ఏకంగా 15000 వేల గ్రామ సచివాలయాలు.. మన రికార్డును ఎవరూ టచ్ చెయ్యలేరు!
Breaking News
నిశ్శబ్దంగా బరువు మోస్తున్నారా?!
Published on Thu, 01/22/2026 - 05:32
నేటి రోజుల్లో ఆధునిక భారతీయ మహిళలను ఇండిపెండెంట్ విమెన్‌గా, శక్తిమంతంగా చూస్తుంటారు. ‘కానీ, నిశ్శబ్దంగా బరువు మోస్తున్న వారిది విజయ యాత్ర కాదు’ అని స్టాండప్ కమెడియన్ షారన్ వర్మ, సైకాలజిస్ట్ డాక్టర్ మేధా,ప్రొఫెసర్ విజయలక్ష్మి, అర్పితా ఘోష్.. వంటి మహిళలు తమ జీవితానుభవాల నుంచి ఒక పాఠంగా వివరిస్తున్నారు.
టీవీ ఛానెళ్లలోని ప్యానెల్ చర్చలలో, ప్రకటనల ప్రచారాలలో కనిపించే స్వతంత్ర మహిళ మనందరికీ సుపరిచితమే. ఆమె ‘అన్నీ చక్కగా నిర్వహిస్తుంది’ అని కుటుంబాలలోనూ మహిళను ప్రశంసిస్తుంటారు. కానీ, ఆమె తన గురించి ఇంకేదో తెలియజెప్పడానికి నిత్యం ప్రయత్నిస్తూనే ఉంటుంది..
‘నా బిడ్డ తన తల్లి సమర్థురాలైన మహిళ అని తెలుసుకొని ఎదగాలని నేను కోరుకుంటున్నాను’ అని 37 ఏళ్ల నేహా అరోరా చెబుతుంది. మహిళలు తమ ప్రియమైన వారి కళ్ల ద్వారా తమను తాము చూసుకుంటారు. పిల్లలు ఉన్నప్పుడు ఆ మహిళ బలంగా, ఇంటి బయట గౌరవం సంపాదించగల వ్యక్తిగా కనిపించడం చాలా ముఖ్యం. ఈ దశలో స్వతంత్ర కాంక్ష, ఒత్తిడి రెండింటినీ మహిళ మోస్తుంటుంది. స్వతంత్రంగా ఉండటం అంటే అది వ్యక్తిగత నేర్పు కాదు. బాధ్యత, బలం చూపించేదిగా, చదువుకున్నదై, ఆదర్శప్రాయంగా కూడా ఉండాలి.
దీంతో స్వాతంత్య్రం అనేది జీవించడానికి కాదు, ఒక ప్రదర్శన మాత్రమే అనేది నేహ అభిప్రాయం. ఆమె మరింతగా చెబుతూ ‘ఒకప్పుడు స్కూల్ చదువు అయిపోయాక బయటకు వచ్చి, పై చదువుల కోసం నగరంలో ఒంటరిగా ఉండటం అత్యంత సాహసోపేతమైన పని అనుకున్నాను’ అంటుంది. ఈ విధంగా సాతంత్య్రం అనే మాట చాలా మంది మహిళలకు సుపరిచితమే. మొదటి అద్దె గది, మొదటì జీతం, తెలియని వీధుల్లో ఒంటరిగా ప్రయాణించడం వల్ల కలిగే థ్రిల్, భయంతో కొత్త అవకాశాలతో తనను తాను ఆవిష్కరించుకున్నట్టు అనిపిస్తుంది. కానీ, ఇది నిజమైన స్వాతంత్య్రం కాదనేది వీరి ఆలోచన.
56 ఏళ్ల డాక్టర్ సంగీతా ఠాకూర్‌కి స్వాతంత్య్రం చాలా ముందుగానే వచ్చింది. ‘నేను చాలా చిన్న వయసులోనే స్వతంత్రురాలిని అయ్యాను. నా తల్లిదండ్రులు నన్ను ఒక రక్షణాత్మక పెంపకంలో ఉంచలేదు. భావోద్వేగపరంగా, ఆర్థికంగా స్వతంత్రంగా ఎదగాలని కోరుకున్నాను. చిన్నప్పుడు ఒంటరిగానే స్కూల్‌కి వెళ్లేదాన్ని. స్నేహితులను కలిసేదాన్ని. పెద్దల పర్యవేక్షణ నా జీవితం లేనేలేదు. విద్యార్థి దశ అంతా ఒంటరిగానే ఉన్నాను. కాలం మనల్ని వివిధ రకాలుగా మారుస్తుంది’ అని వివరిస్తుంది సంగీతా ఠాకూర్.
పాతికేళ్ల విజయలక్ష్మి సింగ్ మాట్లాడుతూ ‘నా దృష్టిలో స్వతంత్ర మహిళగా ఉండటం అంటే ఆమె చాలా డబ్బు సంపాదించడం. ప్రపంచవ్యాప్తంగా అనేక ప్రదేశాలకు ప్రయాణించడం. ప్రతి ఒక్కరినీ గౌరవించడం. కానీ స్వాతంత్య్రం బాధ్యతతో రావాలి’ అని చెబుతోంది. ఈ అవగాహన గొంతుచించుకొనే నినాదాల నుండి కాదు, పరిశీలన ఉండి వచ్చింది అంటోంది.
వ్యక్తిత్వంలోఅంతర్భాగం
అర్పితా ఘోష్ వయసు 32 ఏళ్లు. ‘బలమైన స్వతంత్ర మహిళ’ అనే పదం నాకు అసౌకర్యంగా ఉంది. దాని నిజమైన అర్థం ఏమిటో చెప్పండి. భావోద్వేగపరంగా స్వతంత్రంగా ఉండాలి. అందుకు సామాజిక ధ్రువీకరణ అవసరం లేదు. మీ జీవితం మీ తోటివారి జీవితాల మాదిరిగానే ఉండకపోవచ్చు. కానీ అదేమీ తక్కువైనది కాదు’ అంటున్నది.
‘భారతదేశంలో ముఖ్యంగా మహిళలు సాధారణంగా ఇరవైలలో వివాహం చేసుకొని ఒక రక్షత వాతావరణం నుండి, మరొక వాతావరణానికి మారేవారు. కానీ, నా ప్రయాణం అందుకు భిన్నంగా ఉంది. నేను పెద్దలు కుదిర్చిన పెళ్లి ఆలోచనను తిరస్కరించాను. ఒంటరి జీవితాన్ని ఎంచుకున్నాను. స్వాతంత్య్రం ఒక నిర్ణయం కాదు. ఒక అలవాటు. నా వ్యక్తిత్వంలో అది ఒక అంతర్భాగం’ అంటోంది ఆమె.
స్వీయ సంరక్షణ అవసరం
పాట్నా ఉమెన్స్ కాలేజీలో అసిస్టెంట్‌ప్రొఫెసర్‌గా ఉన్న మనస్తత్వవేత్త డాక్టర్ మేధా మాట్లాడుతూ ‘కుటుంబం స్త్రీలకు వారి బలాన్ని జాగ్రత్తగా చూపించాలనుకుంటుంది. దీంతో ఆమె బలం కుదించబడుతుంది. కుటుంబంలో బలం ప్రదర్శించడం కంటే పంచుకోవడంలోనే పెరుగుతుంది’ అని చెబుతుంది. ‘నేను లేకపోతే ఎలా.. అనే ఆలోచనలతో ఎదుటివారి అవసరానికి ఎంతగా అలవాటు పడ్డానంటే.. ఒక రోజు నేను లేకుండా వాళ్లు బాగానే ఉండగలరని గ్రహించడం కూడా బాధగా అనిపించింది’ అని తెలియజేసింది. స్త్రీ తన లక్ష్యాలు, సరిహద్దుల గురించి స్పష్టంగా ఉంటుందంటే అది బెదిరింపులా వినిపిస్తుంది. నేను అలా ఉండటం ద్వారా మా ఇంట్లో నన్ను స్వార్థపరురాలిగా చూస్తారు. కానీ, నేను రాజీపడను. ఇతరులకు స్వార్థపూరితంగా కనిపించేది కేవలం స్త్రీ తన సంరక్షణ తాను చూసుకున్నప్పుడే. అది స్వార్థం ఎలా అవుతుంది? అని ప్రశ్నిస్తుంది.
మహిళలకు స్వాతంత్య్రం అనేది ఒకసారి దాటిన మైలురాయి కాదు. సమతుల్యత, ఒక నిరంతర చర్య. స్వాతంత్య్రమనే బరువును నిశ్శబ్దంగా మోయడం కాదు, మోస్తున్న బరువు గురించి బిగ్గర గా చెప్పడం. ఈ బలం బరువు గుర్తించడానికి, తగిన నిర్ణయం తీసుకోవడానికి మహిళకు అర్హత ఉంది.
బాధ్యత తీసుకోమనే ఒత్తిడి తగదు
జాన్వీదూబే వయసు 20 ఏళ్లు. స్వతంత్రమైన బరువు ఊహించినదానికంటే స్పీడ్‌గా వస్తున్నట్టు భావిస్తోంది. ‘నా దృష్టిలో స్వతంత్రంగా ఉండటం అంటే నన్ను, నా తల్లిదండ్రులను జాగ్రత్తగా చూసుకునే సామర్థ్యం, ఆర్థికంగా, శారీరకంగా, భావోద్వేగపరంగా ఉండటం’ అంటోంది. చాలా మంది అమ్మాయిలు యుక్తవయసు పూర్తిగా ప్రారంభం కాకముందే స్వేచ్ఛను కోరుకుంటారు. ‘నాకు ఏదైనా కావాలనుకున్నప్పుడు అది పూర్తిగా నా ఇష్టం. నేను ఎవరినీ అడగ నవసరం లేదు.. సహాయం అవసరమైనవారిని చూస్తే వారి అనుమతి తీసుకోకుండా సాయం చేయగలను.
కానీ, నా కుటుంబం నన్ను ఇంటి పెద్ద కూతురుగా బాధ్యత తీసుకోవాలని ఒత్తిడి చేస్తూనే ఉంది. ఇది మంచి నిర్ణయం కాదు’ అంటోంది నేహ. తల్లి తన కలలను నిశ్శబ్దంగా వదులుకోవడం చూసినట్టు జాన్వి చెబుతుంది. ‘మా అమ్మ ఒక పోరాట యోధురాలు. కుటుంబం కోసం తన కలలను వదులుకోవడం చూడటం నాకు నిజమైన స్వాతంత్య్రం అంటే ఏమిటో చూపించింది. దానివల్లే నేనెప్పుడూ బలహీనంగా ఉండకూడదని నిర్ణయించుకున్నాను. ముప్పై–నలభైలలోని మహిళల గురించి మాట్లాడుతూ ‘వారి అనుభవాలను ఆరాధిస్తాను. కానీ, ఈ దశకు చేరుకోవడానికి వారు ఎంత కష్టపడాల్సి వచ్చింది అనేదే నన్ను భయపెడుతుంది’ అంటోంది.
Tags : 1