఎన్‌పీఎస్‌ నిధి అప్పటికి రూ.12 లక్షలకు మించి ఉంటే ఎలాంటి పన్ను చెల్లించకుండా మొత్తం నిధిలో 80 శాతాన్ని ఉపసంహరించుకోవచ్చు. మిగిలిన 20 శాతంతో యాన్యుటీ ప్లాన్‌ (పింఛను ఇచ్చేది) కొనుగోలు చేయాల్సి ఉంటుంది.

  • ఎన్‌పీఎస్‌ నిధి ఒకవేళ రూ.8–12లక్షల్లోపు ఉంటే రూ.6 లక్షలను ఒకే విడత వెనక్కి తీసుకోవచ్చు. మిగిలిన మొత్తంతో యాన్యుటీ ప్లాన్‌ కొనుగోలు చేయటం... లేదంటే కనీసం ఆరేళ్ల కాలానికి సిస్టమ్యాటిక్‌ యూనిట్‌ రిడెంప్షన్‌ (ప్రతి నెలా నిరీ్ణత మొత్తం) పద్ధతిని, లేదంటే రెండింటి మిశ్రమాన్ని ఎంపిక చేసుకోవచ్చు.

  • ఎన్‌పీఎస్‌ ఫండ్‌ విలువ రూ.8 లక్షల్లోపు ఉంటే 100 శాతాన్ని ఒకే విడత ఉపసంహరించుకోవచ్చు. దీనిపై ఎలాంటి పన్ను ఉండదు.

  • సిస్టమ్యాటిక్‌ లంప్‌సమ్‌ విత్‌డ్రాయల్‌ (ఎస్‌ఎల్‌డబ్ల్యూ)ను సైతం ఎంపిక చేసుకోవచ్చు. 80 శాతాన్ని ఒకే విడత కాకుండా క్రమానుగతంగా 75 ఏళ్లు వచ్చే వరకు తీసుకునేలా ప్లాన్‌ చేసుకోవచ్చు.

ముందస్తుగా వైదొలగడం

  • ఎన్‌పీఎస్‌లో 60 ఏళ్లకు ముందుగా కూడా కొన్ని సందర్భాల్లో పూర్తిగా వైదొలిగే అవకాశం ఉంది.

  • ఎన్‌పీఎస్‌ ప్రారంభించి కనీసం ఐదేళ్లు పూర్తయి ఉండాలి.

  • ఆ సమయానికి ఉన్న నిధి నుంచి 20 శాతాన్నే ఉపసంహరించుకోగలరు. మిగిలిన 80 శాతంతో యాన్యుటీ ప్లాన్‌ తీసుకోవాల్సిందే.

  • మొత్తం నిధి రూ.5 లక్షలు లేదా అంత కంటే తక్కువే ఉన్న సందర్భాల్లో నూరు శాతం వెనక్కి తీసుకుని గుడ్‌బై కొట్టేయొచ్చు.

టైర్‌–2 అకౌంట్‌ నుంచి ఉపసంహరణ

  • ఈ ఖాతాలో ఉన్న నిధి మొత్తాన్ని ఎప్పుడు కావాలనుకుంటే అప్పుడు స్వేచ్ఛగా వెనక్కి తీసుకోవచ్చు.

  • టైర్‌– 1 మాదిరి ఈ ఖాతా నుంచి నిధి ఉపసంహరణకు ఎలాంటి షరతులూ లేవు.

  • టైర్‌ –2 ఖాతా నుంచి ఉపసంహరించుకునే మొత్తం పన్ను పరిధిలోకి వస్తుంది.

#

Tags : 1

Videos

10 నిమిషాల్లో 12 లక్షల కోట్లు ఆవిరి.... ఈ స్టాక్స్ మీ దగ్గర ఉంటే కొంప కొల్లేరే

పరకామణిలో బంగారం చోరీ కేసు.. BR నాయుడు ఇప్పుడు మాట్లాడు!

మల్లంపేట నుంచి బాచుపల్లి కనెక్టింగ్ పేరుతో రోడ్డు నిర్మాణం

అమెరికా, ఇజ్రాయెల్ మధ్య ఫైట్ అసలు కారణం ఇదే..

టాస్క్ ఫోర్స్ లా ఏర్పడి పని చేద్దాం ఓటర్ల జాబితా సవరణపై సజ్జల కీలక వ్యాఖ్యలు

మీకు 17 వరకు టైం ఇస్తున్న.. జడ శ్రవణ్ వార్నింగ్..

రోగులను గాలికొదిలేసి.. ఐటెం సాంగ్ కు నర్సుల డ్యాన్స్

మాటకు మాట.. రేవంత్ రెడ్డి, కేటీఆర్

టెహ్రాన్‌పై డైరెక్ట్ ఎటాక్ ఇరాన్ గడ్డపై అమెరికా సైన్యం

AP: తిరుమల వెళ్తున్న నెయ్యి ట్యాంకర్ బోల్తా ఇందాపూర్ డైరీదేనా?

Photos

+5

చీరలో పవర్‌‌ఫుల్‌గా హీరోయిన్ ధన్సిక (ఫొటోలు)

+5

సాక్షి మీడియా ఆధ్వర్యంలో ఘనంగా మహిళా దినోత్సవ వేడుకలు (ఫొటోలు)

+5

#T20WorldCup2026final : టీమిండియా విక్టరీ మూమెంట్‌‌ హైలైట్స్‌.. (ఫొటోలు)

+5

టీ–20 వరల్డ్‌ కప్‌ : హైదరాబాద్ లో క్రికెట్‌ అభిమానుల సంబరాలు (ఫొటోలు)

+5

గ్రాండ్‌గా హీరోయిన్ శ్రద్ధాదాస్‌ బర్త్‌ డే సెలబ్రేషన్స్‌ (ఫొటోలు)

+5

ట్రెండింగ్ బ్యూటీ గిరిజా ఓక్ ఫన్నీ మూమెంట్స్ (ఫొటోలు)

+5

'మృత్యుంజయ్' థ్రిల్లింగ్ బ్లాక్ బస్టర్ సక్సెస్ మీట్‌ (ఫొటోలు)

+5

తమిళనాడు డివోషనల్ ట్రిప్‌లో తెలుగు హీరోయిన్ (ఫొటోలు)

+5

ఒకప్పటి హీరోయిన్ మాలశ్రీ ఇంట్లో పెళ్లి సందడి (ఫొటోలు)

+5

తిరుమల శ్రీవారి సేవలో హీరోయిన్ (ఫొటోలు)