Breaking News

మన ‘స్వీటు’ హాటు!

Published on Tue, 02/03/2026 - 12:50

ఆహార పదార్థాల్లో ప్రపంచ ప్రసిద్ధిగాంచిన నగరంలో వివిధ రకాల స్వీట్లు ఆహార ప్రియులను ఆకర్షిస్తున్నాయి. దీంతో పాటు దేశంలో వివిధ ప్రాంతాలకు చెందిన సంప్రదాయ స్వీట్లకూ నగరంలో భారీ డిమాండ్‌ ఉంది. అయితే వీటిలో కొన్నింటిపై బంగారం, వెండి పూతతో ఆకర్షణీయమైన స్వీట్లు తయారు చేస్తుంటారు. విలాసవంతమైన జీవన శైలిలో భాగంగా వీటిని తినేందుకు ఆసక్తి చూపుస్తుంటారు నగరవాసులు. అయితే ఈ పూతలో అసలైన మెంటల్స్‌ కాకుండా వాటికి ప్రత్యామ్నాయంగా వేరే లోహాలను వినియోగిస్తున్నారు. తళుక్కున మెరుస్తూ ఎంతో ఆకర్షణీయంగా కనిపించే వివిధ రకాల స్వీట్ల మెరుపుల వెనుక ఉన్నది అసలైన లోహాలేనా? బంగారం, వెండి ధరలు ఆకాశాన్నంటుతున్న క్రమంలో ఇది సాధ్యమేనా? ప్రత్యామ్నాయ పూతలో ఉండే లోహాలేంటి? వాటి వల్ల ఆరోగ్యానికి కలిగి నష్టాలేంటి? తెలుసుకుందాం..

 

హైదరాబాద్‌ అంటే బిర్యానీ మాత్రమే కాదు.. పండుగలకు, శుభకార్యాలకు నోరూరించే స్వీట్లూ ఫేమస్సే. ముఖ్యంగా వింధులో వెండి పూతతో మెరిసే స్వీట్లను విలాసవంతమైన జీవన శైలిలో భాగంగా భావిస్తుంటారు. కాజూ కత్లీ నుంచి మోతీచూర్‌ లడ్డూ వరకు.. మెరిసే వెండి పూత లేకపోతే ఆ స్వీట్‌కు సంపూర్ణత లేదన్న భావన చాలా మందిలో ఉంది. అయితే ఇటీవల కాలంలో స్వీట్‌ షాపుల కౌంటర్లలో స్పష్టమైన మార్పు కనిపిస్తోంది. దీనికి కారణం మిఠాయి రుచిలో మార్పు కాదుం.. వెండి ధరల పెరుగుదలంతో ధరల్లోనూ భారీ మార్పులు కనిపిస్తున్నాయి. ఫలితంగా పూత (సిల్వర్‌ వర్క్‌) తయారీ ఖర్చు పెరిగింది. ఇది నేరుగా స్వీట్‌ ధరలపై ప్రభావం చూపుతోంది. 

పూత ఐచ్ఛికమే..  
ఇప్పటి వరకూ బంగారం, వెండి పూత స్వీట్స్‌ అనేవి సాధారణమే. పండుగ, శుభకార్యాల ఆర్డర్లలో ఇవి తప్పనిసరి ఐనప్పటికీ ఈ పూత గురించి అంతంగా ఆలోచించేవారు కాదు. కానీ ఇకపై పూత ఐచ్ఛికం కానుంది. అదనపు చార్జ్‌లతో మాత్రమే వీటిపూత అందుబాటులో ఉండనుందని కొందరు వ్యాపారులు చెబుతున్నారు. స్వీట్‌ వ్యాపారులు కూడా ఖర్చు – లాభం మధ్య సమతుల్యతతో లోహాల వినియోగాన్ని తగ్గిస్తున్నామని చెబుతున్నారు. ఐతే కొన్నిచోట్ల పూర్తిగా మానేశారు. ఉల్లి రేటు పెరిగినప్పుడు బిర్యానీలోకి ఆనియన్‌ సలాడ్‌ తగ్గినట్టే, బంగారం, వెండి ధరల పెరుగుదలతో స్వీట్లపై మెరుపు తగ్గుతోంది. 

శరీరానికి అవసరమా? 
చాలామందిలో ఉన్న అపోహ ఏమిటంటే.. ‘బంగారం, వెండి వంటి లోహాలు శరీరానికి మంచిది’ అనుకుంటారు. వాస్తవానికి బంగారం, వెండి పూతతోగానీ, ఆ లోహంతోగానీ మన శరీరానికి ఎటువంటి ఉపయోగమూలేదు. శరీరానికి అవసరమైన ఖనిజాల జాబితాలో బంగారం, వెండి వంటివి లేవు. అలా అని పోషకాహారమూ కాదు. అయితే చిన్న మోతాదులో బంగారం, వెండి విషపూరితం కాదు. జీర్ణాశయంపై∙ ఎటువంటి ప్రభావం చూపదు. అయితే మోతాదు మించితే ప్రమాదం అంటున్నారు వైద్యులు. దీనికి తోడు ఈ పూతలో ఈ175 అనే పదార్థాన్ని వినియోగిస్తారు. ఇది ఒక మైక్రాన్‌ని మించి ఉండకూడదు.

ఉపయోగం ఉందా.. ?
అయితే ముఖ్యంగా తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే.. బంగారం, వెండిలో యాంటీబ్యాక్టీరియల్‌ లక్షణాలు ఉన్నాయని కొన్ని అధ్యయనాలు సూచిస్తున్నాయి. ఈ లక్షణం కారణంగా స్వీట్లు త్వరగా పాడవ్వవు. అందుకే స్వీట్లపై ఈ తరహా పూత పూస్తుంటారు. అయితే ఇది ఆరోగ్య అవసరం కాదని మనం గ్రహించాలి. కేవలం ఇదో అలంకరణ మాత్రమే. ఈ లోహాలను తీసుకోవడం వల్ల కేలరీలు, విటమిన్లు, న్యూట్రిషనల్‌ వేల్యూస్‌ ఏమీ ఉండవని గ్రహించాలి. అయితే కొందరు నిర్వాహకులు తక్కువ ధరకు దొరికే పూతను వినియోగిస్తున్నారు. ఇందులో అల్యూమినియం, నికిల్, లెడ్‌ వంటి ప్రమాదకరమైన లోహాలను వినియోగిస్తున్నారు. ఇవి ఆరోగ్యాన్ని దెబ్బతీస్తాయని ఆహార నిపుణులు హెచ్చరిస్తున్నారు.

ప్రత్యామ్నాయ డెకరేషన్‌.. 
ఆరోగ్యంపై స్పృహ పెరగడంతో గత కొంతకాలంగా ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషిస్తున్నారు పలువురు వినియోగదరులు, నిర్వాహకులు. ఇందులో భాగంగా డ్రై ఫ్రూట్‌ డెకొరేషన్, చాక్లెట్‌ కోటింగ్, నేచురల్‌ కలర్స్, ఫ్యూజన్‌ స్వీట్లు..!! అంటే వెండి మెరుపు స్థానంలో డిజైన్, ఇన్నోవేషన్‌కు చోటు కల్పిస్తున్నారు.

స్వీట్లపై ఉండేది నిజమైన లోహాలేనా? 
వాస్తవానికి స్వీట్లపై ఉండేది నిజమైన బంగారం, వెండేనా..?! అన్న ప్రశ్న మనలో ఎంతమందికి వచి్చంది. స్వీట్లపై వాడే పూతను గోల్డ్, సిల్వర్‌ వర్క్‌ (చాంద్‌ కా వర్క్‌) అంటారు. అయితే దీనికి ఫుడ్‌–గ్రేడ్‌ గోల్డ్, సిల్వర్‌ వర్క్‌ 99 శాతం శుద్ధమైన బంగారం, వెండి వినియోగించాలని నిపుణులు చెబుతున్నారు. ఇది అతి సూక్ష్మమైన (మైక్రాన్లు) లోహంతో పలుచగా ఉంటుంది. ఆహార భద్రతా ప్రమాణాల ప్రకారం దీనిని తయారు చేస్తారు. అయితే గతంలో కొన్ని చోట్ల అల్యూమినియం, నకిలీ మెటాలిక్‌ షీట్స్, ఇండ్రస్టియల్‌ ఫాయిల్‌ వాడిన ఘటనలూ లేకపోలేదు.

లైఫ్‌స్టైల్‌లో మెరుపులకు ప్రాధాన్యం..
హైదరాబాద్‌ వంటి మెట్రో నగరాల్లో ఫుడ్‌ అనేది కేవలం ఆకలి తీర్చడమే కాదు.. ఇదో స్టేటస్‌ సింబల్‌గా మారిపోయింది. వెండి, బంగారు పూత ఉన్న స్వీట్‌ అంటే ఆ ప్రత్యేకతే వేరు అన్నట్లు కొందరి ఆలోచనా సరళి ఉంది. ఇదొక ఖరీదైన గిఫ్ట్‌గా గుర్తింపు పొందడంతో పాటు శుభకార్యాల్లోనూ ఆర్భాటానికి ప్రతిగా నిలుస్తోంది. అందుకే వెండిపూత లేకపోతే రుచి మారకపోయినా, విలాసం తగ్గిన భావన వినియోగదారుల్లో కలుగకమానదు.  

#

Tags : 1

Videos

జైల్లో అంబటిని కలిసిన ముద్రగడ

అంబటి అల్లుడు,కూతురుని పరామర్శించిన అనిల్ కుమార్ యాదవ్

ఎవర్ని వదిలిపెట్టం.. బైరెడ్డి వార్నింగ్

KTR: 2 లక్షల ఉద్యోగాలు ఎక్కడ? జాబ్ క్యాలెండర్ కు పాతర

మీకు దమ్ముంటే.. బాధితురాలి సంచలన సెల్ఫీ వీడియో..

Brahmaji : నావల్లే పూరి సినిమా ప్లాప్ అయ్యింది

Thanuja : ప్లీజ్ అలా అనడం మానేయండి.. నరకం అనుభవిస్తున్నా..

ప్రపంచంలోనే అత్యంత ప్రమాదకర ఎయిర్ పోర్టులు

దేశం నుంచి వెళ్లిపోండి.. వాట్సాప్ కు సుప్రీంకోర్టు వార్నింగ్

Vidadala: మాపై దాడి చేసి తిరిగి మాపైనే కేసులు పెట్టారు

Photos

+5

హీరోయిన్ జెనీలియా పెళ్లి జ్ఞాపకాలు (ఫొటోలు)

+5

తిరుమల శ్రీవారిని దర్శించుకున్న సినీ ప్రముఖులు (ఫొటోలు)

+5

'హనీ' ఈవెంట్‌లో అందంగా దివి (ఫొటోలు)

+5

'కపుల్ ఫ్రెండ్లీ' ట్రైలర్‌ ఈవెంట్‌ లో మెరిసిన హీరోయిన్‌ మానస వారణాసి (ఫొటోలు)

+5

నిర్మల్‌ : ఘనంగా ముజ్గి మల్లన్న జాతర (ఫొటోలు)

+5

’వెరైటీ ఇండియా పార్టీ‘లో మెరిసిన బాలీవుడ్ తారలు (ఫొటోలు)

+5

'కపుల్ ఫ్రెండ్లీ' మూవీ ట్రైలర్‌ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

ధనుష్‌ 55వ సినిమా.. శ్రీలీల, సాయి పల్లవి క్రేజీ ఫోటోలు

+5

ఈషా రెబ్బా 'ఓం శాంతి' జ్ఞాపకాలు (ఫొటోలు)

+5

దుబాయిలో చిల్ అయిపోతున్న దివ్య భారతి (ఫొటోలు)