దాడులను మళ్లీ రిపీట్ చేస్తాం.. గల్లా మాధవి అంబటికి వార్నింగ్..
Breaking News
మారుతి కారు.. అమ్మకాలు జోరు!
Published on Tue, 02/03/2026 - 16:47
మారుతి సుజుకి.. మార్కెట్లో విక్టోరిస్ కారు అమ్మకాల్లో సరికొత్త రికార్డ్ క్రియేట్ చేసింది. సెప్టెంబర్ 2025లో లాంచ్ అయిన ఈ మోడల్ కేవలం నాలుగు నెలల కాలంలో 50,000 సేల్స్ సాధించగలిగింది. జనవరి 2026లో దీని అమ్మకాలు 15240 యూనిట్లు. నవంబర్ & డిసెంబర్లలో అమ్మకాలు వరుసగా 12,300 & 6,210 యూనిట్లు.
మారుతి సుజుకి విక్టోరిస్.. మంచి డిజైన్, లేటెస్ట్ ఫీచర్స్ పొందుతుంది. ఈ కారు ధరలు రూ.10.50 లక్షల నుంచి రూ. 19.98 లక్షల మధ్య (ఎక్స్-షోరూమ్) ఉంది. ఇది మొత్తం మూడు పవర్‌ట్రెయిన్ ఎంపికలతో లభిస్తుంది. ఇందులోని 1.5-లీటర్ పెట్రోల్ ఇంజిన్ మైల్డ్-హైబ్రిడ్, స్ట్రాంగ్ హైబ్రిడ్, CNG టెక్నాలజీతో అందుబాటులో ఉంటుంది. ఇంజిన్ 5-స్పీడ్ మాన్యువల్ గేర్‌బాక్స్, 6-స్పీడ్ ఆటోమేటిక్ యూనిట్, e-CVT ట్రాన్స్మిషన్ ఎంపికలతో అందుబాటులో ఉంటుంది.
మైల్డ్-హైబ్రిడ్ టెక్‌తో కూడిన 1.5-లీటర్ ఇంజిన్ 5-స్పీడ్ మాన్యువల్ గేర్‌బాక్స్ & 6-స్పీడ్ ఆటోమేటిక్ యూనిట్‌తో లభిస్తుంది. స్ట్రాంగ్ హైబ్రిడ్ వెర్షన్ e-CVTని పొందుతుంది, పెట్రోల్-CNG మోడల్ 5-స్పీడ్ మాన్యువల్ గేర్‌బాక్స్‌తో వస్తుంది. ఇవన్నీ మంచి పనితీరును అందిస్తాయి.
Tags : 1