Breaking News

మొబైల్‌ ఫోన్ల తయారీ @ 75 బి.డాలర్లు

Published on Wed, 01/14/2026 - 10:47

మొబైల్‌ ఫోన్లకు తయారీ ఆధారిత ప్రోత్సాహక పథకం (పీఎల్‌ఐ) దన్నుతో దేశీయంగా మొబైల్‌ ఫోన్ల ఉత్పత్తి ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2026–27) ఆఖరు నాటికి 75 బిలియన్‌ డాలర్లకు చేరే అవకాశం ఉందని ఇండియా సెల్యులార్‌ అండ్‌ ఎలక్ట్రానిక్స్‌ అసోసియేషన్‌ (ఐసీఈఏ) అంచనా వేస్తోంది. ఇందులో ఎగుమతులు 30 బిలియన్‌ డాలర్ల స్థాయిలో ఉండొచ్చని భావిస్తోంది. ఐసీఈఏ చైర్మన్‌ పంకజ్‌ మహీంద్రూ ఈ విషయాలు వెల్లడించారు.

2026 మార్చితో పీఎల్‌ఐ స్కీము ముగియనుండటం పరిశ్రమకు మరో కీలక మైలురాయిగా నిలుస్తుందన్నారు. వివిధ ప్రోడక్టుల విభాగాలవ్యాప్తంగా భారత్‌ తయారీ సామర్థ్యాలను బట్టి తదుపరి దశ వృద్ధి ఆధారపడి ఉంటుందని మహీంద్రూ చెప్పారు. మరోవైపు, భారత్‌ దాదాపు 30 కోట్ల యూనిట్ల మొబైల్‌ ఫోన్ల ఉత్పత్తి స్థాయికి చేరుతుందని మార్కెట్‌ రీసెర్చ్, అనాలిసిస్‌ సంస్థ కౌంటర్‌పాయింట్‌ సహ వ్యవస్థాపకుడు నీల్‌ షా తెలిపారు.

2025లో భారత్‌లో తయారైన ప్రతి నాలుగు ఫోన్లలో ఒకటి ఎగుమతయ్యిందని చెప్పారు. టెక్‌ దిగ్గజం యాపిల్‌ కారణంగా అమెరికా మార్కెట్‌ ప్రీమియం ఉత్పత్తులకు అతి పెద్ద ఎగుమతుల మార్కెట్‌గా నిలిచిందని పేర్కొన్నారు. శాంసంగ్, మోటరోలా వల్ల కూడా గణనీయంగా విలువ చేసే ఎగుమతులు నమోదైనట్లు తెలిపారు.

ఇదీ చదవండి: పండగవేళ పసిడి దూకుడు.. తులం ఎంతంటే..

Videos

గుడివాడ అమర్నాథ్ ఇంట్లో భోగి సంబరాలు

జర్నలిస్టుల అరెస్టులపై జగ్గారెడ్డి రియాక్షన్

భోగి మంటల్లో కూటమి మేనిఫెస్టో.. పోలీసుల వాగ్వాదం

బొత్స ఇంటి వద్ద భోగి సంబరాలు

Guntur: చిన్నారులతో YSRCP నేతల భోగి సంబరాలు

Devineni : పీపీపీ విధానానికి వ్యతిరేకంగా భోగి మంటల్లో జీఓలు

Vijaya Dairy : ఎన్నిక చెల్లదు! భూమా తమ్ముడికి బిగ్ షాక్

ఎయిర్ పోర్ట్ మధ్యలో నిలబడి మంతనాలు: రాహుల్ గాంధీ

ఉష శ్రీ చరణ్ భోగి సంబరాలు

CPI leaders: భోగి మంటల్లో సర్కార్ జీవోల దగ్ధం

Photos

+5

ప్రముఖ సినీ నిర్మాత 'అచ్చిరెడ్డి' బర్త్‌డే వేడుకలో సెలబ్రిటీలు (ఫోటోలు)

+5

థ్యాంక్స్‌ మీట్‌లో 'మన శంకర వరప్రసాద్ గారు' చిత్ర యూనిట్‌ (ఫోటోలు)

+5

భోగి మంటల్లో బాబుగారి జీవో.. చిత్రాలు

+5

శిల్పారామంలో సంక్రాంతి సంబరాల సందడి (ఫొటోలు)

+5

గ్రాండ్‌గా కృతి సనన్ సిస్టర్‌ నుపుర్ సనన్ పెళ్లి వేడుక (ఫొటోలు)

+5

చంద్రబాబుకు మాత్రమే తెలిసిన స్కిల్‌ ఇది (ఫొటో స్టోరీ)

+5

'నారీ నారీ నడుమ మురారి' మూవీ ప్రెస్‌మీట్‌ (ఫొటోలు)

+5

'అనగనగా ఒక రాజు' మూవీ ప్రీరిలీజ్‌ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

అందంగా కవ్విస్తూనే యాక్షన్‌ మోడల్‌లో రాజాసాబ్‌ బ్యూటీ (ఫోటోలు)

+5

తిరుమల శ్రీవారిని దర్శించుకున్న సీనియర్‌ నటులు విజయకుమార్ (ఫోటోలు)