జీవనశైలిపై చెరగని ముద్ర: టాటూ ట్రెండ్‌

Published on Sat, 02/07/2026 - 10:23

ఒకప్పుడు సంప్రదాయానికి, ఆచారాలకూ పరిమితమైన పచ్చబొట్టు (టాటూ) నేడు ఆధునిక జీవనశైలిలో ఫ్యాషన్, వ్యక్తిగత గుర్తింపు, భావ వ్యక్తీకరణకు ప్రతీకగా నిలుస్తోంది. ముఖ్యంగా హైదరాబాద్‌ వంటి మహానగరాల్లో టాటూ అనేది శరీరంపై వేసుకునే డిజైన్‌ మాత్రమే కాదు.. ఇది ‘లైఫ్‌స్టైల్‌ చాయిస్‌’. కాలేజీ విద్యార్థుల నుంచి కార్పొరేట్‌ ఉద్యోగుల వరకు, సెలబ్రిటీల నుంచి సోషల్‌ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్ల వరకు అందరిలోనూ టాటూ పట్ల ఆసక్తి పెరుగుతోంది. తనకంటూ ఓ ప్రత్యేకత ఉండాలనే ఆకాంక్ష అందరిలోనూ పెరుగుతోంది. ఈ కారణంగా ఓ వ్యక్తి ఏకంగా తన రెండు కళ్లలోనూ టాటూ వేసుకోవడం ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది. దీనిపై నెటిజన్లు భిన్నంగా స్పందిస్తున్నప్పటికీ.. ప్రస్తుత జీవనశైలిలో ఇది స్టైల్‌ స్టేట్మెంట్‌గా మారింది.  

మన సంస్కృతిలో పచ్చబొట్టు అనేది కొత్త కాన్సెప్ట్‌ కాదు. గిరిజన తెగలు, గ్రామీణ ప్రాంతాల్లో సంప్రదాయ, ఆధ్యాతి్మక విశ్వాసాలకు ప్రతీకగా పచ్చబొట్లు వేసుకునేవారు. కాలక్రమేణా ఈ సంప్రదాయం ఆధునికతను సంతరించుకుని ‘స్టైల్‌ స్టేట్‌మెంట్‌’గా మారింది. నేడు టాటూ అంటే ప్రేమ, స్నేహం, కుటుంబం, నమ్మకం, స్వీయ భావనం ఇలా ఎన్నో భావోద్వేగాలకు ప్రతిరూపం. అయితే ఈ టాటూ ఆర్ట్‌కు ఎన్నో రూపాలు ఉన్నాయి. ప్రస్తుత తరంలో మరింత వినూత్నత్వాన్ని సంతరించుకుంది. ప్రస్తుతం అందుబాటులో ఉన్న విభిన్న శైలి మోడ్రన్‌ ఫ్యాషన్‌లో భాగమౌతోంది. బ్లాక్‌ అండ్‌ గ్రే టాటూలు క్లాసిక్‌గా ఉంటే, కలర్‌ టాటూలు మరింత ఆకర్షణీయంగా కనిపిస్తున్నాయి. ఇందులో చిన్న డిజైన్‌లు, సూక్ష్మ అక్షరాలతో మినిమలిస్ట్‌ టాటూలు, మనుషులు, జంతువుల ముఖాలు, ప్రకృతి దృశ్యాలతో రియలిస్టిక్‌ టాటూలు రూపుదిద్దుకుంటున్నాయి. సంప్రదాయ గిరిజన శైలితో ట్రైబల్‌ టాటూలు, విభిన్న ఆకృతులు, రేఖల సమ్మేళనంతో జియోమెట్రిక్‌ టాటూ.., అంతేకాకుండా రంగుల మేళవింపుతో వాటర్‌కలర్‌ టాటూలు సందడి చేస్తున్నాయి. ఇటీవలి కాలంలో 3డీ టాటూలు, గ్లో ఇన్‌ ద డార్క్‌ టాటూలు ట్రెండ్‌గా మారుతున్నాయి.

కెరీర్‌గా.. టాటూ ఆర్టిస్ట్‌! 
నగరంలో టాటూ కల్చర్‌ వేగంగా విస్తరిస్తోంది. జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, గచి్చ»ౌలి వంటి ప్రాంతాల్లో హైఎండ్‌ టాటూ స్టూడియోలు ఉన్నాయి. సెలబ్రిటీలు, యూత్‌ ప్రభావంతో లాభదాయక వ్యాపారంగా మారింది. టాటూ ఆరి్టస్ట్‌ ఓ ప్రత్యేక కెరీర్‌గా మారింది. ఫ్యాషన్‌ ఇండస్ట్రీలో టాటూ ఒక కీలక భాగంగా మారింది. ర్యాంప్‌ వాక్‌లు, ఫొటోషూట్లు, బ్రాండింగ్‌లో టాటూలు వ్యక్తిత్వాన్ని హైలైట్‌ చేస్తున్నాయి. టాటూ అంటే స్వీయ వ్యక్తీకరణకు ఒక మాధ్యమంగా మారింది.  

సున్నితమైన ప్రదేశాల్లో సేఫేనా..?! 
టాటూ వేసుకోవడంలో చేతులు, భుజాలు, వెన్ను, మెడ వంటి ప్రదేశాలు సాధారణం. కానీ ఇటీవల కాలంలో కళ్లలో (ఐబాల్‌ టాటూ), నాలుక, పెదాలు, చెవుల వెనుక.. ఇలా అత్యంత సున్నిత ప్రాంతాల్లోనూ టాటూలు వేయించుకుంటున్నారు. అయితే వైద్య నిపుణుల ప్రకారం సున్నిత ప్రదేశాల్లో టాటూ వేయించుకోవడం తీవ్ర ప్రమాదాలకు దారితీసే అవకాశం 
ఉంది. దృష్టి కోల్పోవడం, ఇన్ఫెక్షన్లు, నరాల సమస్య వంటి ప్రమాదాలు తప్పవని హెచ్చరిస్తున్నారు.. టాటూ రంగంలో ఆధునాతన టెక్నాలజీ అందుబాటులోకి వచి్చంది. స్కిన్‌ ఫ్రెండ్లీ ఇంక్స్, డిజిటల్‌ డిజైన్‌ ప్రివ్యూలు, నొప్పి తగ్గించే టెక్నిక్స్‌ టాటూలను మరింత సురక్షితంగా మార్చాయి. కొన్ని స్టూడియోలు పూర్తి మెడికల్‌ స్టాండర్డ్స్‌తో పనిచేస్తుండటం విశేషం. ఇటీవల ఒక వ్యక్తి కంట్లోనే టాటూ వేయించుకున్న ఘటన సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. వైద్యుల సలహాతో అధునాతన పద్ధతిలో నేపాల్‌ వెళ్లి మరీ టాటూ వేయించుకున్నాడు. అతను స్వయంగా టాటూ ఆరి్టస్టు కావడం గుర్తించాల్సిన అంశం.

సరి్టఫైడ్‌ టాటూ ఆర్టిస్ట్లు.. 
టాటూ వేయించుకునే ముందు జాగ్రత్తలు తప్పనిసరి అంటున్నారు ఆరోగ్య నిపుణులు. టాటూ ఫ్యాషన్‌ అయినా, జీవితాంతం ఉండే గుర్తు. టాటూ వేసుకునే ముందు ముఖ్యంగా సర్టిఫైడ్, అనుభవజ్ఞుడైన టాటూ ఆరి్టస్ట్‌ను మాత్రమే ఎంపిక చేసుకోవాలి. స్టెరిలైజ్డ్‌ సూదులు, సేఫ్‌ ఇంక్‌ ఉపయోగిస్తున్నారా అనేది ప్రధానం. స్కిన్‌ అలర్జీ టెస్ట్‌ చేయించుకోవడం మంచిది. టాటూ తర్వాత ఇచ్చే ఆఫ్టర్‌ కేర్‌ సూచనలు తప్పక పాటించాలి.

నచ్చకుంటే లేజర్‌ రిమూవల్‌.. 
అప్పుడెప్పుడో వేసుకున్న టాటూ ప్రస్తుతం నచ్చకపోతే..? దీనికి పరిష్కారం లేజర్‌ టాటూ రిమూవల్‌. లేజర్‌ టెక్నాలజీ ద్వారా టాటూను దశలవారీగా తొలగిస్తారు. అయితే ఇది పూర్తిగా రిస్క్‌ ఫ్రీ కాదు. స్కిన్‌ డార్కెనింగ్, మచ్చలు వంటి సమస్యతో పాటు ఖర్చుతో కూడినది. డాక్టర్‌ సలహాతో మాత్రమే చేయించుకోవాలి. నగర జీవనంలో స్టైల్‌ స్టేట్‌మెంట్‌గా మారినప్పటికీ ఈ ట్రెండ్‌ అనుసరించే ముందు సరైన జాగ్రత్తలు పాటించాలని, ఎందుకంటే ఫ్యాషన్‌ క్షణికం, కానీ టాటూ జీవితాంతం అంటున్నారు నిపుణులు.  

 

Videos

తిరుమల లడ్డులో కొవ్వు కలవలేదని బాధపడిన ఇద్దరు వ్యక్తులు వాళ్ళే..

తూచ్.. మనసు మార్చుకున్నా..

అగ్ని ప్రమాదం.. బస్సులో 39 మంది ప్రయాణికులు

12 ఏళ్ల బాలికపై గంజాయి బ్యాచ్ గ్యాంగ్ రేప్

మాజీ మంత్రి జోగి రమేష్ పై కూటమి సర్కార్ కక్షసాధింపు

వాళ్లూ.. ఉపాధ్యాయులే.. సుప్రీంకోర్టు చారిత్రాత్మక తీర్పు..

2026లో ప్రపంచం అంతమేనా.. బాబా వంగా అంచనాల వెనుక!!

బాబు హయాంలోనే కల్తీ.. కూటమికి షాకిచ్చిన CBI

నారా బాబా 9 దొంగలు..! పుణ్యశీల అదిరిపోయే సెటైర్లు

చంద్రబాబుకు వణుకు పుట్టేలా 300 కార్లతో అంబటి ఇంటికి కాపు నేతలు

Photos

+5

కొత్త సినిమా ప్రారంభోత్సవంలో సాయి పల్లవి, శ్రీలీల (ఫొటోలు)

+5

అండర్-19 ప్రపంచ కప్ గెలిచిన భారత్..వైభవ్ సూర్యవంశీ రికార్డుల మోత (ఫొటోలు)

+5

ఐస్‌క్రీం ఈవెంట్ లో సినీ నటి రీతూవర్మ సందడి (ఫొటోలు)

+5

హైదరాబాద్ : ఆభరణాల ప్రదర్శనలో మోడల్స్ సందడి (ఫొటోలు)

+5

జగన్‌ రాకతో జన జాతరను చూశారా? (ఫొటోలు)

+5

హైదరాబాద్ : షాపింగ్ మాల్ ఓపెనింగ్‌లో హీరోయిన్ శ్రీలీల సందడి (ఫొటోలు)

+5

#WPL2026 : ఫైనల్లో ఆర్సీబీ విజయం..రూ. 6 కోట్లు ప్రైజ్‌మనీ (ఫొటోలు)

+5

హైదరాబాద్ లో ఉన్న ఈ అద్భుతమైన ఆలయం గురించి తెలుసా? (ఫొటోలు)

+5

బంజారాహిల్స్‌ : సజ్జనర్‌ సార్‌.. నేనూ పోలీసింగ్‌ చేస్తా.. (ఫొటోలు)

+5

తిరుమల శ్రీవారిని దర్శించుకున్న సినీ నటి మీనాక్షి చౌదరి (ఫొటోలు)