Breaking News

మోటరోలా సిగ్నేచర్ వచ్చేస్తోంది.. ఎ‍ప్పుడంటే..

Published on Thu, 01/15/2026 - 22:50

స్మార్ట్‌ఫోన్ తయారీ సంస్థ మోటరోలా తన కొత్త ప్రీమియం హ్యాండ్‌సెట్ మోటరోలా సిగ్నేచర్‌ను భారతదేశంలో జనవరి 23న అధికారికంగా విడుదల చేయనున్నట్లు ప్రకటించింది. ఈ ఫోన్ దేశంలో ప్రముఖ ఈ-కామర్స్ ప్లాట్‌ఫామ్ ఫ్లిప్‌కార్ట్ ద్వారా ప్రత్యేకంగా విక్రయానికి రానుంది. ఇటీవల కన్స్యూమర్ ఎలక్ట్రానిక్స్ షో (CES) 2026లో ఈ ఫోన్‌ను కంపెనీ ఆవిష్కరించింది.

ఫ్లిప్‌కార్ట్‌లో ఇప్పటికే మోటరోలా సిగ్నేచర్‌కు సంబంధించిన ప్రత్యేక మైక్రోసైట్‌ను అప్‌డేట్ చేశారు. దీని ద్వారా ఫోన్‌కు సంబంధించిన ముఖ్యమైన స్పెసిఫికేషన్లను కంపెనీ టీజ్ చేసింది. ఈ స్మార్ట్‌ఫోన్ క్వాల్‌కమ్ అత్యాధునిక స్నాప్‌డ్రాగన్ 8 జెన్ 5 చిప్‌సెట్‌తో పనిచేస్తుంది.

ప్రధాన ఫీచర్లు
డిస్‌ప్లే విషయానికి వస్తే, మోటరోలా సిగ్నేచర్‌లో 6.8 అంగుళాల సూపర్ HD LTPO AMOLED డిస్‌ప్లే ఉంటుంది. ఇది 1,264 x 2,780 పిక్సెల్స్ రిజల్యూషన్, 165Hz రిఫ్రెష్ రేట్, 450 ppi పిక్సెల్ డెన్సిటీతో పాటు గరిష్టంగా 6,200 నిట్స్ బ్రైట్‌నెస్‌ను అందిస్తుంది. అలాగే డాల్బీ విజన్, డాల్బీ అట్మోస్, “సౌండ్ బై బోస్” ఆడియో సపోర్ట్ ఈ ఫోన్‌ను మరింత ప్రత్యేకంగా నిలబెడతాయి.

కెమెరా విభాగంలో, ఈ ఫోన్ ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్‌తో వస్తుంది. ఇందులో 3.5x ఆప్టికల్ జూమ్ సామర్థ్యంతో కూడిన 50 మెగాపిక్సెల్ సోనీ LYT-828 సెన్సార్ ప్రధాన ఆకర్షణగా నిలుస్తుంది. డిజైన్ పరంగా, ఇది అల్యూమినియం ఫ్రేమ్‌తో 6.99 మిమీ మందంతో ఉండగా, బరువు సుమారు 186 గ్రాములు మాత్రమే.

పవర్ కోసం ఇందులో  5,200mAh సిలికాన్-కార్బన్ బ్యాటరీని అందించారు. సాఫ్ట్‌వేర్ పరంగా, ఈ ఫోన్ ఆండ్రాయిడ్ 16 ఆధారిత హలో యూఐపై నడుస్తుంది.

ధర ఇదేనా?
ధర విషయానికొస్తే, 16GB ర్యామ్ + 1TB స్టోరేజ్ వేరియంట్ బాక్స్ ధర రూ.84,999గా లీక్ అయింది. అయితే ఇది బాక్స్ ధర మాత్రమే కావడంతో, వాస్తవ రిటైల్ ధర కొంత తక్కువగా ఉండే అవకాశం ఉంది. అలాగే 12GB ర్యామ్ + 512GB స్టోరేజ్ వేరియంట్ ధర సుమారు రూ.82,000గా ఉండొచ్చని సమాచారం. అధికారిక ధరలను మోటరోలా లాంచ్ రోజున వెల్లడించనుంది.

మోటరోలా సిగ్నేచర్ పాంటోన్ మార్టిని, ఆలివ్, కార్బన్ వంటి ప్రీమియం కలర్ ఆప్షన్లలో అందుబాటులోకి రానుంది. ప్రీమియం డిజైన్, శక్తివంతమైన పనితీరు, ఫ్లాగ్‌షిప్ ఫీచర్లతో ఈ ఫోన్ హైఎండ్ సెగ్మెంట్‌లో గట్టి పోటీ ఇవ్వనుంది.

Videos

మహారాష్ట్ర మున్సిపల్ ఎన్నికల్లో మహాయుతి కూటమి భారీ విజయం

CM Revanth : ఇదేనా నీ 40 ఏళ్ల రాజకీయ చరిత్ర

సాల్మన్ పాడె మోసిన మహేష్ రెడ్డి

Medak: భార్యను కాపురానికి పంపలేదని..

Anantapur : నంబూరి వైన్స్ కేసులో ముగ్గరు టీడీపీ కార్యకర్తలు అరెస్ట్

Rachamallu: రమ్మీ, గుండాట, రికార్డింగ్ డాన్సులు ఏపీని గోవాగా మార్చేశారు

ఈనెల 19న మధ్యాహ్నం నామినేషన్ల స్వీకరణ

Peddareddy : ఎక్కడికి రమ్మంటావ్..ప్లేస్ చెప్పు నేనేంటో చూపిస్తా

YS Jagan: కోనసీమ ప్రజలకు శుభాకాంక్షలు

నాచారంలో దారుణం జరిగింది. అన్నను తమ్ముడు హత్య

Photos

+5

థాయ్‌లాండ్‌లో సంక్రాంతికి వస్తున్నాం బ్యూటీ బర్త్‌ డే సెలబ్రేషన్స్ (ఫోటోలు)

+5

హీరోయిన్ లయ సంక్రాంతి బొమ్మల కొలువు (ఫోటోలు)

+5

సంక్రాంతి పతంగులు ఎగరేస్తోన్న అనసూయ (ఫోటోలు)

+5

సంక్రాంతి సంబురాల్లో సినీ ప్రముఖులు (ఫోటోలు)

+5

ప్రముఖ సినీ నిర్మాత 'అచ్చిరెడ్డి' బర్త్‌డే వేడుకలో సెలబ్రిటీలు (ఫోటోలు)

+5

థ్యాంక్స్‌ మీట్‌లో 'మన శంకర వరప్రసాద్ గారు' చిత్ర యూనిట్‌ (ఫోటోలు)

+5

భోగి మంటల్లో బాబుగారి జీవో.. చిత్రాలు

+5

శిల్పారామంలో సంక్రాంతి సంబరాల సందడి (ఫొటోలు)

+5

గ్రాండ్‌గా కృతి సనన్ సిస్టర్‌ నుపుర్ సనన్ పెళ్లి వేడుక (ఫొటోలు)

+5

చంద్రబాబుకు మాత్రమే తెలిసిన స్కిల్‌ ఇది (ఫొటో స్టోరీ)