Breaking News

భర్త ఉన్నా పాత ప్రేమికుడి వైపు మనసు..!

Published on Thu, 02/26/2026 - 08:16

డాక్టర్‌ గారూ, నా కూతురికి ప్రస్తుతం 34 సంవత్సరాలు. కాలేజీలో చదువుతున్నప్పుడు ఒక అబ్బాయిని ప్రేమించింది. అతను సామాజికంగా, ఆర్థికంగా మా స్థాయిలో లేనందువల్ల మేము ఆ పెళ్లికి ఒప్పుకోలేదు. ఆ తర్వాత మా అమ్మాయి చాలా సంబంధాలను తిరస్కరించింది. చివరికి మేము తీవ్రంగా ఒత్తిడి చేసి, ‘‘ఇలా అయితే మేము బతకం’’ అని చెప్పిన తర్వాత గత సంవత్సరం మేము కుదిర్చిన వ్యక్తిని పెళ్లి చేసుకుంది. కానీ పెళ్లి అయిన తర్వాత ఆమె తన భర్తతో దాంపత్యంలో దూరంగా ఉంది. తన పాత ప్రేమ విషయం కూడా భర్తకు చెప్పింది. భర్త మంచి మనసుతో ‘‘గతాన్ని మర్చిపోయి కొత్త జీవితం మొదలుపెడదాం’’ అని చెప్పినా, మా అమ్మాయి అలా చేయడానికి సిద్ధంగా లేదు. ఇప్పటికే ఆమె తన పాత ప్రేమికుడితో మళ్లీ మాట్లాడటం ప్రారంభించింది. అతను ఇప్పుడు మంచి ఉద్యోగంలో ఉన్నాడని, తన దగ్గరకు రావాలని ఆమెను కోరుతున్నాడని చెప్పింది. అయితే ఆ అబ్బాయి తల్లిదండ్రులు ఈ పెళ్లిని ఒప్పుకోవడం లేదు. మా అమ్మాయి మాత్రం ఖచ్చితంగా అతనినే చేసుకుంటానని అంటోంది. ఒకవైపు మా అమ్మాయి మొండితనం, మరోవైపు మా అల్లుడి మంచితనం, ఇంకోవైపు పాత ప్రేమికుడి ఒత్తిడి – ఈ పరిస్థితిలో మాకు ఏం చేయాలో అర్థం కావడం లేదు. మేమంతా తీవ్ర మానసిక ఒత్తిడిలో ఉన్నాం. ఇలాంటి పరిస్థితుల్లో మేము ఎలా ముందుకు వెళ్లాలి? సరైన మార్గం చెబుతారని ఆశతో......
– ఒక సోదరి, హైదరాబాద్‌

మీ ప్రశ్న చదివాక నిజంగా చాలా బాధగా అనిపించింది. ఇక్కడ నాకు ఒక విషయం స్పష్టంగా అర్థమైంది – ఈ పెళ్లి మీ అమ్మాయి ఇష్టానికి విరుద్ధంగా, బలవంతంగా జరిగింది. అలాంటి పరిస్థితిలో ఆమెకు తన భర్తతో భావోద్వేగ అనుబంధం ఏర్పడటం చాలా కష్టం. ఆమె గతాన్ని పూర్తిగా వదలలేకపోతోంది. ఆమె మనసు ఇంకా అక్కడే ఆగిపోయింది. మానసికంగా బలమైన బంధం లేని చోట శారీరక బంధాన్ని ఆశించడం సరి కాదు. మీ మీద ప్రేమతో, మీరు చనిపోతారన్న భయంతో ఆమె మనసు నొప్పించి తీసుకున్న నిర్ణయం, ఈ రోజు మూడు కుటుంబాలకు ఇబ్బందిని కలిగిస్తోంది. ఇటీవలి కాలంలో ఇలాంటి సంఘటనలు కొంచెం ఎక్కువగా కనిపిస్తున్నాయి. అందుకే తల్లిదండ్రుల ఆలోచనా విధానంలో కూడా కొంత మార్పు అవసరం. 

పిల్లలు తమ అభి్రపాయాన్ని చెప్పినప్పుడు వెంటనే తిరస్కరించకుండా, ఆ విషయాన్ని కుటుంబ పెద్దలందరూ కలిసి కూర్చొని ప్రశాంతంగా చర్చించడం మంచిది. అవసరమైతే ఫ్యామిలీ కౌన్సెలింగ్‌ ద్వారా సమస్యకు పరిష్కారం వెతకాలి. బెదిరింపులతో లేదా భావోద్వేగ ఒత్తిడితో సంసారాలు నిలబడటం కష్టం. ఈ సమస్యను ఒకే కోణంలో చూడలేం. ఇందులో సామాజిక, నైతిక, చట్టపరమైన అంశాలు కూడా ఉన్నాయి. కాబట్టి తొందరపడి నిర్ణయం తీసుకోవడం కంటే, సరైన మార్గదర్శకత్వం తీసుకోవడం మంచిది. ఒకసారి మీ అమ్మాయిని, ఆమె భర్తను కలిపి తీసుకువస్తే, వారితో విడివిడిగా మాట్లాడి సమస్య మూలాలను, తీవ్రతనూ అర్థం చేసుకోవచ్చు. అవసరమైతే ఆమె గతంలో ప్రేమించిన వ్యక్తితో కూడా మాట్లాడి స్పష్టత తీసుకురావచ్చు. 

ఈ ప్రక్రియకు కొంత సమయం పడుతుంది. ముఖ్యంగా, మీరు మీ అమ్మాయిని ఇకపై ఎమోషనల్‌ బ్లాక్‌మెయిల్‌ చేయడం ఆపాలి. ‘‘మేము చనిపోతాం’’ అనే మాటలు సమస్యను పరిష్కరించవు. మీరు ఏదైనా తీవ్ర నిర్ణయం తీసుకుంటే పరిస్థితి మరింత క్లిష్టతరం అవుతుంది. మీరు ్రపాణం తీసుకోవటం సమస్యకు పరిష్కారం కాదు. నిపుణులైన వారితో ఫ్యామిలీ కౌన్సెలింగ్‌ తీసుకోవడం ఈ దశలో అత్యంత అవసరం. ఓపికతో, స్పష్టతతో ముందుకు వెళ్లాలి. ఒక విషయం గుర్తుంచుకోండి – కష్టాలు శాశ్వతం కావు. కష్టం తర్వాత సుఖం, చీకటి తర్వాత వెలుగు ఖచ్చితంగా వస్తాయి. కాస్త ఓపిక పట్టండి. మీ సమస్యకు ఒక మంచి పరిష్కారం తప్పకుండా దొరుకుతుంది. ఆల్‌ ది బెస్ట్‌!

డా. ఇండ్ల విశాల్‌ రెడ్డి, 
సీనియర్‌ సైకియాట్రిస్ట్, విజయవాడ. 
మీ సమస్యలు, సందేహాలు పంపవలసిన 
మెయిల్‌ ఐడీ:   sakshifamily3@gmail.com

#

Tags : 1

Videos

కొత్త కారు అని డ్యామేజ్ కారు అమ్మిన టాటా షోరూమ్ సిబ్బంది

భూదాన్ బాధితులకు అండగా కేటీఆర్

పవన్ పై అనుమానాలు.. మండిపడుతున్న జనసేన నేతలు

Tatiparthi Chandrasekhar : వెలిగొండలో బాబు క్యాట్ వాక్, ర్యాంప్ వాక్

తెలంగాణ సీఎంతో చంద్రబాబు లాలూచీ పడ్డారు: బొత్స

అన్నింటికి సిద్దపడే జైలుకు వెళ్ళా... కానీ పొన్నవోలు మాత్రం అంబటి ప్రశంసలు

Hyd: రిజర్వాయర్ లో కారు బోల్తా.. డ్రైవర్ గల్లంతు

Komarada Nagavali River:ఇంటర్ విద్యార్థులకు నది దాటడమే ఓ పరీక్ష

మీకు బ్లాక్ బస్టర్ సినిమా చూపిస్తాం.. పొన్నవోలు మాస్ వార్నింగ్

సేతుపతి, సాయి పల్లవితో మణిరత్నం లవ్ స్టోరీ

Photos

+5

ఒకదానికొకటి సంబంధమే లేదు.. మీనాక్షి చౌదరి ఫన్నీ (ఫొటోలు)

+5

థాయ్‌ల్యాండ్‌ ఏనుగులతో రీతూవర్మ (ఫొటోలు)

+5

తిరుమల శ్రీవారి సేవలో రాఘవ లారెన్స్ ఫ్యామిలీ (ఫొటోలు)

+5

నెల్లూరులో జనసందోహం.. కొత్త జంటకు వైఎస్‌ జగన్‌ శుభాకాంక్షలు (ఫొటోలు)

+5

అర్జున్‌ టెండుల్కర్ పెళ్లి వేడుకలు.. అంబానీ కుటుంబం ప్రీ వెడ్డింగ్‌ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

ముంబైలో నా వారం ఇలా గడిచింది.. మృణాల్ లేటెస్ట్ (ఫొటోలు)

+5

#Virosh : పెళ్ళి సందడి.. ట్రెండింగ్‌లో రష్మిక మందన్న (ఫొటోలు)

+5

’విష్ణు విన్యాసం‘ సినిమా ప్రీ రిలీజ్ (ఫొటోలు)

+5

ప్రియురాలితో బిగ్‌బాస్ షణ్ముఖ్ ఎంగేజ్‌మెంట్‌ (ఫోటోలు)

+5

కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి బంధువుల పెళ్లిలో మెరిసిన అల్లు స్నేహారెడ్డి (ఫోటోలు)