Breaking News

‘చైనాతో చేసిన పొరపాటు భారత్‌తో చేయం’

Published on Sat, 03/07/2026 - 13:23

రెండు దశాబ్దాల క్రితం చైనా విషయంలో చేసిన వాణిజ్యపరమైన తప్పులను భారత్ విషయంలో పునరావృతం చేయబోమని అమెరికా స్పష్టం చేసింది. భారత్‌తో వాణిజ్య ఒప్పందం తుది దశకు చేరుకున్న తరుణంలో అమెరికా డిప్యూటీ సెక్రటరీ ఆఫ్ స్టేట్ క్రిస్టోఫర్ లాండౌ చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి. ఇటీవల న్యూఢిల్లీలో జరిగిన ‘రైసినా డైలాగ్ 2026’ వేదికగా ఆయన ఇరు దేశాల ఆర్థిక సంబంధాలపై ప్రసంగం చేశారు.

చైనా అనుభవాలే గుణపాఠం

‘20 ఏళ్ల క్రితం చైనాకు మార్కెటింగ్‌ అవకాశాలు కల్పించి ఆ దేశాన్నే మాకు పోటీగా మార్చిన పొరపాటును భారత్ విషయంలో చేయం’ అని లాండౌ కుండబద్ధలు కొట్టారు. అమెరికా ప్రభుత్వం తన ప్రజలకు సమాధానం చెప్పుకోవాల్సి ఉంటుందని, అందుకే భారత్‌తో కుదుర్చుకోబోయే ఏ ఒప్పందమైనా పరస్పర ప్రయోజనం ఆధారంగానే ఉంటుందని స్పష్టం చేశారు. తానేమీ ఇక్కడ సామాజిక సేవ చేయడానికి రాలేదని, అమెరికా ప్రయోజనాలే తమకు పరమావధి అని వ్యాఖ్యానించారు.

ఊగిసలాటలో వాణిజ్య ఒప్పందం?

భారత్-అమెరికా వాణిజ్య ఒప్పందం ముగింపు దశలో ఉందని లాండౌ ఆశాభావం వ్యక్తం చేసినప్పటికీ ఇటీవలి పరిణామాలు ఒప్పందాన్ని మరింత జాప్యం చేసే దిశగా ఉన్నాయి. ఫిబ్రవరి 20న అమెరికా సుప్రీం కోర్టు ప్రెసిడెంట్ ట్రంప్ విధించిన రెసిప్రోకల్ టారిఫ్‌లు చెల్లవని తీర్పునిచ్చింది. దీనికి ప్రతిస్పందనగా ట్రంప్ ప్రభుత్వం ప్రపంచవ్యాప్త దిగుమతులపై 10% నుంచి 15% వరకు అదనపు సర్‌ఛార్జీని విధించింది. గతంలో భారతీయ వస్తువులపై ఉన్న 25% సుంకాన్ని ఒప్పందం ద్వారా 18%కి తగ్గిస్తామని అమెరికా ఆశ చూపేది. కానీ ప్రస్తుతం అందరికీ వర్తించే సుంకం 10%కి తగ్గడంతో అమెరికా ఆఫర్‌కు ఉన్న ప్రాధాన్యత తగ్గింది.

Videos

ఫైనల్ కి ముందే బయటపడిన టీమిండియా డొల్లతనం ఫైనల్లో ఈ ముగ్గురిని తప్పించకుంటే ఓటమి పక్కా..?

సూర్య VS సాంట్నర్..రికార్డ్స్ చూస్తే..టీమిండియాకు మళ్లీ నిరాశేనా..?

ఆ పేరు చెప్తేనే వణికిపోతున్న టీం ఇండియా

10th క్లాస్ స్టూడెంట్ చేసిన పని చూడండి

లొంగిపోయేందుకు బయల్దేరిన మావోయిస్టులు

ఖమేనీ బంకర్ ధ్వంసం చేశాం ఇక మిగిలింది..!

భీకర యుద్ధం వేళ ఇరాన్ అధ్యకుడికి పుతిన్ ఫోన్

విజయ్ కు బిగ్ షాక్ బయటకు వెళ్లకూడదంటూ పిటిషన్

ఎమ్మెల్యే - ఎమ్మెల్సీ క్రీడా ఉత్సవాలపై జడ శ్రవణ్ సెటైర్లు

ప్రపంచ దేశాలను వణికిస్తున్న ఆయిల్ కోలుకోలేని దెబ్బ కొట్టిన ఇరాన్

Photos

+5

ఒకప్పటి హీరోయిన్ మాలశ్రీ ఇంట్లో పెళ్లి సందడి (ఫొటోలు)

+5

తిరుమల శ్రీవారి సేవలో హీరోయిన్ (ఫొటోలు)

+5

రెండో శ్రీశైలంగా పిలిచే శివాలయం మన హైదరాబాద్‌లో ఎక్కడుందో తెలుసా? (ఫొటోలు)

+5

మేము సాధించాం.. పతకం వచ్చింది (ఫొటోలు)

+5

హైదరాబాద్‌లో గ్రాండ్‌గా అల్లు శిరీష్ పెళ్లి వేడుక (ఫొటోలు)

+5

ఒకప్పటి హీరోయిన్ సుమలత ఫ్యామిలీ ఫొటోలు

+5

జాన్వీ కపూర్ బర్త్ డే సెలబ్రేషన్ (ఫొటోలు)

+5

నయనిక పెళ్లి కూతురి వేడుక.. అల్లు ఫ్యామిలీ సందడి (ఫొటోలు)

+5

తిరుమల శ్రీవారి సేవలో ప్రముఖ హీరోయిన్లు (ఫొటోలు)

+5

పెళ్లి వేడుకలో విజయ్‌, త్రిష సందడి.. ఫోటోలు వైరల్