ఏపీలో రోడ్లు అధ్వానం టీడీపీ ఎమ్మెల్యే బాబుకు షాక్
Breaking News
ఆహారోత్పత్తిలో లోటు నుంచి మిగులుకు
Published on Thu, 02/19/2026 - 08:58
భారత్ ఆహార లోటు నుంచి మిగులు స్థానానికి పురోగమించిందని.. ఆహార భద్రతా సవాళ్లను ఎదుర్కొనే దేశాలకు అవసరమైతే సాయం చేసే స్థితిలో ఉందని కేంద్ర మంత్రి చిరాగ్ పాశ్వాన్ అన్నారు. అమిటీ వర్సిటీలో జరిగిన ఒక కార్యక్రమంలో భాగంగా మాట్లాడారు. ప్రధాని మోదీ నాయకత్వంలో 2047 నాటికి అభివృద్ధి చెందిన దేశంగా భారత్ అవతరిస్తుందని ధీమాగా చెప్పారు. దేశ భవిష్యత్తు యువతపైనే ఆధారపడి ఉందంటూ. వికసిత్ భారత్ సాకారాన్ని వారు ముందుండి నడిపించాలని పిలుపునిచ్చారు.
ఈ శతాబ్దంలో మొదటి 25 ఏళ్లు ముగిశాయని, వచ్చే 25 ఏళ్లు ఎంతో కీలకమని.. యువత భుజాలపై ఎంతో బాధ్యత ఉందన్నారు. దేశ యువత త్వరలో కీలక నాయకత్వ స్థానాలను అధిరిహోస్తుందని, ఈ సందర్భంగా ఎన్నో సవాళ్లను ఎదుర్కొనుందని చెప్పారు. సవాళ్లు ఎదురైనప్పుడు వాటిని వదులుకోవడం, లేదంటే అవకాశాలుగా మలుచుకోవడం అనే రెండు ఎంపికలే ఉంటాయన్నారు. అంతర్జాతీయ సవాళ్లకు భారత్ సిద్ధమైందని, కొత్త టెక్నాలజీలను అందిపుచ్చుకోవడమే కాకుండా, టెక్నాలజీలో అంతర్జాతీయ దిగ్గజంగా అవతరిస్తుందని చెప్పారు.
ఇదీ చదవండి: ఏఐ.. మనిషికి సూపర్ పవర్!
Tags : 1