Breaking News

రియో రంగుల సంద్రం

Published on Sat, 02/14/2026 - 22:32

రియో నగరం బ్రెజిల్‌ దేశపు సంస్కృతికి, ఆనందానికి నిలువుటద్దం. ప్రస్తుతం అది ఒక రంగుల ప్రపంచంగా మెరుస్తోంది. రియోలో ఇప్పుడు ఎటు చూసినా జనమే, ఎక్కడ విన్నా సంగీతమే! రంగురంగుల దుస్తులు, మిరిమిట్లు గొలిపే వెలుగులు, గాలిలో రెపరెపలాడే పించాల మెరుపులతో రియో డి జనిరో రత్నంలా మెరిసిపోతోంది. ఫిబ్రవరి వచ్చిందంటే చాలు రియో కార్నివాల్‌ కోసం స్థానిక వీథులన్నీ కళావేదికలుగా మారిపోతాయి. నిశ్శబ్దాన్ని తరిమికొడుతూ గుండె వేగాన్ని పెంచే సాంబా నృత్యాల జోరుతో ప్రపంచాన్ని మెప్పించే సంబరం మొదలైంది.

ది గ్రేటెస్ట్‌ షో ఆన్  ఎర్త్‌గా పిలవబడే ఈ రియో కార్నివాల్‌ ఫిబ్రవరి 13 నుంచి ఫిబ్రవరి 17 వరకు జరుగుతుంది. ఇది కేవలం ఒక పండుగ మాత్రమే కాదు, బ్రెజీలియన్ల భావోద్వేగం. దాదాపు 20 లక్షల మంది ప్రజలు రోజూ వీథుల్లోకి వచ్చి సంబరాల్లో పాల్గొంటారు. పోర్చుగీసు వారు 18వ శతాబ్దంలో మొదలుపెట్టిన ఈ సంప్రదాయం ప్రస్తుతం పోర్చుగీసు, ఆఫ్రికన్‌ సంస్కృతుల కలయికతో ముందుకు సాగుతోంది. క్రైస్తవుల పవిత్ర సీజన్  లెంట్‌ కాలానికి ముందు ఈ వేడుక జరుగుతుంది.

ఈ కార్నివాల్‌లో సాంబాడ్రోమ్, బ్లాకోస్‌ అని పిలవబడే వీథి పార్టీలు, విలాసవంతమైన పార్టీలకు ప్రసిద్ధి చెందిన మ్యాజిక్‌ బాల్స్‌ వంటివి ప్రత్యేక ఆకర్షణగా ఉంటాయి. వీటన్నింటిలో సాంబా స్కూల్‌ పరేడ్‌ కోసం ప్రతి ఒక్కరూ ఎదురు చూస్తారు. వేర్వేరు ప్రాంతాలకు చెందిన సాంబా పాఠశాలల విద్యార్థులు తమ ప్రతిభను చాటుకునేందుకు ఒకరితో మరొకరు పోటీపడతారు. ప్రత్యేకంగా డిజైన్  చేసిన రథాల్లో మెరిసిపోయే దుస్తులు ధరించిన వేలాదిమంది కళాకారులు సాంబాడ్రోమ్‌ స్టేడియంలో ఇచ్చే ప్రదర్శనలు అందరినీ ఆకట్టుకుంటాయి. ప్రతి ఒక్క పాఠశాల ప్రత్యేకమైన థీమ్‌తో ముందుకు వచ్చి సంగీత నృత్యాలతో వివిధ అంశాలను వివరిస్తారు.

సాంబాడ్రోమ్‌లు టికెట్‌తో కూడినవి అయితే బ్లాకోస్‌ ప్రదర్శనలు మాత్రం ఉచితంగా నగరం మొత్తం కనిపిస్తాయి. సుమారు ఐదువందలకు పైగా బృందాలు నగరం నలుమూలలా సంగీతంతో సందడి చేస్తారు. వింత వింత దుస్తులు ధరించిన స్థానికులు, పర్యాటకులు మ్యూజిక్‌కి తగ్గట్టుగా డ్యాన్స్ చేస్తారు. కోపకబానా, ఇపనెమా వంటి బీచ్‌లో బ్లాకోస్‌ వేడుకలు రాత్రంతా సాగుతాయి. కార్నివాల్‌లో ఉండే మ్యాజిక్‌ బాల్స్‌ అత్యంత విలాసవంతమైనవి. ప్రపంచం నలుమూలల నుంచి వచ్చిన సెలబ్రిటీలు, సంపన్నులు భారీ సెట్టింగుల మధ్య వినోదాల్లో మునిగిపోతారు.

కోపకబానా ప్యాలెస్‌లో జరిగే ఈ వేడుకల్లో అతిథులు ఖరీదైన మాస్క్‌లు, డిజైనర్‌ దుస్తుల్లో సందడి చేస్తారు. రియో కార్నివాల్‌ కేవలం వినోదం మాత్రమే కాదు, ఇది బ్రెజిల్‌ దేశపు సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలుస్తోంది. ఈ పండగలో పేద, ధనిక అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరూ కలిసి ఎంజాయ్‌ చేస్తారు. ఈ కార్నివాల్‌ వల్ల బ్రెజిల్‌ పర్యాటక రంగానికి భారీ ఆదాయం లభిస్తుంది. ప్రతి ఏడాది సరికొత్త ఇతివృత్తాలతో నిర్వహించే ఈ వేడుకలు పర్యాటకుల మదిలో చెరగని ముద్ర వేస్తాయి.  

#

Tags : 1

Videos

బడ్జెట్ లో నిరుద్యోగులకు టోకరా.. బాబుపై 420 కేసు!?

ఇది రాష్ట్రం కోసం పెట్టిన బడ్జెట్ కాదు జగన్ కోసం పెట్టిన బడ్జెట్..

చెయ్యి ఆయనది, గడ్డం ఆయనది.. మీకేంటి నొప్పి?

అనిత ఓవరాక్షన్ కు అంబటి కూతురు ఊర మాస్ వార్నింగ్

కాపుతో పెట్టుకున్నారు.. వంగవీటి నరేంద్ర మాస్ వార్నింగ్

పవన్ వారసుడు అకీరా ఎంట్రీ ఫిక్స్.. డైరెక్టర్ ఎవరంటే..?

చంద్రబాబు లడ్డూ కల్తీ జరిగిందని చెప్పడానికి అసలు కారణం ఇదే..

నీకు అంత దమ్ముంటే హెరిటేజ్ నాది కాదు అని చెప్పు

ఛత్తీస్ గఢ్ లోని దాంతరిలో ఘోర రోడ్డు ప్రమాదం.. నలుగురు మృతి

పంచారామ క్షేత్రంలో అపచారం

Photos

+5

సాహసం శ్వాసగా సాగిపో: విశాఖలో నేవీ విన్యాసాలు (ఫొటోలు)

+5

విశ్వక్‌సేన్‌ 'ఫంకీ' సక్సెస్‌ మీట్‌ (ఫోటోలు)

+5

ట్రావెల్‌ అడ్వెంచర్‌ టాక్‌ షో 'సోల్‌ ట్రిప్‌' (ఫోటోలు)

+5

తిరుమల శ్రీవారి సేవలో నరేశ్‌- పవిత్ర (ఫోటోలు)

+5

నాగేంద్ర హారాయ త్రిలోచనాయ ! (ఫొటోలు)

+5

డాక్టర్‌గా హీరోయిన్ శ్రీలీల.. పట్టా అందుకున్న మధుర క్షణాలు (ఫొటోలు)

+5

టాలీవుడ్ హీరో అల్లు శిరీష్ హల్దీ వేడుక (ఫొటోలు)

+5

క్రిస్టల్‌ ఐవరీ లెహంగాలో పాలరాతి శిల్పంలా రాధికా స్టన్నింగ్‌ లుక్స్‌ ..! (ఫొటోలు)

+5

టాలీవుడ్ హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చిన మరో డాక్టర్ (ఫొటోలు)

+5

బ్యూటీ విత్‌ బ్రెయిన్‌.. MBBS మధ్యలోనే ఆపేసిన స్టార్‌ హీరోయిన్‌ ఎవరో తెలుసా? (ఫోటోలు )