కాగ్నిజెంట్‌ ఉద్యోగులకు బొనాంజా.. 100% బోనస్

Published on Sun, 02/08/2026 - 14:35

సాఫ్ట్‌వేర్‌ సేవల దిగ్గజం కాగ్నిజెంట్ తన ఉద్యోగులకు 100 శాతం భారీ బోనస్ ప్రకటించింది. 2025లో అంచనాలను మించి ఆదాయ ఫలితాలను సాధించిన తరువాత ఈ బంపర్‌ బొనాంజా ప్రకటించింది. దీంతో ఉద్యోగుల్లో ఆనందోత్సాహం నిండింది.

కాగ్నిజెంట్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ (సీఈఓ) రవి కుమార్ ఎస్ గత కొన్నేళ్లుగా "విజేత సర్కిల్"లోకి ప్రవేశించాలనే సంస్థ లక్ష్యం గురించి చాలాసార్లు మాట్లాడారు.  ఫలితాల విడుదల సందర్భంగా 2025లో పటిష్ట పనితీరుకు కారణమైన 3.5 లక్షలమంది సిబ్బందిని సీఈవో ప్రశంసించారు. నాస్‌డాక్‌ లిస్టెడ్‌ కంపెనీ దేశీయంగా భారీ స్థాయిలో ఉద్యోగులను కలిగి ఉన్న విషయం విదితమే. డిసెంబర్‌31కల్లా కంపెనీ సిబ్బంది సంఖ్య 14,800 పెరిగి 3.51 లక్షలకు చేరింది.

లాభం జూమ్‌
కాగ్నిజెంట్‌ గత ఆర్థిక సంవత్సరం(2025) చివరి త్రైమాసికంలో పటిష్ట ఫలితాలు సాధించింది. అక్టోబర్‌–డిసెంబర్‌(క్యూ4)లో కన్సాలిడేటెడ్‌ నికర లాభం 19 శాతం జంప్‌చేసి 64.8 కోట్ల డాలర్లను తాకింది. అంతక్రితం ఏడాది(2024) ఇదే కాలంలో కేవలం 54.6 కోట్ల డాలర్లు ఆర్జించింది. కంపెనీ కేలండర్‌ ఏడాదిని ఆర్థిక సంవత్సరంగా పరిగణించే సంగతి తెలిసిందే. మొత్తం ఆదాయం సైతం 5 శాతం ఎగసి 533.3 కోట్ల డాలర్లకు చేరింది. అంతక్రితం క్యూ4లో 508.2 కోట్ల డాలర్ల టర్నోవర్‌ అందుకుంది. ఈ కాలంలో 12  భారీ డీల్స్‌ కుదుర్చుకున్నట్లు కంపెనీ వెల్లడించింది. కాగా.. డిసెంబర్‌తో ముగిసిన పూర్తిఏడాది(2025)కి ఆదాయం 7 శాతం వృద్ధితో 21.1 బిలియన్‌ డాలర్లను తాకింది.

ఆదాయ అంచనాలు గుడ్‌ 
ప్రస్తుత ఏడాది(2026)కి కాగ్నిజెంట్‌ 5–7.4 శాతం అధికంగా 22.14–22.66 బిలియన్‌ డాలర్ల ఆదాయ అంచనాలు(గైడెన్స్‌) ప్రకటించింది. ఈ బాటలో తొలి క్వార్టర్‌(జనవరి–మార్చి)కు 5.36–5.44 బిలియన్‌ డాలర్ల ఆదాయం ఆశిస్తున్నట్లు తెలియజేసింది. 2.7–4.2 శాతం వృద్ధి అంచనాలివి.

Videos

తప్పు ఒప్పుకున్న చంద్రబాబు.. ఫైన్ కట్టిన హెరిటేజ్

Perni Nani: మీరు మనుషులా.. రాక్షసులా..? రాష్ట్రాన్ని అల్లకల్లోలం చేస్తున్నారు

గుంటూరు కోర్టుకు అంబటి రాంబాబు

చిరు పక్కన సారా అర్జున్.. కృతి శెట్టి కథ కంచికేనా..?

సౌందర్య, మోహన్ బాబు వివాదంపై బాబు మోహన్ షాకింగ్ కామెంట్స్

జాతిపిత ఎవరు? కేసీఆర్, జయశంకర్, శ్రీకాంతాచారి

గతంలో బూతు బొమ్మలు & బూతు పుస్తకాల కోసం చాలా కష్ట పడేవాళ్ళం.. కానీ ఇప్పుడు..!

వైఎస్ జగన్ సోదరుడు సునీల్ రెడ్డి కుమారుడి వివాహ వేడుకలు

డొల్ల కంపెనీలతో బిగ్ స్కామ్.. OTP లేకుండానే 5 వేల కోట్లు..

లక్షను 40 లక్షలు చేసిన స్టాక్.. జేబులు నింపుకున్న ఇన్వెస్టర్లు..

Photos

+5

గ్లామర్‌తో పడేస్తున్న శ్రద్ధా దాస్‌.. నెట్టింట ఫోటోలు వైరల్‌

+5

హైదరాబాద్ : చార్మినార్ వద్ద ఆధ్యాత్మిక శోభ (ఫొటోలు)

+5

కుటుంబ వివాహ వేడుక.. తమిళనాడు ప్రముఖులకు వైఎస్‌ జగన్‌ ఆత్మీయ పలకరింపు (ఫొటోలు)

+5

తిరుమల శ్రీవారిని దర్శించుకున్న శ్రీలీల, థమన్‌, తేజ సజ్జా (ఫోటోలు)

+5

వివాహ వేడుకలో వైఎస్‌ జగన్‌.. జననేతకు ఆత్మీయ పలకరింపులు (ఫొటోలు)

+5

ఫ్రెండ్ బర్త్ వేడుకల్లో మన్మధుడు హీరోయిన్ అన్షు.. (ఫొటోలు)

+5

హైదరాబాద్ : ఉత్సాహంగా హరేకృష్ణ రన్‌ 2026 (ఫొటోలు)

+5

టి20 వరల్డ్‌ కప్‌ ప్రారంభ వేడుక అదుర్స్‌ (ఫొటోలు)

+5

సాక్షి మీడియా గ్రూప్‌, తెలంగాణ రన్నర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో టెంపుల్ రన్ (ఫొటోలు)

+5

తిరుమల శ్రీవారిని దర్శించుకున్న సినీనటి నిధి అగర్వాల్ (ఫొటోలు)