టీనేజర్లకు డిజిటల్‌ డిసిప్లిన్‌...

Published on Sun, 02/22/2026 - 05:58

టీనేజర్ల చేతుల్లో సెల్‌ ఫోన్‌ కేవలం ఒక పరికరం కాదు, వారి శరీరంలో ఒక భాగంగా మారిపోయింది. ఒకప్పుడు ‘పదో తరగతి దాటాక ఫోన్‌ కొనిస్తాం’ అనే మాటలు వినిపించేవి. కాని, నేడు ఆరో తరగతి విద్యార్థుల వద్ద కూడా స్మార్ట్‌ఫోన్లు దర్శనమిస్తున్నాయి. స్మార్ట్‌ ఫోన్‌ నిప్పులాంటిది. దాన్ని వంట వండుకోవడానికి వాడుకోవచ్చు లేదా ఇల్లు తగలబెట్టుకోవడానికి వాడుకోవచ్చు. 

టీనేజర్లకు సెల్‌ ఫోన్‌ వాడకంలో స్వీయ నియంత్రణ నేర్పించడం ఒక కళ. ఇది ఒక్క రోజులో సాధ్యం కాదు. ఓపికతో, ప్రేమతో, శాస్త్రీయ అవగాహనతో వారిని డిజిటల్‌ ప్రపంచంలో సురక్షితంగా ప్రయాణించేలా తీర్చిదిద్దడం నేటి తరం తల్లిదండ్రుల బాధ్యత. అదెలాగో ఈరోజు తెలుసుకుందాం. 

మెదడుపై డిజిటల్‌ ప్రభావం
టీనేజ్‌ అనేది మానవ జీవితంలో అత్యంత కీలకమైన దశ. ఈ సమయంలో మెదడులోని ‘ప్రీ ఫ్రంటల్‌ కార్టెక్స్‌’ అనే భాగం ఇంకా అభివృద్ధి చెందుతూ ఉంటుంది. నిర్ణయాలు తీసుకోవడం, ఉద్వేగాలను అదుపు చేసుకోవడం, పర్యవసానాలను అంచనా వేయడం ఈ భాగం బాధ్యత.

మరోవైపు, సోషల్‌ మీడియా యాప్స్‌ అన్నీ ‘డోపమైన్‌’ అనే రసాయనాన్ని విడుదల చేసేలా రూపొందించారు. ఒక ‘లైక్‌’ లేదా ‘నోటిఫికేషన్‌’ వచ్చినప్పుడు మెదడులో రివార్డ్‌ సిస్టమ్‌ యాక్టివేట్‌ అవుతుంది. అందుకే టీనేజర్లు అంత త్వరగా వాటికి అడిక్ట్‌ అవుతారు. అలాగని వాళ్లనుంచి ఫోన్‌ తీసేయడం పరిష్కారం కాదు. అది వారిని మరింత మొండిగా మారుస్తుంది. దానికి బదులుగా ‘డిజిటల్‌ క్రమశిక్షణ’ నేర్పించాలి. అంటే టీనేజర్లను శిక్షించడం కాదు, వారి మెదడును రీవైరింగ్‌ చేయడం అని గుర్తుంచుకోండి.

డిజిటల్‌ డీ–అడిక్షన్‌ యాక్షన్‌ ప్లాన్‌...
1. క్రమంగా తగ్గించడం: ఒక్కసారిగా ఫోన్‌ లాగేసుకుంటే పిల్లల్లో ‘విత్‌ డ్రాయల్‌ సింప్టమ్స్‌’ వస్తాయి. అందువల్ల ప్రతి వారం వారి స్క్రీన్‌ టైమ్‌ను 15–20 నిమిషాలు తగ్గిస్తూ రండి.
2. గ్రే స్కేల్‌ మోడ్‌: ఫోన్లోని రంగులు మన మెదడును ఆకర్షిస్తాయి. పిల్లల ఫోన్‌ సెట్టింగ్స్‌లో ‘గ్రేస్కేల్‌’ మోడ్‌ ఆన్‌ చేయండి. దీంతో మెదడుకు ఆ ఫోన్‌ పట్ల ఆసక్తి క్రమంగా తగ్గుతుంది. ఇది ఒక శక్తిమంతమైన సైకలాజికల్‌ ట్రిక్‌.
3.డిజిటల్‌ కాంట్రాక్ట్‌: తల్లిదండ్రులు, పిల్లలు కూర్చుని ఒక ఒప్పందం రాసుకోవాలి. నో ఫోన్‌ జో¯Œ ్స, నో ఫోన్‌ టైమ్స్‌ స్పష్టంగా ఉండాలి. నిబంధనలు ఉల్లంఘిస్తే ఎలాంటి పరిణామాలు ఉంటాయో కూడా ముందే నిర్ణయించాలి. అలారం కోసం స్మార్ట్‌ఫోన్‌ కాకుండా విడిగా ఒక ‘అలారం క్లాక్‌’ కొనివ్వండి.
4. డిజిటల్‌ లిటరసీ: ‘నువ్వు వాడుతున్న యాప్‌ ఉచితం అయితే, అక్కడ నువ్వే ఒక ప్రొడక్ట్‌వి’ అనే నిజాన్ని వారికి అర్థమయ్యేలా చెప్పాలి. అల్గారిథమ్స్‌ మనల్ని ఎలా బానిసలుగా మారుస్తాయో శాస్త్రీయంగా వివరించాలి.
5. ప్రత్యామ్నాయ వ్యాపకాలు: మెదడు డోపమైన్‌ కోసం ఫోన్‌ను ఆశ్రయిస్తుంది. దానికి బదులుగా క్రీడలు, సంగీతం, పెయింటింగ్‌ లేదా ఇతర హాబీలను ప్రోత్సహించాలి. శారీరక శ్రమ వల్ల విడుదలయ్యే ఎండార్ఫిన్లు ఫోన్‌ ఇచ్చే తాత్కాలిక సంతోషం కంటే మిన్నగా ఉంటాయి.
6. డిజిటల్‌ కరెన్సీ సిస్టమ్‌: వారికి ఒక రివార్డ్‌ సిస్టమ్‌ ఏర్పాటు చేయండి. ఉదాహరణకు, ‘ఈ రోజు నువ్వు ఫిజికల్‌ రీడింగ్‌ లేదా ఇంట్లో సహాయం చేస్తే, దానికి బదులుగా నీకు 30 నిమిషాల ఎక్స్‌ట్రా గేమ్‌ టైమ్‌ వస్తుంది.’ దీనివల్ల వారు ఫోన్‌ సమయాన్ని ఒక ప్రివిలేజ్‌గా భావిస్తారు తప్ప హక్కుగా కాదు.
7. ప్రొఫెషనల్‌ హెల్ప్‌: ఫోన్‌ లేకపోతే మీ పిల్లల్లో విపరీతమైన ఆందోళన, ఆహారం మానేయడం లేదా ఒంటరిగా ఉండటం వంటి లక్షణాలు కనిపిస్తే, అది తీవ్రమైన అడిక్షన్‌ కావచ్చు. అటువంటప్పుడు ప్రొఫెషనల్‌ కౌన్సెలింగ్‌ అవసరం ఉంటుంది.
మీరే వారి రోల్‌ మోడల్‌
మీరు చేతిలో ఫోన్‌ పట్టుకుని, పిల్లలను ఫోన్‌ పక్కన పెట్టమంటే వారు వినరు. మనస్తత్వశాస్త్రంలో దీనిని ‘అబ్జర్వేషనల్‌ లెర్నింగ్‌‘ అంటారు.
» ఆఫీసు నుంచి ఇంటికి రాగానే కనీసం ఒక గంట పాటు మీ ఫోన్‌ను పక్కన పెట్టండి.
»పిల్లలతో ‘ఐ కాంటాక్ట్‌’ కలిపి మాట్లాడండి.
»మీరు సోషల్‌ మీడియాలో ఎంత సమయం గడుపుతున్నారో గమనించుకోండి.
» గ్యాడ్జెట్స్‌ కంటే గొప్ప కనెక్షన్‌ మన మనుషుల మధ్య ఉండాలని గుర్తుంచుకోండి.

- సైకాలజిస్ట్‌ విశేష్‌ఫౌండర్, జీనియస్‌ మేట్రిక్స్‌ హబ్‌

#

Tags : 1

Videos

రేపటి నుంచి ఇంటర్ పరీక్షలు.. నిమిషం ఆలస్యమైనా నో ఎంట్రీ..

బాబుకు బిగ్ షాక్.. సుప్రీంకోర్టులో లడ్డూ వివాదంపై సుబ్రహ్మణ్య స్వామి పిటిషన్

ఆఫ్ఘనిస్తాన్ పై పాక్ వైమానిక దాడి.. 17 మంది మృతి

దేవుడి సన్నిధిలో దందా.. ప్రక్షాళన అంటే ఇదేనా!

నా భర్త అలాంటోడే.. ఆయన ఫ్రెండ్ తో కలిసి లైంగికంగా..

AP: 8వ తరగతి బాలుడిపై ముగ్గురు తోటి విద్యార్థుల లైంగిక దాడి..

విజయ్ & రష్మిక పెళ్లిపై నటుడు ప్రమోద్ శెట్టి కీలక వ్యాఖ్యలు

మీ బెదిరింపులకు భయపడను.. నోటీసులపై పూజిత రియాక్షన్

అది ఏక సభ్య కమిషన్ కాదు.. తెలుగుదేశం పార్టీ కమిషన్

Dharmavaram: నా భర్త అలాంటోడే ఆయన ఫ్రెండ్ తో కలిసి లైంగికంగా..

Photos

+5

సోఫీ షైన్‌ను పెళ్లాడిన టీమిండియా మాజీ క్రికెటర్ శిఖర్ ధావన్ (ఫొటోలు)

+5

తిరుమల శ్రీవారి సేవలో టాలీవుడ్ హీరోయిన్ (ఫొటోలు)

+5

పళని మురుగన్‌ని దర్శించుకున్న హీరో నిఖిల్ ఫ్యామిలీ (ఫొటోలు)

+5

అంబానీ ఇంద్రభవనానికి హిల్లరీ క్లింటన్‌ (ఫోటోలు)

+5

నరేశ్‌కు ఎంతో ప్రత్యేకమైన రోజు.. ఎందుకంటే? (ఫోటోలు)

+5

సింగర్ మంగ్లీ 'ఇషా' ట్రిప్ జ్ఞాపకాలు (ఫొటోలు)

+5

రాధిక, శివకార్తికేయన్‌ కోసం వచ్చిన కమల్‌ హాసన్‌ (ఫోటోలు)

+5

హైదరాబాద్ : అభినయం..అనన్యం (ఫొటోలు)

+5

గ్రాండ్‌ పార్టీ ఇచ్చిన అల్లు అర్జున్‌.. ఫుల్‌ జోష్‌లో హీరోయిన్స్‌ (ఫోటోలు)

+5

వైభవంగా శ్రీయాదగిరి లక్ష్మీనరసింహస్వామి బ్రహ్మోత్సవాలు (ఫొటోలు)