జగనన్న పథకాలన్నీ చోరీ చేసి..దొంగ నాటకాలు... నాగార్జున యాదవ్ ఫైర్
Breaking News
పెప్సికో ఇండియా కీలక బాధ్యతల్లో సవితా బాలచంద్రన్
Published on Sat, 01/24/2026 - 14:47
ఎఫ్.ఎమ్.సి.జి (FMCG) దిగ్గజం పెప్సికో సవిత బాలచంద్రన్‌ను భారతదేశం మరియు దక్షిణాసియా చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్‌గా నియమిస్తున్నట్లు ప్రకటించింది. పెప్సికో నుంచి కౌశిక్ మిత్రా పదవీవిరమణ చేస్తున్న నేపథ్యంలో పెప్సికో ఈ కీలక నియామకాన్ని ప్రకటించింది. ఈ ఏడాది ఏప్రిల్ 15 నుంచి బాధ్యతలు చేపడతారని కంపెనీ ఒక ప్రకటనలో తెలిపింది. ఫైనాన్స్ స్ట్రాటజీ (ఆర్థిక వ్యూహం), గవర్నెన్స్ , పెర్ఫార్మెన్స్ మేనేజ్‌మెంట్‌ను ఆమె పర్యవేక్షిస్తారు.
బాలచంద్రన్ నియామకాన్ని స్వాగతిస్తూ, ఇండియా & సౌత్ ఆసియాలో కంపెనీ తన తదుపరి దశ వృద్ధిని వేగవంతం చేస్తున్నందున ఆర్థిక, వ్యూహం మరియు విలువ సృష్టిలో ఆమె నైపుణ్యం చాలా కీలకమని పెప్సికో తెలిపింది. పెప్సికో ఇండియా & సౌత్ ఆసియా CFOగా నియమితులైన సంగతిని లింక్డ్ఇన్ పోస్ట్ ద్వారా ప్రకటించిన సవితా బాలచంద్రన్ తన కరియర్‌లో ఇదొక ఉత్సాహకరమైన కొత్త అధ్యాయానికి నాందిగా అభివర్ణించారు.
ఎవరీ సవితా బాలచంద్రన్
దశాబ్దాల అనుభవం ఉన్న అనుభవజ్ఞురాలైన ఫైనాన్స్ ప్రొఫెషనల్. పెప్సికోలో చేరడానికి ముందు, ఐదేళ్లకు పైగా టాటా టెక్నాలజీస్‌లో సీఎఫ్‌వోగా పనిచేశారు. ఆర్థిక ప్రణాళిక, రిస్క్ మేనేజ్‌మెంట్ మరియు వ్యూహాత్మక నిర్ణయం తీసుకోవడానికి బాధ్యత వహించారు.టాటా టెక్నాలజీస్‌లో CFOగా ఎంపిక కావడానికి ముందు ఆమె టాటా మోటార్స్‌లో సీనియర్ ఫైనాన్స్ పాత్రలను నిర్వహించారు.
అంతకుమందు ఆమె టాటా మోటార్స్‌లో 18 సంవత్సరాలకు పైగా పనిచేశారు, ఫైనాన్స్, కార్పొరేట్ వ్యూహం మరియు వ్యాపార కార్యకలాపాలలో సీనియర్ నాయకత్వ పాత్రలను నిర్వహించారు. టాటా గ్రూప్‌లో ,సుదీర్ఘ పదవీకాలం ప్రపంచ మార్కెట్లు, తయారీ ఆధారిత వ్యాపారాలు మరియు పరివర్తన-ఆధారిత వృద్ధి అంశాలో లోతైన అవగాహన ఆమె సొంతం.
బెంగళూరులోని మౌంట్ కార్మెల్ కాలేజీ నుండి కామర్స్‌లో గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారు. పూణేలోని Symbiosis (SCMHRD) నుండి ఫైనాన్స్‌లో పోస్ట్ గ్రాడ్యుయేట్ డిప్లొమా (MBA) పొందారు. అలాగే అమెరికా కార్నెగీ మెల్లన్ యూనివర్శిటీ నుండి Fulbright-CII Fellowship కూడా పొందారు.
Tags : 1