పట్టాలెక్కిన అమృత్ భారత్ ఎక్స్‌ప్రెస్ జెండా ఊపిన ప్రధాని
Breaking News
మెప్పించని వినోదం
Published on Fri, 01/23/2026 - 05:09
న్యూఢిల్లీ: ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2025–26) మూడో త్రైమాసికంలో మీడియా రంగ దిగ్గజం జీ ఎంటర్‌టైన్‌మెంట్(జీల్) ఆసక్తికర ఫలితాలు ప్రకటించింది. అక్టోబర్–డిసెంబర్(క్యూ3)లో కన్సాలిడేటెడ్ నికర లాభం 5 శాతం నీరసించి రూ. 155 కోట్లకు పరిమితమైంది. నిర్వహణ వ్యయాలు పెరగడం ప్రభావం చూపింది. గతేడాది(2024–25) ఇదే కాలంలో రూ. 164 కోట్లు ఆర్జించింది. నిర్వహణ ఆదాయం మాత్రం 15 శాతం బలపడి రూ. 2,299 కోట్లకు చేరింది. సబ్‌్రస్కిప్షన్‌సహా ఇతర అమ్మకాలు, సర్వీసులు ఇందుకు దోహదపడ్డాయి.
మూవీ హక్కులు కొనుగోలు చేయడం, ఐఎల్ టీ20 లీగ్ మ్యాచ్‌లలో మార్పులు, కొత్త కంటెంట్‌ను ప్రవేశపెట్టడం తదితరాల నేపథ్యంలో నిర్వహణ వ్యయాలు పెరిగినట్లు కంపెనీ పేర్కొంది. వెరసి మొత్తం వ్యయాలు 20 శాతంపైగా పెరిగి రూ. 2,087 కోట్లను దాటాయి. ఈ కాలంలో సబ్‌్రస్కిప్షన్ నుంచి 7 శాతం అధికంగా రూ. 1,050 కోట్ల ఆదాయం సాధించగా.. ప్రకటనల నుంచి 9 శాతం తక్కువగా రూ. 852 కోట్లు అందుకుంది. ఇతర అమ్మకాలు, సర్విసుల నుంచి ఆదాయం ఆరు రెట్లు ఎగసి రూ. 378 కోట్లను అధిగమించింది.
జీల్ షేరు బీఎస్‌ఈలో 4 శాతం జంప్‌చేసి రూ. 85 వద్ద ముగిసింది.
Tags : 1