Breaking News

పెంపకం పెద్ద పజిల్‌

Published on Sun, 03/01/2026 - 05:57

ఈ తరం తల్లిదండ్రులకు పిల్లల పెంపకం పెద్ద పజిల్‌ సౌకర్యాలు అమర్చిపెడితేనే సరిగ్గా పెరుగుతారు అనుకునే రకం స్క్రీన్లకు అడిక్ట్‌ అవుతున్నారని ఓ వైపు గగ్గోలు పెడుతూనే నాలుగు గోడల గదులకే బాల్యాన్ని అంకితం చేస్తుంటారు. ఆట పాటలంటే ఇప్పుడో ఖరీదైన వ్యవస్థ. హాయిగా నవ్వుకోవడం అంటే అదో అందని ద్రాక్ష. విశాలంగా పెరగని బాల్యం ఏమాత్రం వికసించదు అంటున్నారు ప్రముఖ రచయిత యండమూరి వీరేంద్రనాథ్, ఆయన అర్ధాంగి అనుగీత. 

వీరి కుమారుడు ప్రణీత్‌ యండమూరి వరల్డ్‌ బ్యాంకులో ఆరు ఆసియా దేశాలకు ప్రతినిధిగా ఉన్నతోద్యోగంలో ఉన్నాడు.  రచనా వ్యాసంగంలో బిజీగా ఉండే ఈ రచయితను సక్సెస్‌ఫుల్‌ పేరెంటింగ్‌ గురించి అడిగినప్పడు చెప్పిన ‘సింగిల్‌ బెడ్‌–రూమ్‌ నుంచి స్విమ్మింగ్‌ పూల్‌ బెడ్‌–రూమ్‌’ కాన్సెప్ట్‌ను పంచుకున్నారు. ఆ విశేషాలు వారి మాటల్లోనే...

‘‘పిల్లల ప్రతిభ రెండు అంశాలపై ఆధారపడి ఉంటుంది. మొదటిది జీన్స్, రెండోది పెంపకం. వంశపారంపర్యంగా వచ్చే జీన్స్ విషయంలో మనమేమీ చేయలేం కాని, పెంపకం మాత్రం మన చేతుల్లోనే ఉన్నది. పిల్లలు నాలుగు స్టేజిల్లో పెరుగుతారు. రెండో స్టేజ్‌లో ఉన్న ఆత్మన్యూనతా భావం, స్నేహితుల ప్రభావం వల్ల మూడో స్టేజీలో సుపీరియారిటీ కాంప్లెక్స్‌గా పరిణామం చెందే ప్రమాదం ఉంది. పిల్లలు చెడిపోయేది స్నేహితుల అభిరుచులు, వ్యసనాల వల్లనే. దాన్ని పీర్‌ ఇన్ ఫ్లుయన్స్ అంటారు. వారు తప్పుదారిలో వెళుతూ ఉంటే, అది ఎంత తొందరగా తెలుసుకుంటే అంత మంచిది. మరీ డిటెక్టివ్‌లా నిఘా వెయ్యనవసరం లేదు గాని దుర్వ్యసనాల గురించి తెలుసు కోవడం పెద్ద కష్టం కాదు. అలాగే ప్రేమ (ఆకర్షణ) విషయం కూడా.

పిల్లల భవిష్యత్తు పట్ల పెద్దలు నిర్దిష్టమైన అభిప్రాయం కలిగి ఉండాలి. మా అబ్బాయి టెన్త్‌ క్లాసులో స్టేట్‌ ర్యాంక్‌ వచ్చినప్పుడు రెండు మూడు కార్పొరేట్‌ కాలేజీల వాళ్ళు వచ్చి ఫ్రీ–సీట్‌ ఆఫర్‌ చేశారు. కొన్ని ప్రోత్సాహకాలు కూడా ఇస్తామన్నారు. కాని, ఇంటి పక్కనే ఉన్న అతి సాధారణ కాలేజీలో చేరి ఇంటర్‌ కూడా స్టేట్‌ ర్యాంక్‌లో పాస్‌ అయ్యాడు. ఆ తర్వాత నాగార్జున గ్రూపులో నెలకి 1500 కి ఉద్యోగం చేస్తూ, ఈవినింగ్‌ కాలేజీలో బీకాం ఆనర్స్‌ యూనివర్సిటీ థర్డ్‌గా పాస్‌ అయ్యాడు. 

బీకాం చదువుతున్న సమయంలోనే చార్టెడ్‌ అకౌంటెన్సీ కూడా పాస్‌ అవ్వటంతో, 22 ఏళ్లకే వరల్డ్‌ బ్యాంకులో ఉద్యోగం వచ్చింది. అక్కడ రెండేళ్లు ఉద్యోగం చేస్తూ. పై చదువులకు సరిపడా డబ్బు సంపాదించుకొని, సింగపూర్లో ఎంబీఏ చదివి, అక్కడే ఆరు ఆసియా దేశాలకు ప్రతినిధిగా ఏడాదికి అయిదు కోట్ల జీతంతో ప్రస్తుతం ఉద్యోగం చేస్తున్నాడు. నేను తరచు చెప్పే ... ‘సింగిల్‌ బెడ్‌–రూమ్‌ నుంచి స్విమ్మింగ్‌ పూల్‌ బెడ్‌–రూమ్‌’ కాన్సెప్ట్‌ అదే. 

పిల్లల్ని ఎత్తుగా కాదు వెడల్పుగా పెంచాలి...
ఈ పరిణామక్రమంలో నాకన్నా నా భార్య అనుగీత పాత్ర 90 శాతం (percentage wont go together) ఉంది. రచనలు, సినిమాల పనిలో నేను బిజీగా ఉండేవాడిని కానీ, ‘బద్ధకమూ, తీరిక లేకపోవటమూ’ అన్న పదాలకి అర్థం... చేసే పనులకి... మనం ఇచ్చుకునే ప్రాధాన్యాలపై ఉంటుంది. పిల్లవాడిని మేము ఎప్పుడూ కొట్టలేదు, తిట్టలేదు. తనకి టీవీ అలవాటు కూడా లేదు. 

ఆ రోజుల్లో సెల్‌ ఫోన్‌ లేకపోవడం మా అదృష్టం. చదువుతోపాటు మరి ఏదైనా ఒక అభిరుచి ఉంటే పిల్లలు చక్కగా పెరుగుతారని మేము నమ్ముతాం. ‘పిల్లల్ని ఎత్తుగా కాదు, వెడల్పుగా పెంచాలి’ అంటుంది నా భార్య. ఆక్స్‌ఫర్డ్‌లో చదువుతున్న మా పెద్ద మనవడు గిటార్‌ వాయిస్తాడు. టెన్నిస్‌ ఆడతాడు. రెండో మనవడు సింగపూర్‌ క్రికెట్‌ టీమ్‌కి ఆడుతున్నాడు.

తల్లిదండ్రులకు చెప్పేది ఒకటే. కొన్ని చదువులకు తెలివితేటలు బాగా కావాలి. కొన్నిటికి జ్ఞాపకశక్తి అవసరం. పిల్లల్లో ఎటువంటి గ్రహణ శక్తి ఉందో చిన్నప్పుడే తెలిసిపోతుంది. దాన్ని బట్టివారి చదువుని ఎంపిక చేయాలి తప్ప, తాము జీవితంలో సాధించలేనిది పిల్లలపై రుద్దడం తప్పు. 

ప్రతి రోజూ ఓ పదినిమిషాలు..
పక్క గదిలో తండ్రి స్నేహితులతో డ్రింక్‌ చేస్తూ, మరొక గదిలో తల్లి టీవీ చూస్తూ ఉంటే, ‘నేను తప్ప ప్రపంచం అంతా ఆనందంగా ఉన్నది’ అన్న ఫీలింగ్‌తో పిల్లవాడికి చదువు వంట పట్టదు. పెద్ద పెద్ద త్యాగాలు అవసరం లేదు. ప్రతిరోజూ ఒక పది నిముషాలు– ‘ఈ రోజు నువ్వేం చదువుకున్నావ్‌రా?’ అన్న వాకబు. రెండు మూడు ప్రశ్నలు... వారు సరిగ్గా సమాధానాలు చెప్తే చిన్న బహుమతి... ఇలాంటి చిన్న చిన్న చర్యలు పిల్లలలకి చదువు పట్ల ఆకర్షణ పెంచుతాయి. 

‘కష్టపడే చదవరా’ అనేకొద్ది పిల్లలకి చదువు అంటే అదొక కష్టమైన బాధ్యత అన్న ఫీలింగ్‌ కలుగుతుంది. నిజానికి చదువు పట్ల ఇష్టం పెరిగితే, అది టీవీ కన్నా ఎక్కువ ఆనందం ఇస్తుంది. పేరెంటింగ్‌లో మొదటి పాఠం అది. కొందరు పెద్దలకి తమ పిల్లల సిలబస్‌లో ఏ సబ్జెక్ట్స్‌ ఉన్నాయో కూడా తెలీదు. ‘అంతా స్కూల్‌ వారే చూసుకుంటారు’ అని చేతులు దులిపేసుకోకుండా పిల్లలతో పాటు ప్రయాణం చేస్తూ, వారి చదువులో భాగం పంచుకుంటే, వారి కళ, నైపుణ్యం, గెలుపుకి సంబంధించిన చిన్న చిన్న అంశాలను గుర్తించి పెంచితే, ప్రతి పిల్లవాడు ఒక అబ్దుల్‌ కలాం అవుతాడు’ అని చెప్పారు. 

-ప్రణీత్‌ యండమూరి

నిర్వహణ: నిర్మలా రెడ్డి 

Videos

ఇరాన్ ప్రతీకార దాడులు.. దుబాయ్ ఎయిర్ పోర్ట్ ధ్వంసం

ఖమేనీ నివాసంపై 30 బాంబులు 1500KM నుండి వేసేసిన ఇజ్రాయెల్..

భయం భయంగా ఉంది.. దుబాయ్ లో తాజా పరిస్థితిపై PV సింధు వీడియో

హర్మూజ్ జలసంధిలో ఇరాన్ దెబ్బ.. మంటల్లో ఆయిల్ ట్యాంకర్లు

అంబటి రాంబాబు హీరో.. లోకేష్.. గుర్తుపెట్టుకో.. పిచ్చిపిచ్చి వేషాలేస్తే..

అమెరికా.. ఇజ్రాయెల్ దాడులు.. ఒంటరిగా వణికిస్తున్న ఇరాన్

ఇరాన్ రివర్స్ ఎటాక్ అమెరికా ఊహించని దెబ్బ

కిచెన్ లో కౌగిలింతలు అడ్డంగా దొరికిన BR నాయుడు

దుబాయ్ లో హైటెన్షన్ బుర్జ్ ఖలీఫాపై ఇరాన్ దాడి

చీకటి శకం ముగిసింది ఇరాన్ వీధుల్లో సంబరాలు

Photos

+5

తిరుమల శ్రీవారి సేవలో బ్రహ్మానందం కొడుకు (ఫొటోలు)

+5

హైదరాబాద్ టీటీడీ ఆలయంలో విజయ్-రష్మిక (ఫొటోలు)

+5

శిరీష్ ప్రీ వెడ్డింగ్ పార్టీలో అల్లు అర్జున్-స్నేహ (ఫొటోలు)

+5

ఇరాన్‌: ఖమేనీ మృతి.. మద్దతుదారుల కన్నీరుమున్నీరు (ఫొటోలు)

+5

మహిళ కబడ్డీ మూవీ ప్రెస్‌ మీట్ (ఫొటోలు)

+5

విష్ణు విన్యాసం మూవీ సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సన్‌ ఆఫ్‌ మూవీ సక్సెస్‌ మీట్‌ (ఫొటోలు)

+5

వరంగల్ భద్రకాళి అమ్మవారిని దర్శించుకున్న టాలీవుడ్ హీరోయిన్ (ఫొటోలు)

+5

లాంచనంగా మొదలైన శ్రీకాంత్ కొడుకు కొత్త సినిమా (ఫొటోలు)

+5

లుక్ మార్చేసిన శ్రీముఖి.. అందంతో మెరిసిపోతుందిగా! (ఫొటోలు)