Bolla Brahmanaidu: సంబంధం లేని వ్యక్తులను అన్యాయంగా అరెస్ట్ చేస్తున్నారు..
Breaking News
ఐఫోన్ యూజర్లకు యాపిల్ అత్యవసర హెచ్చరిక
Published on Mon, 01/12/2026 - 16:51
ప్రముఖ టెక్ దిగ్గజం యాపిల్ తన ఐఫోన్ వినియోగదారులకు ఒక అరుదైన, ముఖ్యమైన భద్రతా హెచ్చరికను జారీ చేసింది. కొంతమంది వినియోగదారులను లక్ష్యంగా చేసుకుని అధునాతనమైన ‘స్పైవేర్’ దాడులు జరుగుతున్నట్లు కంపెనీ గుర్తించింది. ఈ దాడులు ఎంత శక్తివంతమైనవంటే, సాధారణ సాఫ్ట్‌వేర్ అప్‌డేట్ల ద్వారా కూడా వీటిని పూర్తిగా నిరోధించడం యాపిల్‌కు సవాలుగా మారింది.
ఏమిటీ దాడులు?
ఇవి సాధారణంగా మనం చూసే వైరస్‌లు లేదా ఫిషింగ్ లింక్‌ల వంటివి కావు. ఇవి ‘జీరో-క్లిక్’ సాంకేతికతను ఉపయోగిస్తాయి. అంటే, వినియోగదారు ఎటువంటి లింక్‌ను క్లిక్ చేయకపోయినా, ఏ అటాచ్‌మెంట్‌ను ఓపెన్ చేయకపోయినా.. కేవలం ఒక మెసేజ్ రావడం ద్వారా లేదా బ్యాక్‌గ్రౌండ్ ప్రాసెస్ ద్వారా ఫోన్ హ్యాక్ అయ్యే ప్రమాదం ఉంది.
సాధారణంగా ఇవి జర్నలిస్టులు, రాజకీయ నాయకులు, దౌత్యవేత్తలు, కార్యకర్తలు, ఉన్నత స్థాయి అధికారులను లక్ష్యంగా చేసుకుని జరుగుతుంటాయి. ఈ దాడులకు సంబంధించిన విషయాలు యాపిల్ సంస్థకు కూడా తెలిసే అవకాశం ఉండకపోవచ్చు. అందుకే వీటిని ప్యాచ్ చేసేలోపే జరగాల్సిన నష్టం జరిగిపోవచ్చు.
ఐఓఎస్ 26 అప్‌డేట్ ఎందుకు ముఖ్యం?
ప్రస్తుతం యాపిల్ తన అత్యంత సురక్షితమైన ఐఓఎస్ 26 వెర్షన్‌ను అందుబాటులోకి తెచ్చింది. అయితే, ఇది ఐఫోన్ 11, ఆపై మోడళ్లలో మాత్రమే అనుకూలంగా ఉంటుందని కొందరు చెబుతున్నారు. కీలకమైన సెక్యూరిటీ ప్యాచ్‌లు కేవలం ఐఓఎస్ 26లో మాత్రమే అందుబాటులో ఉంటాయి. పాత వెర్షన్లకు (ఉదాహరణకు ఐఓఎస్ 18) యాపిల్ ఇకపై ప్యాచ్‌లను అందించదని కొందరు చెబుతున్నారు.
ఇదీ చదవండి: పండుగ షాపింగ్.. భారీ డిస్కౌంట్లు కావాలా?
ఇప్పుడేం చేయాలి?
మీ డేటా, వ్యక్తిగత సమాచారం సురక్షితంగా ఉండాలంటే వెంటనే కొన్ని చర్యలు తీసుకోవాలి. మీ ఫోన్ ఐఫోన్ 11 లేదా ఆపై మోడల్ అయితే వెంటనే Settings > General > Software Update లోకి వెళ్లి iOS 26కు అప్‌డేట్ చేయండి.
కనీసం రోజుకు ఒక్కసారైనా ఫోన్‌ను రీబూట్ చేయడం వల్ల బ్యాక్‌గ్రౌండ్‌లో నడుస్తున్న అనుమానాస్పద ప్రక్రియలు ఆగిపోయే అవకాశం ఉంది.
మీరు ఒకవేళ కీలక వ్యక్తి అయి, మిమ్మల్ని లక్ష్యంగా చేసుకునే అవకాశం ఉందని భావిస్తే ఫోన్‌లోని ‘లాక్‌డౌన్ మోడ్’ను ఆన్ చేయండి. ఇది వెబ్ బ్రౌజింగ్, మెసేజ్ అటాచ్‌మెంట్స్ వంటి కొన్ని ఫీచర్లను పరిమితం చేస్తుంది. హ్యాకర్లకు మీ ఫోన్ పట్టుబడకుండా రక్షణ కవచంలా పనిచేస్తుంది.
సైబర్ దాడులు నిరంతరం మారుతుంటాయి. కాబట్టి సాఫ్ట్‌వేర్ అప్‌డేట్లను ఎప్పటికప్పుడు ఇన్‌స్టాల్ చేసుకోవడమే ఐఫోన్ వినియోగదారులకు ఉన్న అత్యుత్తమ రక్షణ అని గమనించాలి.
Tags : 1