Breaking News

రష్యా నుంచి మళ్లీ చమురు దిగుమతి

Published on Fri, 01/30/2026 - 12:03

ప్రపంచంలోనే అతిపెద్ద రిఫైనింగ్ కాంప్లెక్స్ ఆపరేటర్ అయిన రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ ఫిబ్రవరి నుంచి రష్యా ముడి చమురు దిగుమతులను తిరిగి ప్రారంభించనుంది. దేశీయ మార్కెట్ అవసరాలను తీర్చే లక్ష్యంతో రోజుకు సుమారు 1,50,000 బ్యారెళ్ల వరకు రష్యన్ చమురును కొనుగోలు చేయాలని కంపెనీ నిర్ణయించింది. గోవాలో జరుగుతున్న ‘ఇండియా ఎనర్జీ వీక్’ సందర్భంగా రిలయన్స్ ఉన్నతాధికారి ఒకరు ఈ వివరాలను వెల్లడించారు.

ఆంక్షలకు లోబడే కొనుగోళ్లు

గతంలో రష్యా చమురు దిగ్గజాలైన రోస్ నెఫ్ట్, లుకోయిల్ సంస్థలపై అమెరికా ఆంక్షలు విధించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో రిలయన్స్ గత డిసెంబర్ తర్వాత రష్యా నుంచి దిగుమతులను తాత్కాలికంగా నిలిపివేసింది. అయితే ప్రస్తుతం అమెరికా ఆంక్షల పరిధిలోకి రాని విక్రేతలు, వాణిజ్య మధ్యవర్తుల ద్వారా తిరిగి రష్యా నుంచి చమురును సేకరించాలని రిలయన్స్ భావిస్తోంది. ‘ఫిబ్రవరి, మార్చి నెలల్లో అంతర్జాతీయ నిబంధనలు, ఆంక్షలకు లోబడి ఉన్న రష్యన్ చమురును రిలయన్స్ కొనుగోలు చేయనుంది’ అని రాయిటర్స్ నివేదిక తెలిపింది.

జామ్ నగర్ రిఫైనరీ సామర్థ్యం

గుజరాత్‌లోని జామ్ నగర్‌లో ఉన్న రిలయన్స్ రిఫైనరీ కాంప్లెక్స్ రోజుకు 1.4 మిలియన్ బ్యారెళ్ల చమురును శుద్ధి చేసే సామర్థ్యాన్ని కలిగి ఉంది. గతంలో రోస్ నెఫ్ట్‌తో కుదుర్చుకున్న దీర్ఘకాలిక ఒప్పందం ప్రకారం రోజుకు 5,00,000 బ్యారెళ్ల వరకు రష్యా చమురును దిగుమతి చేసుకునేది. ప్రస్తుతం మారుతున్న భౌగోళిక రాజకీయ పరిస్థితుల దృష్ట్యా రిలయన్స్ తన సరఫరా వనరులను వైవిధ్యపరుచుకుంటోంది.

టర్మ్ డీల్స్ ద్వారా నిరంతర సరఫరా కోసం సౌదీ అరేబియా, ఇరాక్ నుంచి చమురు కొనుగోలు చేస్తోంది. కొంతభాగం ఉత్తర అమెరికా-​కెనడా నుంచి చమురు సేకరిస్తోంది. వెనిజువెలా ముడి చమురును తిరిగి దిగుమతి చేసుకునేందుకు అమెరికా అనుమతి కోసం రిలయన్స్ ఇప్పటికే దరఖాస్తు చేసుకుంది.

ఇదీ చదవండి: అలసిన పసిడి ధరలు.. తులం ఎంతంటే..

Videos

CheviReddy: కూటమిపై తిరుగుబాటు.. రాబోయే స్థానిక ఎన్నికల్లో గుణపాఠం

Donald : ఆయన భార్య అందగత్తె.. అందుకే పదవి ఇచ్చా!

Vidadala: పోలీసులకు ముడుపులు ఎమ్మెల్యే ప్రత్తిపాటి ఆధ్వర్యంలో పేకాటలు

Chitoor: స్కూల్ బస్సును ఢీకొట్టిన కంటైనర్ 30 మంది విద్యార్థులకు గాయాలు

ఫోన్ ట్యాపింగ్ కేసుపై డీకే అరుణ షాకింగ్ కామెంట్స్

ఫామ్ హౌస్ కు జగదీశ్వర్ రెడ్డి కేసీఆర్‌తో కీలక భేటీ

Prof Nageshwar: విచారణ చేయకుండా కల్తీ జరిగిందని ఎలా చెప్తారు?

దేవుడితో పెట్టుకొని మహా పాపం చేశారు బాబును బోనులో నిలబెట్టాల్సిందే!

రోజులు లెక్కపెట్టుకోండి..!! పోలీసులకు పాడి కౌశిక్ రెడ్డి వార్నింగ్

Tirumala Laddu: బయటపడ్డ బాబు భోలే బాబా డెయిరీ రహస్యం ఇవిగో ఆధారాలు

Photos

+5

అరుణాచలంలో సందీప్ మాస్టర్ ఫ్యామిలీ (ఫొటోలు)

+5

తిరుమల శ్రీవారిని దర్శించుకున్న భారత మాజీ క్రికెటర్‌ శ్రీకాంత్‌ (ఫోటోలు)

+5

సందడి సందడిగా మేడారం జాతర..కిక్కిరిసిన భక్తులు (ఫొటోలు)

+5

సికింద్రాబాద్‌ దగ్గరలో ఉన్న ఈ ప్రసిద్ధ ఆలయాన్ని ఎప్పుడైనా దర్శించుకున్నారా? (ఫొటోలు)

+5

చీరలో వావ్ అనేలా స్రవంతి (ఫొటోలు)

+5

పారిస్ వీధుల్లో సందడిగా హీరోయిన్ 'స్నేహ' ఫ్యామిలీ (ఫోటోలు)

+5

ఉయ్యూరు : నేత్ర పర్వం.. ఊయల ఉత్సవం (ఫొటోలు)

+5

బేగంపేటలో ఆకట్టుకుంటున్న వింగ్స్‌ ఇండియా ప్రదర్శన (ఫొటోలు)

+5

రెచ్చిపోయిన ఆర్సీబీ బౌలర్లు.. ఫైనల్లో RCB ..(ఫొటోలు)

+5

రంగస్థలం బ్యూటీ పూజిత పొన్నాడ లేటేస్ట్ పిక్స్ (ఫొటోలు)