₹8 నుంచి ₹28875... 5 ఏళ్లలో 31,900% రిటర్న్ !
Breaking News
పవన్ కళ్యాణ్ ‘ఉస్తాద్ భగత్ సింగ్’ రిలీజ్ డేట్‌లో మార్పు
Published on Thu, 03/05/2026 - 12:28
హరీశ్ శంకర్ దర్శకత్వంలో పవన్ కల్యాణ్ హీరోగా నటించిన తాజా చిత్రం ‘ఉస్తాద్ భగత్ సింగ్’. మార్చి 26న ఈ చిత్రం విడుదల కావాల్సింది. కానీ యశ్ ‘టాక్సిక్’ వాయిదా పడడంతో కాస్త ముందుగానే ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ఈ చిత్రాన్ని మార్చి 19వ తేదీన విడుదల చేయనున్నట్లు తాజాగా చిత్ర బృందం అధికారికంగా ప్రకటించింది. వరుసగా వచ్చే లాంగ్ వీకెండ్లు, దాదాపు రెండు వారాల పాటు ఉండే సెలవుల ప్రయోజనాన్ని దృష్టిలో ఉంచుకొని ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.
మైత్రీ మూవీ మేకర్స్ పతాకంపై నవీన్ యెర్నేని, రవిశంకర్ యలమంచిలి నిర్మిస్తున్న ఈ చిత్రానికి మొదట దేవిశ్రీ సంగీత దర్శకుడు. అయితే ఇప్పటికీ బ్యాగ్‌గ్రౌండ్ స్కోర్ పూర్తి కాకపోవడంతో..బీజీఎం కోసం తమన్‌ని రంగంలోకి దించారు. పాటలు దేవిశ్రీ.. బీజీఎం తమన్ అందించబోతున్నట్లు మేకర్స్ అధికారికంగా ఓ ప్రకటన విడుదల చేశారు. అయితే డీఎస్పీ ఫ్యాన్స్ మాత్రం నిర్మాణ సంస్థ తీసుకున్న నిర్ణయంపై ఫైర్ అవుతున్నారు. దేవిశ్రీ కంటే గొప్ప సంగీతం ఇంకెవరు అందించలేరని.. నిర్మాణ సంస్థ తప్పుడు నిర్ణయం తీసుకుందంటూ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు.
Tags : 1