జగనన్న పథకాలన్నీ చోరీ చేసి..దొంగ నాటకాలు... నాగార్జున యాదవ్ ఫైర్
Breaking News
వెయిట్ ట్రయినింగ్ బ్రెయిన్‌కూ బెటరే
Published on Sat, 01/24/2026 - 05:51
కండరాల బలం కోసం స్ట్రెంత్ ట్రయినింగ్ లేదా వెయిట్ ట్రయినింగ్ తప్పనిసరి అనే విషయం చాలాసార్లు వినే ఉంటాం. అయితే స్ట్రెంత్ ట్రయినింగ్ అనేది మజిల్ లాస్‌ను రివర్స్ చేయడమే కాదు మెదడు ఆరోగ్యానికి కూడా ఉపకరిస్తుందని, వయసు పెరిగినా మెదడు చురుగ్గా పనిచేసేలా చేస్తుందని తాజా అధ్యయనం తెలియజేస్తోంది. ఈ అధ్యయనాన్ని వాషింగ్టన్ యూనివర్శిటీలోని ఓ పరిశోధక బృందం నిర్వహించింది.
1,164 మందిపై...
యాభై ఐదు లేదా అంతకంటే ఎక్కువ వయసు ఉన్న 1,164 మంది స్త్రీ, పురుషులపై వాషింగ్టన్ పరిశోధక బృందం ఈ అధ్యయనం నిర్వహించింది. వీరిని రెండు గ్రూపులుగా విభజించారు. ఒక గ్రూప్‌కి వారానికి రెండుసార్లు వెయిట్ ట్రయినింగ్ చేయడం అలవాటు. రెండో గ్రూప్‌నకు ఈ అలవాటు లేదు, మొదటి గ్రూపు వారు జ్ఞాపకశక్తి పరీక్షలో మెరుగ్గా రాణించారు. వెయిట్ ట్రయినింగ్ చేయని వారితో పోల్చితే చేసేవారు ఆరోగ్యకరమైన మెదడు న్యూరాన్లను కలిగి ఉన్నారు.
స్ట్రెంత్ ట్రయినింగ్ అంటే?
డంబెల్స్, బార్బెల్స్, ఒక మోస్తరు బరువులు, రెసిస్టెంట్ బ్యాండ్, బాడీ వెయిట్
(ఉదా: పుషప్‌లు), వాటర్‌బాటిల్స్, బ్రిక్స్‌తో చేసే వ్యాయామం.
మతిమరుపునకు దూరంగా...
వెయిట్ ట్రయినింగ్ అనేది మెదడు ఆరోగ్యాన్ని మెరుగు
పరచడానికి వివిధ న్యూరోప్రొటెక్టివ్, యాంటీ ఇన్ఫ్లమేటరీ కారకాలను ఉత్పత్తి చేస్తుందని, డిమెన్షియా (మతిమరుపు)ను దూరం చేస్తుందని చెబుతున్నారు పరిశోధకులు.

ఉపయోగాలు
మెదడుపై వెయిట్ ట్రయినింగ్ ఏ రకంగా ప్రభావం చూపుతుందంటే...
ఏకాగ్రతను పెంచుతుంది
జ్ఞాపకశక్తిని వృద్ధి చేస్తుంది
ఒత్తిడిని తగ్గిస్తుంది
నాడుల రక్షణకు ఉపయోగపడుతుంది
Tags : 1