తెలంగాణలో మొదలైన మున్సిపల్ ఎన్నికల హడావిడి
Breaking News
యాక్సిస్ బ్యాంక్ యాప్‌లో ‘సేఫ్టీ సెంటర్’
Published on Thu, 01/08/2026 - 12:14
డిజిటల్ మోసాల బారిన పడకుండా కస్టమర్లు తమ ఖాతాలను స్వయంగా నియంత్రించుకునే వీలు కల్పిస్తూ యాక్సిస్ బ్యాంక్ తమ మొబైల్ యాప్ ‘ఓపెన్’లో ‘సేఫ్టీ సెంటర్’ ఫీచరును ప్రవేశపెట్టింది. సందేహాస్పద సందర్భాల్లో ఇంటర్నెట్ బ్యాంకింగ్‌కి యాక్సెస్‌ని డిసేబుల్ చేసేందుకు, ఫండ్ ట్రాన్స్‌ఫర్లను బ్లాక్ చేసేందుకు, యూపీఐ చెల్లింపులను నియంత్రించేందుకు, పరిమితులను సెట్ చేసేందుకు, కొత్త పేయీలను జోడించకుండా నివారించేందుకు ఇది సహాయకరంగా ఉంటుంది.
దీనితో కస్టమర్ కేర్ సెంటర్ లేదా బ్రాంచీలపై ఆధారపడాల్సిన అవసరం లేకుండా ఖాతాను స్వయంగా నియంత్రించుకోవచ్చని బ్యాంకు తెలిపింది. అలాగే, బ్యాంకు మెసేజీల ప్రామాణికతను ధృవీకరించేలా ఎస్‌ఎంఎస్ షీల్డ్ సేవలను కూడా అందిస్తున్నట్లు వెల్లడించింది. మరోవైపు, కళలు, సాహిత్యానికి సంబంధించిన ష్ల్పాష్ 2025 పోటీలను నిర్వహించినట్లు వివరించింది.
ఇందులో దేశవ్యాప్తంగా 995 పాఠశాలల నుంచి 2.66 లక్షల మంది విద్యార్థులు పాల్గొన్నట్లు బ్యాంకు పేర్కొంది. దక్షిణాదిలో హైదరాబాద్, వైజాగ్ సహా 308 స్కూళ్ల నుంచి 1.01 లక్షల మంది పాల్గొన్నట్లు వివరించింది. ఇందులో ఆరుగురు విజేతలకు రూ. 1 లక్ష చొప్పున, ఆరుగురు రన్నర్స్ అప్‌లకు తలో రూ. 50,000 చొప్పున బహుమతి ఉంటుంది.
Tags : 1