₹8 నుంచి ₹28875... 5 ఏళ్లలో 31,900% రిటర్న్ !
Breaking News
సేవల్లో పనితీరు.. ఫ్లాట్
Published on Thu, 03/05/2026 - 00:46
న్యూఢిల్లీ: సేవల రంగ కార్యకలాపాలు ఫిబ్రవరిలో కాస్తంత నిదానించాయి. ఈ రంగంలో కార్యకలాపాలను సూచించే హెచ్‌ఎస్‌బీసీ ఇండియా సర్వీసెస్ పీఎంఐ 58.1 పాయింట్లుగా నమోదైంది. జనవరిలో ఇది 58.5గా ఉంది. 50 పాయింట్లకు పైన ఉన్నంత వరకు విస్తరణగానే పరిగణిస్తుంటారు. డిమాండ్ స్వల్పంగా మెరుగుపడడం, ద్రవ్యోల్బణం పెరగడం ఫలితంగా సేవల రంగం పనితీరు 13 నెలల కనిష్ట వృద్ధికి పరిమితమైనట్టు హెచ్‌ఎస్‌బీసీ ఇండియా తెలిపింది.
‘‘జనవరితో పోలి్చతే దాదాపు అదే స్థాయిలో ఫిబ్రవరిలోనూ సేవల రంగ పీఎంఐ నమోదు కావడం.. బలమైన పనితీరును సూచిస్తోంది. కొత్త ఆర్డర్లు రాక 13 నెలల కనిష్టానికి తగ్గింది. సేవల రంగం విక్రయాలు అంతర్జాతీయంగా పుంజుకున్నాయి. నిర్వహణ అవసరాల దృష్ట్యా కంపెనీలు నియామకాలు పెంచుకోవడం కనిపించింది’’అని హెచ్‌ఎస్‌బీసీ ఇండియా ముఖ్య ఆర్థికవేత్త ప్రంజుల్ భండారీ తెలిపారు. పోటీ పెరిగిపోవడం వృద్ధిపై ప్రభావం చూపించినట్టు కొన్ని కంపెనీల పర్చేజింగ్ మేనేజర్లు ఈ సర్వేలో భాగంగా వెల్లడించారు. ఫిబ్రవరి నెలకు సంబంధించి కాంపోజిట్ పీఎంఐ (తయారీ, సేవలు కలిసిన) అవుట్‌పుట్ ఇండెక్స్ 58.9కి పుంజుకుంది. జనవరిలో 58.4 పాయింట్లుగానే ఉంది.
Tags : 1