Breaking News

ఒక్క రోజులో.. రైల్వే సరికొత్త రికార్డు!

Published on Thu, 01/15/2026 - 05:00

సరుకు రవాణా రంగంలో భారతీయ రైల్వే మరో కీలక మైలురాయిని అధిగమించింది. డెడికేటెడ్ ఫ్రైట్ కారిడార్ (DFC) నెట్‌వర్క్‌లో ఒకే రోజులో రికార్డు స్థాయిలో 892 రైళ్లను ఇంటర్‌చేంజ్ చేయడం ద్వారా కార్యాచరణ సామర్థ్యంలో కొత్త బెంచ్‌మార్క్‌ను నెలకొల్పింది.

డెడికేటెడ్ ఫ్రైట్ కారిడార్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (DFCCIL) వెల్లడించిన వివరాల ప్రకారం.. జనవరి 5న డీఎఫ్‌సీ నెట్‌వర్క్‌, భారతీయ రైల్వేకు చెందిన ఐదు జోన్ల మధ్య మొత్తం 892 సరుకు రైళ్ల మార్పిడి జరిగింది. అంతకుముందు జనవరి 4న నమోదైన 865 రైళ్ల ఇంటర్‌చేంజ్‌ రికార్డును ఇది అధిగమించింది. ఈ ఘనతతో సంప్రదాయ రైలు మార్గాలపై ఒత్తిడి తగ్గడంతో పాటు, ప్రయాణికుల రైళ్ల నిర్వహణ మరింత సమయపాలనతో, సౌకర్యవంతంగా మారిందని రైల్వే అధికారులు తెలిపారు.

అదే సమయంలో, నిత్యావసర వస్తువుల వేగవంతమైన రవాణా, లాజిస్టిక్స్ ఖర్చుల తగ్గుదల ద్వారా దేశ ఆర్థిక వ్యవస్థకు కూడా గణనీయమైన ప్రయోజనం లభించింది. ఈ ఘనత డీఎఫ్‌సీసీఐఎల్‌ మెరుగైన కార్యాచరణ సామర్థ్యం, దృఢమైన ప్రణాళిక, సమర్థవంతమైన ట్రాఫిక్ మేనేజ్‌మెంట్‌కు నిదర్శనంగా నిలుస్తోంది.

రైళ్ల వేగ నియంత్రణ, సురక్షిత హెడ్‌వేలు, పొరుగు స్టేషన్ల మధ్య సమన్వయం వంటి చర్యలతో భారీ లోడుతో కూడిన విభాగాల్లోనూ సురక్షితమైన, ఇంధన సామర్థ్యంతో కూడిన, అంతరాయం లేని రవాణా సాధ్యమవుతోందని అధికారులు పేర్కొన్నారు.

Videos

ఆ దేశాలపై ట్రంప్ .. ఉక్కుపాదం

Kasu Mahesh: చనిపోయే వ్యక్తిపై కూటమి కేసు ఎవరినీ వదిలిపెట్టం

విజయ్ కు షాక్.. జన నాయగన్ సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ

'సంస్కార హీనుడు చంద్రబాబు కాకాణి గోవర్ధన్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు

మంత్రి గారి బాగోతం.. గుడ్ మార్నింగ్ ధర్మవరంపై కేతిరెడ్డి

టీడీపీ గుండాల దాడిలో YSRCP కార్యకర్త సాల్మన్ మృతి

తెలంగాణలో మున్సిపల్ ఎన్నికలకు రిజర్వేషన్లు ఖరారు

సంక్రాంతికి హెలికాప్టర్‌ రైడ్‌ ..!

గోవింద రెడ్డి ఆరోగ్యం విషమం

జపాన్ లో పుష్పరాజ్: Allu Arjun

Photos

+5

ప్రముఖ సినీ నిర్మాత 'అచ్చిరెడ్డి' బర్త్‌డే వేడుకలో సెలబ్రిటీలు (ఫోటోలు)

+5

థ్యాంక్స్‌ మీట్‌లో 'మన శంకర వరప్రసాద్ గారు' చిత్ర యూనిట్‌ (ఫోటోలు)

+5

భోగి మంటల్లో బాబుగారి జీవో.. చిత్రాలు

+5

శిల్పారామంలో సంక్రాంతి సంబరాల సందడి (ఫొటోలు)

+5

గ్రాండ్‌గా కృతి సనన్ సిస్టర్‌ నుపుర్ సనన్ పెళ్లి వేడుక (ఫొటోలు)

+5

చంద్రబాబుకు మాత్రమే తెలిసిన స్కిల్‌ ఇది (ఫొటో స్టోరీ)

+5

'నారీ నారీ నడుమ మురారి' మూవీ ప్రెస్‌మీట్‌ (ఫొటోలు)

+5

'అనగనగా ఒక రాజు' మూవీ ప్రీరిలీజ్‌ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

అందంగా కవ్విస్తూనే యాక్షన్‌ మోడల్‌లో రాజాసాబ్‌ బ్యూటీ (ఫోటోలు)

+5

తిరుమల శ్రీవారిని దర్శించుకున్న సీనియర్‌ నటులు విజయకుమార్ (ఫోటోలు)