ఏపీలో రోడ్లు అధ్వానం టీడీపీ ఎమ్మెల్యే బాబుకు షాక్
Breaking News
ఆమె అడుగుజాడలు
Published on Thu, 02/19/2026 - 05:54
మన దేశంలోని మొట్ట మొదటి మహిళా ఆంత్రపాలజిస్ట్ ఐరావతి కార్వే. జర్మనీలో శిక్షణ పొందిన కార్వే పుణేలోని దక్కన్ కళాశాలలో మావనశాస్త్ర విభాగాన్ని ప్రారంభించారు.
భారతీయ సంస్కృతి, నాగరికత, కులవ్యవస్థపై ఆమె విలువైన రచనలు చేశారు. ఆంత్రపాలజీ అంటే గుర్తుకు వచ్చే మహిళ అయినప్పటికీ కార్వే జీవితం గురించి చాలా విషయాలు తెలియవు. ఈ లోటును పూరించేలా ఆమె మనవరాలు ఉర్మిలా దేశ్‌పాండే, విద్యావేత్త థియాగో బార్బోసాతో కలిసి ‘ది రీమార్కబుల్ లైఫ్ ఆఫ్ ఐరావతి కార్వే’ అనే పుస్తకం రాశారు.
ఆమెదే రిస్క్
అండమాన్, నికోబార్ దీవులలోని ఆదిమజాతి ప్రజలపై పరిశోధన చేసిన ప్రసిద్ధ భారతీయ శాస్త్రవేత్త మధుమాల చటోపాధ్యాయ. అండమాన్ దీవులలో ఫీల్డ్‌వర్క్ చేయడానికి మధుమాలను అనుమతించే ముందు ఆంత్రపాలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా, అక్కడ ఎలాంటి ప్రమాదం జరిగినా ప్రభుత్వం బాధ్యత వహించదని నిర్ధారిస్తున్న పత్రాలపై సంతకం చేయాలని కోరింది. అయినప్పటికీ ఆమె వెనకడుగు వేయలేదు. అండమాన్, నికోబార్ దీవులలోని వివిధ తెగలపై ఆరు సంవత్సరాలు పరిశోధన చేశారు.
ఫెమినిస్ట్ ఆంత్రపాలజీ
20వ శతాబ్దంలో ‘ఫెమినిస్ట్ ఆంత్రపాలజీ’ ఊపందుకుంది. పురుషాధిపత్య వాదనలు, వివరణలను సవాలు చేసింది. మన దేశంలో వర్గం, కులం, ప్రాంతాల వారీగా మహిళల స్థితిగతులను అధ్యయనం చేయడంలో ఫెమినిస్ట్ ఆంత్రపాలజీ కీలక పాత్ర పోషించింది. ఉదాహరణకు దళిత మహిళలు పితృస్వామ్య భావజాలానికి మాత్రమే కాకుండా కుల ఆధారిత వివక్షకు వ్యతిరేకంగా పోరాటం చేయడం గురించి విశ్లేషించింది.
Tags : 1