ABN కాదు TDP ఛానల్ అని పెట్టుకోండి.. రాధాకృష్ణ, వెంకట్ కృష్ణను అరెస్ట్ చెయ్యాలి
Breaking News
కొత్త కార్లు వచ్చేస్తున్నాయ్.. లేటెస్ట్ లాంచింగ్‌లు
Published on Sun, 01/11/2026 - 13:43
నూతన సంవత్సరంలో పలు కొత్త కార్లు సందడి చేయనున్నాయి. ముఖ్యంగా స్పోర్ట్ యుటిలిటీ వెహికల్(ఎస్‌యూవీ) విభాగపు కార్ల హడావిడి అధికంగా ఉండనుంది. ఇప్పటికే కొన్ని కార్లను ప్రవేశపెట్టగా మరికొన్నింటిపై కంపెనీలు కసరత్తు చేస్తున్నాయి. దిగ్గజ కంపెనీలైన మహీంద్రా అండ్ మహీంద్రా, కియా ఇండియా, రెనో, నిస్సాన్ మొదలైనవి తమ ఎస్‌యూవీ మోడళ్లకు అప్‌డేటెడ్, ఫేస్‌లిఫ్ట్ వెర్షన్లతో పాటు గతంలో ప్రజాదరణ పొందిన కార్లను మళ్లీ మార్కెట్లోకి విడుదల చేసేందుకు సిద్ధమయ్యాయి. ఎకానమీ నుంచి లగ్జరీ సెగ్మెంట్ వరకూ అన్ని ధరల రేంజ్‌లో లభించనున్నాయి. మొత్తంగా ఈ ఏడాది భారతీయ ఎస్‌యూవీ మార్కెట్ అత్యంత రద్దీగా ఉంటుందని ఆటో పరిశ్రమ నిపుణులు చెబుతున్నారు.
ఎస్‌యూవీల దూకుడు
ఎస్‌యూవీ కార్లకు డిమాండ్ కొనసాగుతూనే ఉంది. హ్యాచ్‌బ్యాక్‌లు, సెడాన్‌లు, మల్టీ–పర్పస్ వెహికల్స్ (ఎమ్‌పీవీలు)ను అధిగమించి ఆటో మార్కెట్‌పై ఎస్‌యూవీ విభాగం ఆధిపత్యం చూపుతోంది. విస్తృతమైన ఇంటీరియర్స్, మెరుగైన గ్రౌండ్ క్లియరెన్స్, రోజువారీ వినియోగానికి పనికివచ్చే సౌకర్యాల కారణంగా ‘ఎస్‌యూవీ’లు కస్టమర్లకు తొలి ఎంపికగా మారుతోంది. ఆటో కంపెనీలు ఈ డిమాండ్‌ను అందిపుచ్చుకునేందుకు సన్నద్ధమయ్యాయి. ఎంట్రీ లెవల్ నుంచి ప్రీమియం ధరల శ్రేణిలో కొత్త మోడళ్లు, ప్రధాన ఫేస్‌లిఫ్ట్‌లను అందుబాటులోకి తెస్తున్నాయి.

మారుతీ సుజుకి ఈ–విటారా
మారుతీ సుజుకి ఈ–విటారా కూడా జనవరిలోనే లాంచ్ అవుతోంది. మారుతీ ఫస్ట్ ఫుల్ ఎలక్ట్రిక్ ఎస్‌ఈవీ కారుగా రానుంది. 49కేడబ్ల్యూహెచ్, 61కేడబ్ల్యూహెచ్ రెండు బ్యాటరీ ప్యాక్‌లు ఉంటాయి. 543 కిలోమీటర్ల వరకు రేంజ్ కలిగి ఉందని నివేదికలు చెబుతున్నాయి. డ్యూయల్ స్క్రీన్ సెటప్, 360–డిగ్రీ కెమెరా లెవల్ 2 ఏడీఎస్ వంటి ఫీచర్లు ఈ–విటారాను మరింత మోడ్రన్ ఈవీగా ఈ కారు ధర రూ. 15 లక్షల నుంచి రూ. 25 లక్షల మధ్య ఉంటుందని అంచనా.

టాటా సఫారీ, హ్యారియర్
టాటా మోటార్స్ ఏళ్ల నిరీక్షణకు తెరతీస్తూ తన ప్రసిద్ధ సఫారీ, హారియర్ ఎస్‌యూవీలకు పెట్రోల్ ఇంజిన్ వెర్షన్లను పరిచయం చేసింది. 1.5 లీటర్ సామర్థ్యంతో కొత్త టర్బో–పెట్రోల్ ఇంజిన్‌ను టాటా మోటార్స్ ఈ రెండు ఎస్‌యూవీలకు అందిస్తోంది. కొత్త టర్బో–పెట్రోల్ ఇంజిన్ స్మార్ట్ ట్రిమ్ నుంచి ప్రారంభమై సఫారీ, హారియర్‌లలో వరుసగా అకంప్లి‹Ù్డ అల్ట్రా, ఫియర్‌లెస్ అల్ట్రా వేరియంట్‌ల వరకు అందుబాటులో ఉంది. హ్యారియర్ పెట్రోల్ ధర రూ. 12.80 లక్షల నుంచి సఫారీ రేటు రూ. 13.29 లక్షల నుంచి (ఢిల్లీ ఎక్స్‌షోరూం) ప్రారంభమవుతుంది.

న్యూ–జెన్ సెల్టోస్
కియా ఇండియా సెల్టోస్ కొత్త వెర్షన్‌గా ‘న్యూ–జెన్ సెల్టోస్’ పేరుతో అధికారంగా లాంచ్ అయ్యింది. హెచ్‌టీఈ నుంచి జీఎస్‌ఎక్స్(ఏ), ఎక్స్–లైన్ వరకు వివిధ వేరియంట్లలో ఇది లభిస్తుంది. అప్‌గ్రేడ్ చేసిన ఫీచర్లతో, పూర్తిగా రీడిజైన్ చేసిన ఇంటీరియర్స్ ఇందులో ఉన్నాయి. ప్రారంభ ధర రూ.10.99 లక్షలుగా ఉంది. టాప్ ఎండ్ వేరియంట్ ధర రూ.19.99 లక్షల వరకు ఉంటుంది.

స్కోడా కుషాక్ ఫేస్‌లిఫ్ట్
స్కోడా కుషాక్ ఫేస్‌లిఫ్ట్ వెర్షన్ జనవరి మధ్యలో లాంచ్ కానుంది. ఈ అప్‌డేట్‌లో ఫ్రంట్ గ్రిల్, బంపర్లు ఎల్‌ఈడీ టెయిల్‌లైట్‌లను మరింత షార్ప్‌గా చేస్తున్నారు. పనోరమిక్ సన్‌రూఫ్, 360–డిగ్రీ కెమెరా, లెవెల్ 2 అడాస్ వంటి ఫీచర్లు క్యాబిన్‌ని మరింత ప్రీమియంగా కనిపించేలా చేస్తాయి. ఈ కారు ధర రూ. 11 లక్షల నుంచి రూ.19 లక్షల మధ్య ఉండే అవకాశం ఉంది.

మహీంద్రా ఎక్స్‌యూవీ 7ఎక్స్‌ఓ
మహీంద్రా తన ఫ్లాగ్‌షిప్ ఎస్‌యూవీ ‘ఎక్స్‌యూవీ700’ని పూర్తిగా రీబ్రాండ్ చేసి ఫేస్‌లిఫ్ట్ వెర్షన్ ‘ఎక్స్‌యూవీ 7ఎక్స్‌ఓ’గా లాంచ్ చేసింది. డ్యాష్‌బోర్డ్‌పై మూడు స్క్రీన్లు, టూ–స్పోక్ స్టీరింగ్ వీల్ వంటి లగ్జరీ ఫీచర్లు ఇందులో ఉన్నాయి. పానోరమిక్ సన్‌రూఫ్, అంబియంట్ లైటింగ్, బాస్ మోడ్ వంటి ఫీచర్లు ఉన్నాయి. దీని ధర రూ. 13.89 లక్షల నుంచి ప్రారంభమవుతుంది.

రెనో డస్టర్
సబ్–కాంపాక్ట్ ఎస్‌యూవీ అయిన రెనో డస్టర్, భారత మార్కెట్లోకి రీ–ఎంట్రీ ఇస్తోంది. ఇది ఈ నెలలో (జనవరి) కొత్త మోడల్‌తో లాంచ్ అవుతోంది. కొత్త జనరేషన్ డస్టర్ సీఎంఎఫ్–బీ ప్లాట్‌ఫామ్‌పై తయారయ్యే డస్టర్ .. లుక్ మరింత ప్రొఫెషనల్‌గా ఉంటుంది. లోపలి భాగంలో 10.1–అంగుళాల టచ్‌్రస్కీన్, ప్రీమియం ఇంటీరియర్ ఫుల్ అడాస్ ప్యాకేజీని కలిగి ఉంటుందని భావిస్తున్నారు.
Tags : 1