Breaking News

'స్పిరిట్‌' పోస్టర్‌పై ప్రభాస్‌ కామెంట్‌.. 'సందీప్‌' వివరణ

Published on Thu, 01/08/2026 - 16:38

ప్రభాస్‌-  సందీప్‌రెడ్డి వంగా  కాంబినేషన్‌ నుంచి తెరకెక్కుతున్న హైఓల్టేజ్‌ యాక్షన్‌ మూవీ ‘స్పిరిట్‌’..  కొత్త ఏడాది సందర్భంగా ఆ మూవీ నుంచి అదరిపోయే పోస్టర​్‌ను  దర్శకుడు సందీప్‌ రిలీజ్‌ చేశారు. స్పిరిట్‌ మూవీలో ప్రభాస్‌ లుక్‌ను చూసి ఫ్యాన్స్‌ ఫిదా అయిపోయారు. బాలీవుడ్‌ నుంచి కూడా మంచి రెస్పాన్స్‌ వచ్చింది. వెండితెరపై ఎన్నడూ చూడని సరికొత్త అవతారంలో డార్లింగ్‌ కనిపించారు. ఒళ్లంతా గాయాలతో తను ఉండగా.. ఆయన ముందు త్రిప్తి దిమ్రీ నిలబడి ఉంది. చేతిలో వైన్‌ బాటిల్‌తో మరింత  ఫైర్‌ను పెంచాడు. అందరినీ మెప్పించిన పోస్టర్‌పై సందీప్‌, ప్రభాస్‌ తాజాగా ఒక ఇంటర్వ్యూలో రియాక్ట్‌ అయ్యారు.

ప్రభాస్‌ నటించిన ది రాజాసాబ్‌ మూవీ జనవరి 9న విడుదల కానుంది. ఈ క్రమంలో దర్శకుడు సందీప్‌ రెడ్డి హోస్ట్‌గా ప్రభాస్‌, మాళవిక మోహనన్‌, రిద్ధి కుమార్‌, నిధి అగర్వాల్‌లతో ఇంటర్వ్యూ చేశారు. ఈ క్రమంలోనే వారు స్పిరిట్‌ ఫస్ట్‌ లుక్‌ గురించి ప్రభాస్‌ ఇలా అన్నారు. 'నా కెరీర్‌లోనే ఇది బెస్ట్ పోస్టర్‌.. కల్ట్ పోస్టర్‌' అంటూ  దర్శకుడు సందీప్‌ను మెచ్చుకున్నారు.  ఇలాంటి ఆలోచన సందీప్‌కి ఎలా వచ్చిందోగానీ అదిరిపోయిందంటే డార్లింగ్‌ ప్రశంసించారు.  అయితే, సందీప్‌ రెడ్డి కూడా పోస్టర్‌ వెనుక జరిగిన కసరత్తు గురించి చెప్పుకొచ్చారు.  బాహుబలి తర్వాత అంతే రేంజ్‌లో ప్రభాస్‌‌ను  చూపించాలని ఆలోచించానని.. అందుకే ఆ పోస్టర్‌ను రెడీ చేశానన్నారు. అయితే, సినిమాలో ఒక సీన్‌ నుంచి  ఆ పోస్టర్‌ను తీసుకున్నట్లు ఆయన పేర్కన్నారు.
 

Videos

Bapatla: కళ్లకు గంతలు కట్టి.. యువతిని చావబాదిన సీఐ, ఎస్సై

తెలంగాణలో మొదలైన మున్సిపల్ ఎన్నికల హడావిడి

బాబుకు చెంపపెట్టు.. టీడీపీ గుట్టురట్టు

Allu Arjun: పుష్ప టార్గెట్ చేశాడంటే..! నీయవ్వ తగ్గేదేలే

పోలీసుల నిర్లక్ష్యానికి దివ్యాంగురాలు బలి

200 మందితో అటాక్.. 9 ఎకరాల భూ కబ్జా!

Toxic Movie: టీజర్ తో మెంటలెక్కించాడుగా

తప్పుడు వార్తలతో అమరావతి రైతులపై కుట్ర

ఇదేమన్నా మీ ఇంటి వ్యవహారం అనుకున్నారా.. ఏకిపారేసిన సాకే శైలజానాథ్

Jada Sravan: ఏపీలో ముగ్గురేనా మంత్రులు.. మిగతా మంత్రులకు సిగ్గు లేదా

Photos

+5

రెడ్ శారీలో మెరిసిపోతున్న హీరోయిన్ నిధి అగర్వాల్

+5

నగరంలో హీరోయిన్‌ డింపుల్‌ హయతీ సందడి (ఫొటోలు)

+5

విజయవాడలో ఘనంగా మహిళా ఫెస్ట్‌ (ఫొటోలు)

+5

ట్రెండింగ్‌లో రాజాసాబ్.. డార్లింగ్ ప్రభాస్ ఫోటోలు చూశారా?

+5

జూబ్లీహిల్స్‌లో ‍సందడి చేసిన సినీ నటి నివేదా పేతురాజ్ (ఫొటోలు)

+5

అర్థరాత్రి విమల్ థియేటర్ వద్ద ప్రభాస్ ఫ్యాన్స్ రచ్చ రచ్చ (ఫొటోలు)

+5

'అనగనగా ఒక రాజు'లో మీనాక్షి చౌదరి.. ట్రెండింగ్‌లో ఫోటోలు

+5

'అనగనగా ఒక రాజు' ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌లో సెలబ్రిటీలు (ఫోటోలు)

+5

తిరుమల శ్రీవారిని దర్శించుకున్న బ్రహ్మానందం, మంగ్లీ (ఫోటోలు)

+5

చంద్రబాబుది విలన్‌ క్యారెక్టర్‌.. ఆధారాలతో ఏకిపారేసిన వైఎస్‌ జగన్‌ (ఫొటోలు)