మండలిలో మంచి సంఖ్యా బలం ఉంది: వైఎస్ జగన్
Breaking News
విజయ్ మాల్యాకు బాంబే హైకోర్టు ఝలక్!
Published on Thu, 02/12/2026 - 17:53
ఇండియా నుంచి వెళ్ళిపోయి.. యూకేలో ఉంటున్న విజయ్ మాల్యా విషయంలో బాంబే హైకోర్టు స్పందించింది. మీరు భారత్‌కు తిరిగి రావాలి, లేకుంటే.. మేము మీ పిటిషన్ (ఆర్థిక నేరస్థుల చట్టం, 2018)ను విచారించలేము వెల్లడించింది.
పిటిషన్‌ను కోర్టు పరిగణనలోకి తీసుకోవాలని కోరుకుంటే, ముందుగా మీరు (విజయ్ మాల్యా) భారతదేశానికి తిరిగి రావాలి. మేము ఇప్పటికీ కేసును కొట్టివేయడం లేదు.. మీకు మరొక అవకాశం ఇస్తున్నామని కోర్టు వెల్లడించింది. విదేశాల్లో ఉండి ఈ కేసును ముందుకు తీసుకెళ్లలేరని స్పష్టం చేసింది.
ఈ పిటిషన్ విచారణ సందర్భంగా ప్రధాన న్యాయమూర్తి చంద్రశేఖర్ నేతృత్వంలోని బెంచ్ స్పష్టంగా వ్యాఖ్యానించింది. మీరు కోర్టు అధికార పరిధిని తప్పించుకుంటున్నారు. అలాంటి పరిస్థితిలో మీరు సమాన న్యాయం కోరలేరు. ముందుగా మీరు భారతదేశానికి తిరిగి రావాలని కోర్టు స్పష్టం చేసింది. అయితే మాల్యా భారత్‌కు వస్తారా లేదా అన్న విషయంపై అఫిడవిట్ దాఖలు చేయాలని ఆదేశించింది. ఈ కేసు ఫిబ్రవరి 18న మళ్లీ విచారణకు రానుంది.
ఆర్ధిక నేరాలకు పాల్పడి పరారీలో ఉన్న నిందితులు విచారణను ఎదుర్కొనేందుకు తిరిగి వచ్చేలా.. భారతదేశం పూర్తిగా కట్టుబడి ఉందని విదేశాంగ మంత్రిత్వ శాఖ (MEA) తెలిపింది. ఇందులో విజయ్ మాల్యా మాత్రమే కాకుండా.. లలిత్ మోదీ కూడా ఉన్నారు. వీరిని తీసుకురావడానికి ప్రభుత్వం చురుకుగా ప్రయత్నిస్తోందని MEA ప్రతినిధి రణధీర్ జైస్వాల్ అన్నారు.
ఇదీ చదవండి: వాట్సాప్ బ్యాన్ చేయడానికే రష్యా ప్రయత్నం?
2018లో అమలులోకి వచ్చిన ఎఫ్ఈఓ చట్టం ప్రకారం.. మొత్తం 15 మందిని పరారీలో ఉన్న ఆర్థిక నేరస్థులుగా ప్రకటించారు. వీరిలో 9 మంది ప్రభుత్వ బ్యాంకులకు సుమారు రూ. 26,645 కోట్ల నష్టం కలిగించారు. 2025 అక్టోబర్ 31 వరకు వడ్డీ కలిపి ఈ మొత్తం రూ. 31,437 కోట్లకు చేరింది. ఇందులో రూ. 19,187 కోట్లు ఇప్పటివరకు తిరిగి వసూలు చేశారు.
Tags : 1