పెన్షన్ ఎవరిచ్చారు... జగన్ బాబు.. మంత్రి ముందే చంద్రబాబు పరువు తీసిన అవ్వ
Breaking News
అరుదైన కారులో గౌతమ్ సింఘానియా (వీడియో)
Published on Sat, 02/28/2026 - 20:03
రేమండ్ గ్రూప్ ఛైర్మన్ & మేనేజింగ్ డైరెక్టర్ గౌతమ్ సింఘానియా మరో ఫెరారీ కారును కొనుగోలు చేశారు. ఇది ప్రపంచంలోనే మొట్టమొదటి కుడి చేతి డ్రైవ్ 'ఫెరారీ 296 స్పెషలే'. భారతదేశంలో కూడా ఇది మొదటి మోడల్ కావడం గమనార్హం. దీని ధర రూ.6.5 కోట్లు (ఎక్స్ షోరూమ్).
కారు డ్రైవ్ చేస్తున్న వీడియోను గౌతమ్ సింఘానియా తన ఎక్స్ ఖాతాలో షేర్ చేశారు. ఫెరారీ 296 స్పెషలే (Ferrari 296 Speciale) అద్భుతమైన డిజైన్, గొప్ప పనితీరును అందిస్తుందని అభివర్ణించారు.
Proud owner of the world's first Ferrari 296 Speciale Right Hand Drive — and the very first in India. 🇮🇳🏎️
An exceptional blend of innovation, performance, and design — and a personal milestone I deeply value.#Ferrari296Speciale #FerrariIndia #FirstInIndia #RightHandDrive… pic.twitter.com/Qaaw2x6oAE— Gautam Singhania (@SinghaniaGautam) February 27, 2026
ఫెరారీ 296 స్పెషలే
ఫెరారీ 296 స్పెషల్ అనేది 296 GTB ట్రాక్ ఫోకస్డ్ వెర్షన్. ఇది ఎలక్ట్రిక్ మోటారుతో కలిపి 3.0 లీటర్ ట్విన్ టర్బో V6 ఇంజిన్‌తో పనిచేస్తుంది. దాదాపు 880 హార్స్‌పవర్‌ను ఉత్పత్తి చేస్తుంది, ఇది ఇప్పటివరకు నిర్మించిన అత్యంత శక్తివంతమైన రియర్ వీల్ డ్రైవ్ ఫెరారీలలో ఒకటిగా నిలిచింది.
ప్లగ్-ఇన్ హైబ్రిడ్ సెటప్ విద్యుత్ శక్తితో మాత్రమే తక్కువ దూరాలను కూడా అనుమతిస్తుంది. ఈ కారు 2.8 సెకన్లలో గంటకు 0 నుంచి 100 కి.మీ వేగాన్ని అందుకోగలదు. దీని స్పీడ్ గంటకు 330 కి.మీ కంటే ఎక్కువ అని తెలుస్తోంది.
Tags : 1