Breaking News

పన్నుల ముసాయిదాలోని ‘‘ప్రమోదం’’

Published on Mon, 02/16/2026 - 11:01

కొత్త ఇన్‌కం టాక్స్‌ చట్టం వచ్చింది. ముసాయిదా నిబంధనలు–2026 విడుదల అయ్యాయి. ఈ ఫిబ్రవరి 22 తేదీ వరకు సలహాలు స్వీకరిస్తారు. ఆ తరువాత వాటిని అమలులోకి తెస్తారు. ఈ ముసాయిదా ప్రతిపాదనలు చిన్న చిన్న అస్సెస్సీలకు, ఉద్యోగస్తులకు ఎంతో ఊరట, ఉపశమనం కల్పిస్తాయి అనడంలో సందేహం లేదు. ముసాయిదాలోని ప్రతిపాదనలు ప్రమోదాన్ని తెస్తున్నాయి. వివరాల్లోకి వెళ్దాం... కేవలం వ్యక్తులకు సంబంధించిన వాటిని ప్రస్తావిస్తున్నాం....

ఉద్యోగస్తులకు ఉపశమనం
ఉద్యోగికి జీతంతో పాటు అదనంగా లభించే వేతనేతర ప్రయోజనాలు/సౌకర్యాల పరిమితిని పెంచారు. కొత్తగా వచ్చే ఈ అదనపు ప్రయోజనాలతో లబ్ధి పొందేది అంతిమంగా ఉద్యోగస్తుడు. రెండు, మూడు దశాబ్దాలుగా వీటి జోలికెళ్లని డిపార్ట్‌మెంట్‌ ఇప్పుడు ఆచరణాత్మకంగా అడుగులేస్తోంది.  

  • యజమాని సమకూర్చే వాహనాల సామర్థ్యం ఆధారంగా మినహాయింపు ఇస్తారు. ఈ సదుపాయంతో డ్రైవర్‌ ఇవ్వడం లేదా ఇవ్వకపోవడం జరగొచ్చు. ఇంజిన్‌ సామర్థ్యం 1.6 లీటర్‌ దాటని సందర్భంలో ఇచ్చే మినహాయింపుని రూ.2,700 నుంచి రూ.8,000 లకు పెంచారు. కెపాసిటీ 1.6 లీటర్‌ దాటితే రూ.3,200 నుంచి రూ.10,000లకు పెంచారు.

  • యజమాని ఇచ్చే భోజనం విలువ పరిమితిని ఒక్కొక్క భోజనానికి రూ.50 నుంచి రూ.200లకు పెంచారు. దాని విలువ ఏడాదికి లెక్కిస్తే మినహాయింపు విలువ రూ.1,05,000 దాకా వస్తుందని అంచనా.

  • గిఫ్ట్‌ వోచర్ల విలువని రూ.15,000 లకు పెంచారు. ప్రస్తుతం వాటి విలువ రూ.5,000గా ఉంది.  

  • వడ్డీ లేని రుణాలు... వడ్డీ విలువ రూ.20,000 దాకా ఉంది. దాన్ని పదింతలు అంటే రూ.2,00,000 లకు పెంచారు.

  • ఎడ్యుకేషన్‌ అలవెన్స్‌.. ఒక సంతనానికి నెలకి రూ.100 ఉంది. దానిని రూ.3,000లకు పెంచారు.  

  • విద్యార్థులకు హాస్టల్‌ అలవెన్సు పరిమితిని రూ.300 నుంచి రూ.3,000లకు పెంచారు.

ప్రస్తుతం అమల్లో ఉన్న పరిమితులు దశాబ్దాల చరిత్ర కలిగినవి. కొంతమంది మరిచిపోయారు. కొంతమంది క్లెయిమ్‌ చేయడం మానేశారు. డిపార్ట్‌మెంట్‌ వారి ఆలోచనా విధానం సమకాలీన పరిస్థితులకు అద్దం పడుతోంది. ఈ పెంపుదల గణనీయం.. ఈ మేరకు ఉద్యోగస్తులకు ఎంతో పన్ను ఊరట కలుగుతుంది.  

పాన్‌తో తిప్పలు తప్పుతాయ్‌..! 
చేతిలో సెల్‌ఫోన్, బ్యాగులో ఆధార్‌కార్డు, పాన్‌ కార్డు లేకుండా బయటకు రాలేని పరిస్థితి. కొంతమంది జిరాక్సులు చేయించి సిద్ధంగా ఉంటారు. ప్రస్తుతం బ్యాంకులో నగదు డ్రా చేయాలంటే ఒక రోజులో రూ.50,000 దాటితే పాన్‌ తెలియచేయాలి. ఇక నుంచి డైయిలీ లిమిట్స్‌ ఉండవు. ఒక ఆర్థిక సంవత్సరం మొత్తంలో రూ.10,00,000 నగదు విత్‌డ్రా చేసినా, డిపాజిట్‌ చేసినా, ఈ పరిమితి రూ.10 లక్షలు దాటితేనే పాన్‌ వివరాలు ఇవ్వాలి. దీని వలన ఇల్లు కట్టిస్తున్నప్పుడు, ఏవైనా పెళ్లిళ్లు, కార్యాలున్నప్పుడు వ్యాపారంలో కొనుగోళ్లు, మెడికల్‌ ఎమర్జెనీ సందర్భాల్లో ఎంతో వెసులుబాటు ఉంటుంది.  స్థిరాస్తి క్రయవిక్రయ సందర్భాల్లో రూ.10,00,000 ఉన్న పరిమితిని రూ.20,00,000లకు పెంచారు. అలాగే జాయింట్‌ డెవలప్‌మెంట్‌ సందర్భాల్లో రూ.20,00,000 లోపల ఎటువంటి ఇబ్బంది లేకుండా సాఫీగా వ్యవహారాలు జరుపుకోవచ్చు.  

అలాగే చిన్న, చిన్న మోటారు బైకులు కొనుగోలు సందర్భంలో విలువతో నిమిత్తం లేకుండా పాన్‌ అడిగేవారు. ఇక నుంచి రూ.5,00,000 దాటిన బండి కొంటేనే పాన్‌ అడుగుతారు.  హోటల్, ఈవెంట్ల నిర్వహణ కోసం చెల్లించే మొత్తం రూ.1,00,000 దాటితేనే పాన్‌ సమర్పించాలి. ప్రస్తుతం ఈ పరిమితి రూ.50,000గా ఉంది.  అయితే ఇవన్నీ ఒక దిశగా వెళ్లితే.., ఊరంతా ఒక దారి, ఉలిపికట్టెదొక దారి అన్నట్లు బీమా రంగంలో మాత్రం ఎటువంటి సడలింపు లేదు. పాన్‌ వాడకం సడలింపు విషయంలో డిపార్ట్‌మెంట్‌ని అభినందించాలి. సడలింపుల వలన ఎంతో సౌలభ్యం ఏర్పడుతుంది. కాలం వృథా కాదు.  టాక్సుపేయర్‌ ఎప్పుడూ చట్టాన్ని, రూల్స్‌తో కలిసి చదివి నిర్ణయానికి రావాలి. ఈ రూల్స్‌ ప్రకారం మన తెలుగు ప్రజలలో హైదరాబాద్‌ ఉద్యోగస్తులకు ఒక తీపి కబురు.  

హైదారాబాద్‌ ఉద్యోగస్తులు
ఇంటి అద్దె అలవెన్సు మినహాయింపు ఢిల్లీ, ముంబై, చెన్నై, కోల్‌కతా మినహా అన్ని ప్రాంతాల్లో ఉన్న ఉద్యోగస్తులకు జీతం మీద 40% మాత్రమే ఉండేది. నిజానికి హైదరాబాద్‌ ఎంతో అభివృద్ధి చెందింది. దానితో పాటు సదుపాయాలు, ఇళ్లు, అపార్ట్‌మెంట్లు ఇప్పు డు విల్లాలు.. కొంతమంది ఇండిపెండెంట్‌ ఇంటిలో ఉంటారు. అమలులో ఉన్న రూల్స్‌ ప్రకారం వారికి మినహాయింపు 40% మాత్రమే ఇచ్చేవారు. ఇప్పుడు ఈ లిమిట్‌ అన్నీ 40% నుంచి 50 శాతానికి పెంచారు. దాని వలన హైదరాబాదులో ఎక్కువ అద్దె ఇచ్చే వారికి మంచి ఉపమశనం. అంతేకాకుండా ఈ వెసులుబాటు పూణే, అహ్మదాబాద్, బెంగళూర్‌కి వర్తిస్తుంది. వెనకోముందో ఉద్యోగస్తులకు ప్రమోదం కలిగించేలా ప్రతిపాదనలు ఉన్నాయి. అభినందనీయం..!

Videos

మీ ముగ్గురి నోరు యాసిడ్ తో కడిగినా ఆ కంపు పోదు... బడ్జెట్ పై జడ శ్రవణ్ సెటైర్లు

నీ పని నువ్వు చూసుకో నాగబాబు తీరుపై టీడీపీ, బీజేపీ నేతల ఆగ్రహం

చంపేసి కారులో పెట్టి..? ప్రమాదం వెనుక మిస్టరీ

లైవ్ లో హెరిటేజ్ నెయ్యిని చూపిస్తూ.. చంద్రబాబు బండారం మొత్తం బట్టబయలు

ఇజ్రాయెల్‌ మహిళపై అత్యాచారం.. ముగ్గురు దోషులకు మరణశిక్ష విధించిన కోర్టు

తెలంగాణలో జనసేన అభ్యర్థికి 2 ఓట్లు.. నిన్ను వెంకటేశ్వర స్వామి కడిగేయడం ఖాయం..

ఉమ్మడి నల్గొండ జిల్లా మున్సిపల్ ఎన్నిక పూర్తి వివరాలు ఇవే..!

కష్ట కాలంలో మాకు... మీ అందరినీ మా ఫ్యామిలీ జీవితాంతం గుర్తు పెట్టుకుంటుంది

Stock Market: ఈ ఒక్క స్టాక్ లో ఇన్వెస్ట్ చేస్తే చాలు.. కోటీశ్వరులు అయిపోయినట్టే..!

Punjagutta: సైలెంట్ గా కిలో బంగారం కొట్టేశాడు

Photos

+5

ఇండియా AI ఇంపాక్ట్ సమ్మిట్ 2026 (ఫోటోలు)

+5

‘హే భగవాన్’ మూవీ హీరోయిన్ శివానీ నగరం (ఫొటోలు)

+5

'పెద్ది' సెట్‌లో బుచ్చిబాబు బర్త్ డే సెలబ్రేషన్ (ఫొటోలు)

+5

భార‌త్ vs పాకిస్తాన్‌ మ్యాచ్‌ సూపర్ హీరో ఇషాన్ కిషన్‌ స్పెషల్ (ఫొటోలు)

+5

శని దోష నివారణకు ప్రసిద్ధి చెందిన పుణ్యక్షేత్రం..12.5 అడుగుల ఎత్తైన శనిదేవుడి విగ్రహం (ఫొటోలు)

+5

నౌకాదళ పండగ వాతావరణంతో విశాఖ తీరం కళకళ (ఫొటోలు)

+5

నెక్లెస్‌ రోడ్డులో సందడిగా ఉమెన్‌ పింకథాన్‌ రన్‌ (ఫొటోలు)

+5

గెలుపంటే ఇదేరా.. ట్యాంక్‌బండ్ వద్ద క్రికెట్‌ అభిమానుల సంబరాలు (ఫొటోలు)

+5

కీసరగుట్టకు పోటెత్తిన భక్తజనం (ఫోటోలు )

+5

ప్రముఖ సినీతారల వాలైంటైన్స్ డే విషెస్ (ఫోటోలు )