ఇంటి బయట ఫర్నీచర్‌.. ఇదే కొత్త ట్రెండ్‌!

Published on Sat, 02/21/2026 - 17:57

ఎండ, వాన, చలి నుంచి రక్షణ కల్పించే సాధారణ ఇళ్లకు కాలం చెల్లింది. ఉన్నంతలో ప్రతి ఒక్కరూ తమ పొదరింటిని అందంగా, ఆకర్షణీయంగా తీర్చిదిద్దుకోవాలని భావిస్తున్నారు. ఇందుకోసం ఖర్చుకు ఏమాత్రం వెనకాడట్లేదు. ఈక్రమంలోనే ఇంటి లోపల కాదు ఇంటి బయటి ప్రదేశాల్లోనూ ఇంటీరియర్‌ డిజైనింగ్‌కు ప్రాధాన్యత పెరిగింది.  – సాక్షి, సిటీబ్యూరో

మెట్రో నగరాలలో పచ్చదనం, ఆహ్లాదకర వాతావరణం కొంత ఖర్చుతో కూడుకున్న వ్యవహారమే అని చెప్పాలి. ఎందుకంటే నగరాలలో భూముల ధరలు రూ.కోట్లలో ఉంటాయి.. గ్రీనరీకి స్థల కేటాయింపులు తక్కువే. దీన్ని లక్ష్యంగా చేసుకునే నిర్మాణ సంస్థలు పచ్చదనానికి ప్రాధాన్యత ఇస్తూ గ్రీనరీ హోమ్స్‌ను నిర్మిస్తున్నాయి. విశ్రాంతి, ప్రశాంతత, ఆహ్లాదకర వాతావరణాన్ని 
కల్పించే గార్డెన్‌లను ఏర్పాటు చేస్తున్నాయి. దీంతో గార్డెన్‌ ఫర్నీచర్‌కు మార్కెట్‌లో ఆదరణ పెరిగింది.  

ఉన్నంతలో ఉన్నతంగా.. 
మారుతున్న వినియోగదారుల ప్రాధాన్యతలు, వినూత్న డిజైన్లతో భారత ఔట్‌ డోర్‌ ఫర్నీచర్‌ మార్కెట్‌ వేగంగా అభివృద్ధి చెందుతోంది. పరిమిత స్థలంలో అందంగా, ఆకర్షణీయంగా ఒద్దికైపోవడమే ఈ గార్డెన్‌ ఫర్నీచర్‌ ప్రత్యేకత. వినియోగంలో సౌకర్యం, సౌలభ్యంతో పాటు అన్ని రకాల వాతావరణ పరిస్థితులను తట్టుకుంటూ, ఎక్కువ కాలం మన్నికగా నిలుస్తుండటంతో కస్టమర్ల నుంచి ఆదరణ పెరుగుతోంది. రీసైకిల్‌ చేసిన కలప, వెదురు, తాటి చెట్ల నుంచి తయారయ్యే రట్టన్, గ్లాస్, ప్లాస్టిక్, సింథటిక్‌ ఫైబర్, లోహ మిశ్రమం వంటి పర్యావరణ అనుకూలమైన, అన్ని రకాల వాతావరణ పరిస్థితులను తట్టుకునే ఉత్పత్తులతో వీటిని తయారు చేస్తారు.

నచ్చిన రంగు, ఆకృతి.. 
కొనుగోలుదారుల అభిరుచులకు అనుగుణంగా నచ్చిన రంగు, ఆకృతి, డిజైన్‌లలో ఈ గార్డెన్‌ ఫర్నీచర్‌ అందుబాటులో ఉన్నాయి. ఫోల్డబుల్‌ కుర్చీలు, సోఫాలు, డైనింగ్, కాఫీ టేబుల్స్, కాంపాక్ట్‌ యూనిట్లు, బార్‌ లాంజ్‌లు వంటివి ఉంటాయి. చూపరులకు ఆహ్లాదకరంగా, ఆనందంగా ఉంటుంది. గుండ్రంగా, చతురస్రాకారం, వంపు తిరిగిన, నక్షత్రం, గొడుగు, కోడి గుడ్డు ఆకారంలో ఇలా మనకు నచి్చన ఆకృతిలో ఎంపిక చేసుకోవచ్చు. వీటి కోణాలు పదునుగా ఉండవు.. దీంతో భద్రత ఉంటుంది.

Videos

రేపటి నుంచి ఇంటర్ పరీక్షలు.. నిమిషం ఆలస్యమైనా నో ఎంట్రీ..

బాబుకు బిగ్ షాక్.. సుప్రీంకోర్టులో లడ్డూ వివాదంపై సుబ్రహ్మణ్య స్వామి పిటిషన్

ఆఫ్ఘనిస్తాన్ పై పాక్ వైమానిక దాడి.. 17 మంది మృతి

దేవుడి సన్నిధిలో దందా.. ప్రక్షాళన అంటే ఇదేనా!

నా భర్త అలాంటోడే.. ఆయన ఫ్రెండ్ తో కలిసి లైంగికంగా..

AP: 8వ తరగతి బాలుడిపై ముగ్గురు తోటి విద్యార్థుల లైంగిక దాడి..

విజయ్ & రష్మిక పెళ్లిపై నటుడు ప్రమోద్ శెట్టి కీలక వ్యాఖ్యలు

మీ బెదిరింపులకు భయపడను.. నోటీసులపై పూజిత రియాక్షన్

అది ఏక సభ్య కమిషన్ కాదు.. తెలుగుదేశం పార్టీ కమిషన్

Dharmavaram: నా భర్త అలాంటోడే ఆయన ఫ్రెండ్ తో కలిసి లైంగికంగా..

Photos

+5

సోఫీ షైన్‌ను పెళ్లాడిన టీమిండియా మాజీ క్రికెటర్ శిఖర్ ధావన్ (ఫొటోలు)

+5

తిరుమల శ్రీవారి సేవలో టాలీవుడ్ హీరోయిన్ (ఫొటోలు)

+5

పళని మురుగన్‌ని దర్శించుకున్న హీరో నిఖిల్ ఫ్యామిలీ (ఫొటోలు)

+5

అంబానీ ఇంద్రభవనానికి హిల్లరీ క్లింటన్‌ (ఫోటోలు)

+5

నరేశ్‌కు ఎంతో ప్రత్యేకమైన రోజు.. ఎందుకంటే? (ఫోటోలు)

+5

సింగర్ మంగ్లీ 'ఇషా' ట్రిప్ జ్ఞాపకాలు (ఫొటోలు)

+5

రాధిక, శివకార్తికేయన్‌ కోసం వచ్చిన కమల్‌ హాసన్‌ (ఫోటోలు)

+5

హైదరాబాద్ : అభినయం..అనన్యం (ఫొటోలు)

+5

గ్రాండ్‌ పార్టీ ఇచ్చిన అల్లు అర్జున్‌.. ఫుల్‌ జోష్‌లో హీరోయిన్స్‌ (ఫోటోలు)

+5

వైభవంగా శ్రీయాదగిరి లక్ష్మీనరసింహస్వామి బ్రహ్మోత్సవాలు (ఫొటోలు)